Sunday, July 21, 2013

తెలుగు గీతం


 తెలుగు పాట తేనెమాటల ఊట
కుహూకుహూ రాగాల కోకిలపాట
పంచదారకన్న ఇక్షురసం కన్న
లేజవరాలి మోవికన్న తియ్యనైన తెలుగు
అజంతమై అమృతభావననింపు
నవరసాలొలుకు పద సంపద
అనుభూతులు అనుభవాలు పలుకు అక్షర దీప్తి
నీ సంపదే ను తెలుగు భాషామ తల్లి
పలుకుసమాసములు పదబంధమ్ములు
సూక్తులు నానుడులు సామెతలు జాతీయమ్ములు
తెలుగు వాడి నోట పలికినవి నిత్య చైతన్య స్రవంతిగా
అవధానాల అవధి చందో చమత్కృతి నెరిగిన భాష
శతకాల సంకీర్తనల చాటువులతో
ఇంపున పెంపై సోయగమొలుకు భాష
నానారుచిరార్ధ  సూక్తినిధి నన్నయ్య
అల్పాక్షరాల అనల్పార్ధ శిల్పి తిక్కన్న
ఎఱ్ఱన పెధన పోతనాది సేవలందిన భాష
జానపదుల వాఙ్మయ విన్యాసాలు
క్షేత్రయ అన్నమయల పదకవితా పరిమళాలు
సూరన కల్పనా చాతుర్యాలు
హాస్య రచనల వెన్నెల వయ్యారాలు
నాట్యమాడినవిట రసికలోక భాగ్యముగా
కధా నవలా నాటకాది ఆభరణాలనెన్నో
ఇమ్ముగా అలంకరించుకున్న ఇష్ట సఖి తెలుగు
మాండలిక యాస భాషలెన్నో ఇముడ్చుకున్నా
ప్రతి గుండెలో పలుకు సమైక్యతారాగం .

2 comments:

  1. మీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.

    www.poodanda.blogspot.com

    ReplyDelete
  2. సహజ మాధుర్య శ్రావ్యతాశ్రయత కలిమి పలుకు పలుకున సంగీత మొలుకు తెలుగు ,
    లలితమై మీరు వ్రాసిన తెలుగు గీతి
    లక్ష్మిగారూ ! మనోజ్ఞమై గ్రాలు చుండె .
    -----బ్లాగు సుజన-సృజన

    ReplyDelete