Saturday, June 30, 2012

బర్డ్స్ ఫీడింగ్




 నేను అమెరికా లోని మాతమ్ముడి గారింటికి ఒక వారం ఉండటానికి వెళ్ళాను.వాళ్ళదిసొంత ఇల్లు.చుట్టూ అందమైన తోట.చార్లెట్ లో ఎక్కడ చూసినా చెట్లే.వాటిని చెట్లు అనకూడదు,వృక్షాలు అనాలి.అడవిని తలపిస్తుంది. వారిల్లు కూడా అలాగే ఉన్నది.అందులో నన్ను బాగా ఆకర్షించినది బర్డ్స్ ఫీడింగ్.



           తోటలో ఒక ఇనుప స్తంభానికి రెండు గాజు కుప్పీలు వాటికి మధ్య మధ్య చిన్న హోల్స్ ఉన్నాయి.వాటినిండా ధాన్యపు గింజలు పోసి స్తంభానికి వేలాడ తీసారు.ఉదయం నుంచిరాత్రి వరకు రకరకాల పక్షులు వచ్చి వాటిని తింటూ సందడి చేస్తుంటాయి.మాకు రోజూ అదే కాలక్షేపము.దానికి ఒక సూర్య కాంతిని  చార్జ్ చేసుకునే దీపము కూడా ఉన్నదండోయ్. ఆంధ్రదేశం లో కనుమరుగు అయిన పిచ్చుకలు ఇక్కడ కొల్లలుగా కనిపించాయి.వడ్రంగి పిట్టలు,కోయిలలు ఇంకా పేరు తెలియని ఎన్నో పక్షులు కనువిందు చేయటమేకాక వాటి కిలకిలా రావాలు మనస్సును ఆనంద డోలికల్లో ఊగించాయి.

          అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది హమ్మింగ్ బర్డ్.అది చాలా చిన్న పక్షి .కాని అమిత వేగంతో ఎగురుతుంది.అది రెక్కలను విపరీతమైన వేగం తో కదిలిస్తుంది.ఆరెక్కలుచేసే చప్పుడు వల్లే ఆపేరు వచ్చివుంటుంది.దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.ఆపక్షిని ఆకర్షించే నీలం పూలు పూసేమొక్కను పెట్టారు.ఒక ప్రత్యేకమైన గిన్నెలో ఒక పంచదార మూడు వంతులు నీరు కలిపిన ద్రావకాన్ని ఆగిన్నెలో పోసి పెడతారు.వాటిని నాలుగు రోజులకు ఒకసారి మారుస్తుంటారట. మనస్సుకు స్వాంతన కలుగచేసే ఆరోగ్యకరమైన వాతావరణం అక్కడ చోటుచేసుకున్నది.అది అందరితో పంచుకోవాలనే ఇందులో రాయడం జరిగింది. కొన్ని ఫొటోలు ఇక్కడ పెట్టాను మీరూ వీక్షించి ఆనందిస్తారని భావిస్తాను.

1 comment:

  1. విశాలమయిన దేశం. సంపన్నత,విద్యాదిక్యత అన్ని వున్నాయి. ఇక్కడ మనకు ఇవి రెండు తక్కువ వీటికన్నా పేరాశ ఎక్కువైంది.దానితో పక్షులకు ఆహరం లేదు. అన్ని భవనాలే తప్ప చెట్లు లేవు.బొంబాయి,డిల్లీలో కబుతర్ ఖానలు చూడండి. అబ్బే మనకు ఇటు వంటి అలవాట్లు పనికి రావు.
    కొత్త విషయం.మంచి ఫోటోలు.

    ReplyDelete