ఆధ్యాత్మిక,మానసిక,భౌతిక ప్రశాంతతను చేకూర్చే మందిరాలు ప్రపంచవ్యాప్తంగా అనేకంకలవు.అలాంటి మందిరమే అట్లాంటాలోనిలారెన్స్ విల్లేహైవే ప్రక్కన రాక్ బ్రిడ్జె రోడ్డులో 29ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన "స్వామినారాయణ మందిరము".
ప్రముఖ స్వామిమహరాజ్ ఆధ్వర్యంలో ఆగష్టు26,2007కి నిర్మించబడినది.టర్కిష్ లైంస్టోన్ ,ఇటాలియన్ మార్బుల్,ఇండియన్ పింక్ శాండ్ స్టోన్లను భారతదేశం లోని కళాకారులు వివిధ రూపాలలో చెక్కి దాదాపు 34000 పైగా ఆకృతులను అమెరికా తరలించారు.బాగా ఎత్తు మీద నిర్మించబడిన ఈ మందిరము అద్భుతమైన శిల్ప సంపదతోను,రాతి తోరణాలతోను చూపరులను మంత్రముగ్దులను చేస్తుంది.ఉదయం 9 నుండి 10.30,11.15 నుండి12.00,సాయంత్రం 4నుండి6.00 వరకు సందర్శకులకు మందిరం లోపలికి ప్రవేశం ఉంటుంది.ప్రసాదాలు, కొబ్బరికాయలు ఇతర పూజలు వంటి హడావిడి అక్కడ కనిపించదు. పూజారి హారతి ఇస్తారు.భక్తులు నిశ్శబ్దాన్ని పాటిస్తారు.ఎదురుగా పంచలోహాలతో చేసిన భగవాన్ స్వామి నారాయణ విగ్రహము ఉంటుంది.ప్రక్కన రాధాకృష్ణుల విగ్రహాలు కొంచెము ఇవతలగా విఘ్నేశ్వరుడు ,సీతారాములు,శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్టించబడినాయి.ప్రశిష్యుల విగ్రహాలు కూడా కలవు.గుణాతీతానంద స్వామి:-(1785-1867)
వేదాలు,ఉపనిషత్తులు,ఇతిహాసాలు అనేక మత గ్రంధాలను ఆకళింపు చేసుకున్నారు.స్వామినారాయణ మతాన్ని ప్రచారం చెసిన మొదటి గురువుగా ప్రసిధ్ధికెక్కారు.
భగత్జీ మహరాజ్:-(1829-1897)
గుణాతీతానంద స్వామి శిష్యుడు.ఈయన రెండవ గురువు.
శశ్త్రాజీ మహరాజ్:-(1865-1951)
మూడవ గురువు.మహా ఙ్ని.హిందూమతాభిమాని.5 మందిరాలు నిర్మించాడు.గుణాతీతానంద స్వామి(అక్షర),భగవాన్ స్వామినారాయణ(పురుషోత్తం)పేరుతో 1907లో భగవాన్ అక్షర పురుషోత్తమ స్వామి నారాయణసంస్థ ను(బి ఎ పి ఎస్) స్థాపించారు.
ప్రముఖ స్వామి మహరాజ్:-(1921- )
ప్రస్తుత గురువు.ఈయన ఆధ్వర్యంలో BAPS శాఖోపశాఖాలుగా విస్తరించినది.ప్రేమ,శాంతి,విశ్వాసము,మానవ సేవ ముఖ్య సిధాంతాలుగా ప్రపంచ వ్యాప్తంగా 3300 కేంద్రాలలో ఎ సంస్థ పనిచేస్తుంది.ఆధ్యాత్మిక,మానవతావిలువలు పెంచటమేకాక కళా,సాహిత్య,సంగీత రంగాల కేంద్రంగా కూడా ఈ సంస్థ పనిచేస్తున్నది.
ఇతరుల ఆనందంలోనే మన ఆనందాన్ని వెతుక్కోవాలనే వీరి బోధన అందరికీ అనుసరణీఈయమైనది.
"సర్వే జనా సుఖినో భవంతు"
No comments:
Post a Comment