ఒకటి గొని,రెంటి నిశ్చల యుక్తి జేర్చి,
మూటి నాల్గింట గడు వశ్యములుగ జేసి,
యేనిటిని గెల్చి, యారిటి నెఱిగి,యేడు
విడిచి వర్తించు వాడు వివేకధనుడు.
భగవంతునిపై నిశ్చలమైన మనస్సును ,భక్తిని నిలిపి త్రికరణ శుధ్ధిగా చతుర్విధ పురుషార్ధాలను వశము చేసుకొని,పంచేంద్రియములను గెలిచి అరిషడ్వర్గములను తెలిసికొని, సప్తవ్యసనములకు దూరంగా నడచు వాడే వివేకవంతుడు .----అని విదురుడు మహాభారతం లో ధృతరాష్ట్రునికి చెప్పాడు.కాని ఇది సర్వకాల సర్వావస్థలలోను ఆచరిచ దగినది.
అరిషడ్వర్గాలు---కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యములు.
సప్తవ్యసనములు---జూదము,మాంసము,మద్యము,వ్యభిచారము,వేట,దొంగతనము,పరస్త్రీ వ్యామోహము.