తెలుగు భాష
ఒంపు సొంపుల భాష
శ్రీకాకుళం తెలుగు
సిరులొసగు భాష
విజయనగరం తెలుగు
విజయచిహ్న మైన భాష
విశాఖపట్నం తెలుగు
ఆణిముత్యమైన భాష
తూర్పుగోదావరి తెలుగు
కోనసీమ నారికేళమైన భాష
పశ్చిమ గోదావరి తెలుగు
పనస తొనలవంటి భాష
కౄష్ణా తెలుగు
కౄష్ణ వేణీ తరగల
స్వచమైన భాష.
గుంటూరు తెలుగు
ఘాటైన చిక్కని భాష
ప్రకాశం తెలుగు
ప్రకాశవంతమైన భాష
నెల్లూరు తెలుగు
జాణతనమబ్బిన భాష
చిత్తూరు తెలుగు
అన్నమయ్య పదముల
విరాజిల్లు భాష
కడప తెలుగు
కఠిన పదముల భాష
‘స్వచ్ఛమైన భాష’ అంటూ కృష్ణాజిల్లా పక్షపాతం చూపించేశారే! :)
ReplyDeleteమిగిలిన కోస్తా జిల్లాలూ, తెలంగాణా, రాయలసీమ జిల్లాల భాషల గురించి కూడా ఎంతో కొంత రాసివుంటే మీ సమైక్య(‘ఖ్య’ కాదు) భాష శీర్షిక అర్థవంతంగా ఉండేది.