తెలుగు గీతము
విన్నానూ అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగూ
ప్రభవించెను నామదిలో విఙానపు వెలుగూ //వి//
మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం
కలసి మెలసి బ్రతికేందుకు మాతృభాష కీలకం//మ//
తతరాల అనుభవాల్ని అందించే సాధనం
జాతి జనుల సంస్కృతి ప్రతిఫలించు దర్పణం/త/
మాతృ భాష జనం మధ్య వికసించే అనురాగం
ప్రతి గుండెను పలికించే సమైక్యతారాగం /మా/
విఙానపు వీచికలను వెదజల్లే సౌరభం
విశ్వమంతా చాటుదాం తెలుగుభాషావైభవం /వి/
భారతాన్ని తెనిగించిన నన్నయ తిక్కన ఎర్రన
భక్తి గాధల పోతన తెలుగు సామెతల వేమన
కందుకూరి గురజాడ గిడుగు పిడుగు శ్రీశ్రీలు
నవజీవన సమభావన నేర్పించిన మహనీయులు/వి/
పచ్చనైన పైరు మీద పేర్చినట్టి చీడపీడ
అచ్చ తెలుగు భాష మీద ఆంగ్లభాష పడగనీడ
విష సంస్కృతి కోరలలో విలపించెను భాష
పట్టదేమి పాలకులకు తెలుగుతల్లి ఘోష
అమ్మ ప్రేమ కమ్మదనం తెలుగు భాష తియ్యదనం
భాషాభిమానంతో కడవరకు సాగుదాం
త్యాగాలతో సాధించిన విశాలాంధ్ర దేశం
విద్రోహుల చేతులలో పడనీయకు నేస్తం //వి//
*****_******
ఈ గీతం ఎవరు రాశారో తెలియదు .బాగున్నదని ఎప్పుడో సేకరించాను. ప్రపంచ తెలుగుమహాసభల నేపధ్యం లో ఈగీతం పోస్టు చేశాను.

No comments:
Post a Comment