Thursday, October 20, 2011
నాయని subbaraau
అనుభవైకవేద్యము,హృదయరంజకము అయినకవితాకర్త నాయని సుబ్బారావు..నెల్లూరుజిల్లా పొదిలి గ్రామంలో20 అక్టొబర్1899 లోజన్మించారు. కుటుంబ వాతావరణం ఆయనకు కవితా సంస్కారం నేర్పింది.పినతండ్రి జానపదగాధలు బాగాతెలిసిన వాడు. గాంధీజీ పిలుపుతోచదువు మధ్యలోఆపిసహాయ నిరాకరణ వుధ్యమంలో పాల్గొన్నాడు. సౌభద్రుని ప్రణయ యాత్ర తోకవితారంభం కావించిన నాయని1925 నాటికి పూర్తిరూపాన్ని ఇచ్చినారు,కులపాలికాప్రణయావిష్కారాన్ని భావ కవితా శాఖలో ప్రతిష్టించిన కవి. యాత్ర అనే శబ్దాన్ని పలువురుకవులు వాడినప్పటికీ ప్రణయ యాత్ర అనినాయని తప్ప మరెవరు వ్రాసినట్లు కనబడదు.సుభద్రకుమారుడు సౌభద్రుడు.బలరాముడు తనకుమార్తెనుపాండవులు అఙాతవాసం లోఉండడంతో లక్ష్మన కుమారునికి ఇచ్చిచెయాలని అనుకుంటాడు.నాయనిప్రేమకధ దీనినిపోలిఉంటుంది.ప్రణయానికి వివాహమే సాఫల్యసిద్దిగాచెప్పబడుతుంది.అంతశ్రమపడి పావనమభ్రగంగ ధారుణికి తెచ్చినాడుభగీరధుడు. అన్ననాయని గీతంలో భావనాలోకవిహారీయిన ప్రణయం భౌతికలోకానికి తీసుకురావడం సూచితమైనది.ఫలస్రుతిలో మనముమేనత్తమేనమమలబలమ్ము అనితమది మేన సంబందమని భార్య వత్సల అనితెలియజేసినాడు. ఆమెను ఉపాసనాధిదే వతగా జీవనధాత్రిగా పరాత్పరంగావర్ణించినాడు.ప్రేయసికిప్రియునిహృదయం స్థానమని చెప్పి స్త్రీకి గల స్థానాన్ని ప్రాధాన్యాన్ని ధ్వనింపజేసినాడు.స్త్రీలేకుండా పురుషుడు యష్టి మాత్రుడు.ఆమెలేకుండాతడు యజ్ఙాదులు అతిధిదేవపూజలు చేయడానికి అనర్హుడని తెలియజేసినాడు .మల్లెపూవుగా,మలయ పవనంగా,గులాబిగా,పికముగా,సారసముగా, భ్రమరకాంతగా,వానచినుకుగా భావనచేశాడు. ప్రకృతి సౌందర్యమే తనప్రేయసి అని సూచన చేసినట్లుంది. అందుకే విశ్వనాధ ఒకలోకోత్తరమైన అనుభూతి వచ్చేటప్పటికి అతని గీతాశక్తి పండిన దానిమ్మ కాయవలె పగిలింది అంటారు.తల్లి మరణించిన దుః ఖంలో మాతృగీతాలు వ్రాసారు. ఎవ్వడాక్రూరకర్మట్టుడు ఎవడునీల జలద నిర్ముక్త శైశిర శర్వరీ ప్రశాంత మలవాటు పడిన నిశాంత మందు అకటనట్టింట దీపమ్ము నార్పినాడు.అని దఃఖించినాడు.కుమారుని మరణం విషాదమోహనంగా వెలువడినది.తన జన్మస్థలం పొదిలి చుట్టూ అల్లబడిన కావ్యం జన్మభూమిని1960లో వ్రాసారు. భారతీయసంస్కృతి జాతిజీవనవిధానం అభివ్యక్తం కావడం వలన ప్రతి భారతీయుదు తన జన్మభూమిని ఇందు దర్సించవచ్చు.నాయని మితభాషి. శాంతిప్రియుడు.మంచిహాస్యప్రియుడు. రేడియోలో పనిచేసినాఇదు సంవత్సరాలకాలంలో అనేక నాటికలు కథలు, పాటలువ్రశారు.వలపులో,విరహంలో, వేదనలోమాతృప్రేమలోఈయన కవిత్వానికిహృదయంగీటురాయి.ప్రతిపదంలోనుజీవిస్తారు.అందుకేనాయని గీతాలు ఉజ్జ్వలములు,ఉన్నతములు ఈరోజు నాయని జన్మదిన సందర్భంగా ఆయనను స్మరించుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం.
Subscribe to:
Post Comments (Atom)
మీ వ్యాసాన్ని చదివాను.అభినందనలు.నేను 2010లో ప్రచురించిన నా'వెన్నెల వెలుగులు 'అనే వ్యాససంపుటిలో వ్రాసిన 'నాయని సుబ్బారావు కృతులు -తెలుగులో విషాద కావ్యాలు 'అన్న వ్యాసాన్ని చదవమని విజ్ఞప్తి చేస్తున్నాను. అందులో 'సౌభద్రుని ప్రణయ యాత్ర ' గురించి మాత్రం నేను రాయలేదు.మిగిలిన వాటి గురించి వ్రాసాను.==కమనీయం
ReplyDelete