గీత గొవింద కారుడిగా ప్రశస్తి పొందినవాడు జయదేవుడు.ఆయన కుటుంబ సంబంధ పదాలతో దశావతారాన్ని పోలుస్తూ చెప్పిన తెలుగు సంకీర్తనం లోని సరస ప్రయోగ చాతుర్యం,మాధుర్యం,లయ మనసుల్ని ఇట్టే ఆకట్టుకుంటాయి.
మా పాప మా వల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరహావతారం
నట్టింట నాయత్త నరసిమ్హావతారం
వాసి గల బొట్టెల్లు వామనావతారం
పరమ గురుదేవ పరశురామావతారం
రంజించు మామయ్య రామావతారం
బంటైన బంధువులు బలరామావతారం
బుధ్ధి తో మా చిట్టి బుధ్ధావతారం
కలివిడితో మా యన్న కల్క్యావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
చిట్టి నా కన్న శ్రీ కృష్ణావతారం.