ప్రకృతి లొని ఏ వస్తువు
ప్రతిఫలాపేక్ష కోరదు
అలక పూనదు
అతి రసఫలవృక్షము
తనపై రాళ్ళు వేసినా
ఫలాలనే యిచ్చును
కొమ్మలు నరికినా
మూతి ముడవక
నీడనే యిచ్చును.
నది కాలుష్యకోరలు
కాటు వేస్తున్నా
సుజలాన్ని అందిస్తుంది
సుమ సుగంధము
పాప పుణ్యభేదము లేక
అందరికీ పంచును
అన్నీ తానైన మనిషి
స్వార్ధమే వూపిరిగా
మానవతను మరుగున
పడవేసి మాలిన్యానీ
మనసు నిండానింపుకొని
ప్రకృతి లోని ఏ వస్తువు తో
పోల్చ వీలులేకున్నాడు.