Thursday, January 30, 2014

ఆవేదన


         కాయ పండకుండానే
         నేలరాలింది
         ఓ కన్నీటి చుక్క
          రాలింది.
        వికసించకుండానే మొగ్గ
          నలిగింది
       ఓ తల్లి హృదయం
       తల్లడిల్లింది.
       ఎదగకుండానే బాల్యం
       బధ్ధలైంది
       కన్నవారి గుండెలు
      కడలిగా మారాయి.
      అభాగిని అందం
      కాలిపోయింది
     అమ్మయి అంతరంగం
    ఆక్రోశించింది.
   ఈ అకృత్యాలనుగని భరతమాత
     కన్నీరైంది.

No comments:

Post a Comment