Thursday, September 16, 2010

vEdana

vమానవత్వం మృగ్యమై మనిషి మృగమైన వేళ సజీవదహనాలకు కొదవేముంటుంది.ప్రాణాలకు విలువేమున్నది.శాస్త్రవిఙానమెంత అభివృద్ది చెందినామారుమూల గ్రామాలలోప్రజల మూఢనమ్మకాలలో మాత్రం మార్పు లేదనడానికి ఈరోజు జరిగిన వృద్దుల సజీవ దహనమే తార్కాణము. ఎంత హృదయవిదారకము.ఆముసలి ప్రాణాలు ఎంత విలవిల లాడాయో కదా!
అమ్మతనాన్ని కూడా శంకించాల్సిన దుస్థితి ఈ మనుషుల్ని రక్షించటానికి ఆభగవంతుడే రా వాలేమో. శరీరానికి మనసుకి ఏ దెబ్బ తగిలినా తొలిగా నోటినుంచి వ చ్చేది అమ్మ అన్న పిలుపు.ఆ అమ్మే కాటేయాలని చూస్తే ఎవరికి చెప్పుకోవాలి. దేవుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడంటారు.ఆమే శాపమైతే? ఎవరికి మొరపెట్టుకోవాలి?ఈ దురాగతాలకు మానసిక దౌర్భల్యమే కారణమా లేక కోర్కెలే కారణమా ?ఇది పురోగమనమా?తిరోగమనమా? ఎటుపోతోంది మానవజాతి?తాను మనిషన్న మాట మరచి జంతు న్యాయాన్ని అనుసరిస్తున్నాడేమో? నర్తించాల్సిన పాదాలు వాతలతో ఎర్రబారితే ఎవరి మనసు ద్రవించదు. ఆచిట్టితల్లి అడిగిందా తనను కనమని. ఆ కళ్ళు మూగగా ప్రశ్నిస్తే ఆతల్లి ఏమని సమాధానం చెప్తుంది? ఈరోజు పెపరులోవార్తలు చదివి నావేదనని ఈనాలుగు మాటలలో వ్యక్త పరిచాను.

1 comment:

  1. konchem paragraphs ga raste chadavataniki vesulu batu ga vuntundi..

    ReplyDelete