ప్రపంచ ప్రసిద్దిగాంచిన జలపాతాలలో రెండవ స్థానాన్ని పొందిన
జలపాతం నయాగరా.మొదటిది దక్షిణ అమెరికాలోని విక్టోరియా జలపాతం.కాని
సందర్శకులను ఎక్కువగా ఆకర్షించేది నయాగరానే.
ఇది యు.ఎస్ లోని న్యూయార్క్ స్టేట్ కెనడా దేశాల మధ్య
సరిహద్దుగా ఉన్నది.న్యూయార్క్ నగరానికి 75మైళ్ళ దూరంలో ఉన్నది, మూడుజలపాతాల
సమూహము.మొదటిది హార్ష్ షూఫాల్స్,రెండవది అమెరికన్ ఫాల్స్,మూడవది బ్రైడల్
వీల్ ఫాల్స్.మొదటి రెండిటిని గోట్ ఐలాండ్ వేరు చేస్తుండగా తరువాత రెండిటిని
లూనా ఐలాండ్ వేరు చేస్తున్నాయి.అమెరికన్,బ్రైడల్ వీల్ ఫాల్స్ రెండూ
అమెరికా వేపు,హార్స్ షూ ఫాల్స్ కెనడావైపు ఉన్నాయి. ఇరి,ఒంటారియో సరస్సులు
రెండు నయాగరా నదిగా ఏర్పడి 165 అడుగుల ఎత్తు నుండి పడటం వలన సహజసిద్దమైన ఈ
జలపాతము ఏర్పడినది.సెకనుకు నాలుగు మిలియన్ క్యుసెక్కుల నీరు పడుతుందని
అంచనా వేయబడింది.రెండు జలవిద్యుత్తు కేంద్రాలు ఇక్కడ కలవు.మంచి పర్యాటక
కేంద్రంగా,పారిశ్రామిక ,వ్యాపార కేంద్రంగా ఉన్నది.
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం 18000సంవత్సరాల క్రితం
ఐస్ గడ్డ కట్టి ఉండేదని, 12500 సంవత్సరాలనాటికి కొంచెం కొంచెం ఐస్ కరగడం
ప్రారంభమై రెండు సరస్సులుగా ఏర్పడ్డాయని చెబుతారు.అవే
ఇరీ,ఒంటారియోసరస్సులు.సుమారు 5500సంవత్సరాలక్రితం ఇవి ప్రవాహాన్ని
సంతరించుకొని నయాగరానదిగా మారి ప్రవహిస్తూ ఎత్తు నుండి పడటం వలన జలపాతం
ఏర్పడినది. అన్నితికంటే పెద్దది హార్స్ షూ ఫాల్స్. దీని ఎత్తు 173
అడుగులు,వెడల్పు 2600 అడుగులు.
మొదటిసారిగా సామ్యూల్డి తన జర్నల్ లో ఈ జలపాతాన్ని తాను
చూసినట్లుగా వ్రాసాడు.1677లో లూయిస్ హెన్నెఫిన్ వీటి అందాన్ని వర్ణించడంతో
యూరోపియన్లకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఫెర్కాం 18వశతాబ్దం లో దీని
శాస్త్రీయతను ప్రకటించాడు.ఈ శతాబ్దం మధ్యకి ప్రపంచ ప్రజల దృష్టిని
ఆకర్షించసాగినాయి. 19వ శతాబ్ది ప్రారంభంలో నెపోలియన్ బోనపార్టీ సోదరుడు తన
భార్యతో ఈ జలపాతాన్ని దర్శించాడు.అమెరికన్ సివిల్ వార్ తరువాత రోడ్డు,రైలు
మార్గాలను బాగా అభివృధి చేశారు.ఒక ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా మారింది.
మేము శనివారం వేళ్ళాము.ఆరోజు విపరీతమైన రద్దీగా ఉన్నది.
చాలా టూరిష్టు బస్సులలో ఎక్కడెక్కడి నుంచో విజిటర్స్ వచ్చారు.అమెరికావైపు
చూడ దగినవి Maid of Mist, Cave of the winds, Naigara falls state
Park,acqarium etc...మెయిడ్ ఆఫ్ మిష్ట్ అంటే మనల్ని క్రూస్(మోటార్ బోట్స్)
లో హార్ష్ షూ జలపాతానికి చాలా దగ్గరగా తీసుకు వెళతారు.వర్షం పడినట్లుగా మన
మీద నీటి తుంపరలు పడతాయి.బోట్ ఎక్కే ముందే మనకు ప్లాస్టిక్ కోట్ లాంటిది
ఇస్తారు. దాన్ని వేసుకొని వెళ్ళలి.ఆ అనుభూతి మాటలలో చెప్పడం
అసాధ్యం.అనుభవించి తీరాల్సినదే.కేవ్ ఆఫ్ ది విండ్స్ లోమనని బ్రైడల్ వీల్స్
ఫాల్స్ కిందకు మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్ళవచ్చు.అది
మధురానుభూతి.అక్వేరియం,స్టేట్ పార్క్ కూడా చూఊడాదగినవే.కెనడా వైపు ది
స్కైలైన్ టవర్ ,కాసినోస్ మొదలైనవి ఉన్నాయి.పెద్దదైన హార్ష్ షూ ఫాల్స్
అమెరికా వేపు నుంచి కంటే కెనడా వైపు నుండి బాగా కనిపిస్తుంది.కాని అటు
నుంచి చూడాలంటే వీసా తీసుకొని వెళ్ళాలి.రాత్రి 9 గంటలు దాటిన తరువాత కెనడా
వైపు నుంచి ఫాల్స్ మీద పడేటట్లుగా లైట్లు వేస్తారు.సప్త రంగులతో ఇంద్ర
ధనస్సును మరిపించేటట్లుగా ఉన్న ఆ దృశ్యం అత్యద్భుతం. చిత్రకారులకు,కవులకు
ప్రేరణ కలిగించే దృశ్య మాలిక.అందరూ చూసి ఆనందించ దగిన సుందర ప్రదేశం.కొన్ని
ఫొటోలను జత పరిచాను.మీరూ చూసి ఆనందించండి.
Beautiful views.. Thanks for sharing!
ReplyDelete