Thursday, August 28, 2014

వినాయక చవితి
   "  వినాయక చతుర్థి సుభాకాంక్షలు"
    నవగ్రహ శాంతికి  ఏఏ వినాయక ప్రతిమలను ఎప్పుడు పూజించాలో చూధ్ధాము.
 సూర్యగ్రహ దోష నివారణకు:--
 శన్-స్టోన్ గణపతిని లేదా ఎర్ర చందనముతో చేసిన గణపతిని కాని,మాణిక్య 
గణపతిని  ఆదివారము అర్చించాలి.
       అనారోగ్యములు తొలగించును.
   కుజ గ్రహ దోష నివారణకు:--
  రాగి లోహముతో చేసిన లేదా పగడపు గణపతిని గానీ మంగళవారము అర్చించాలి.
   ఋణబాధలు తొలగి ,ఋణా విముక్తులు ఔతారు.
  బుధగ్రహ దోష నివారణకు:--
  మరకత గణపతిని  బుధవారము అర్చించాలి.
   వ్యాపారాభివృధ్ధి జరుగును.
 ఛంద్రసెఖర్ గ్రహ దోష నివారణకు:--
  వెండి లోహముతో చేసిన గణపతి లేక ముత్యము లేక పాలరాయి గణపతిని  సోమవారము అర్చించాలి.
   మానసిక ప్రశాంతత కలుగుతుంది.
 గురు గ్రహ దోషనివారణకు:--
  బంగారము పుతపూసిన లేక పసుపుతో చేసిన లేక చందనపు చెక్కతో చేసిన  గణపతిని గురువారం పూజించాలి.
   ఉద్యోగము, సంఘములో గౌరవం కలుగును.
  శుక్ర గ్రహ దోషనివారణకు:--
  స్పటిక గణపతిని శుక్రవారం పూజించాలి.
   భార్యాపుత్రులతో కలసి సుఖజీవనం గడుపుతారు.
 శని గ్రహ దోషనివారణకు:--
 నాల్ల రాయితో చేసిన గణపతిని శనివారం అర్చించాలి.
  అధిక శ్రమతొలగి పోతుంది.
 రాహు గ్రహదోషనివారణకు:--
 శండ్స్టొన్ తో చేసిన గణపతిని ఆదివారము అర్చించాలి.
 పీడలు తొలగిపోవును.
కేతు గ్రహ దోషనివారణకు:--
శ్వేతార్క గణపతిని మగళవారం పూజించాలి.
విఘ్నములు తొలగి ,పనులన్నీ సక్రమముగా జరుగును.
         "ఓం గం గణపతయే నమాః"
                       ్
                    <***>
                       {}
                        ?

ninnu prEmistunnaanu.

నిన్ను ప్రేమిస్తున్నాను.
    
    నేను నిజాయితీగా
    ఎన్నో చెప్పాలని ప్రయత్నిస్తున్నాను
     నీ గురించి 
    మది నిండా తీయని తలపులు నిండాయని
    తెలపాలని ప్రయత్నిస్తున్నను.
    నీ కంటే
    ఫ్రపంచం లో ఎవరూ ఎక్కువ కాదని
    ఎరుక పరచాలని ప్రయత్నిస్తున్నాను.
    నిన్నే ఆరాధిస్తున్నాని
    మనం గడిపిన ప్రణయభావాలు
    నీ స్మరణకు 
    తేవాలని ప్రయత్నిస్తున్నాను.
   నీ గురించే
   నిరంతరం ఆలోచిస్తున్నానని
  నా అస్తిత్వాన్ని కోల్పోతున్నానని,
"నిన్ను ప్రేమిస్తున్నన"ని
  నా పెదవులు ప్రతిక్షణం పలవరిస్తున్నాయని
  నీ కంటే
  ఆనందం కలిగించే విషయం మరేదీ లేదని
 గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను.

Wednesday, August 27, 2014

జీవితం
    జీవితం అంటే జీవించడం.జీవించడం ఒక కళ.జీవించడం అంటే ప్రేమించడమే. ప్రేమ గల జీవితం అన్నిటికంటే గొప్పది.తాను జీవించడమే కాక ఇతరులను జీవించేలా చేసినప్పుడే జీవితం సార్ధకమౌతుంది.
       జీవితం బుధ్ధి వలన మాత్రమే కాక కాయకష్టం తోడైతేనే సజీవంగా ఉండ గలము.మనిషి తన జీవితం ఎప్పుడూ ఆనందం గా ఉండాలని కోరుకుంటాడు.ఆనందం అనేది వారి వారి మానసికస్థితులనుబట్టి  భిన్నంగా ఉంటుంది.సామాన్య విషయాలు కూడా కొందరికి అధ్బుతం గా అనిపించవచ్చు,మరికొందరికి అతి సామాన్యం గానిపించవచ్చు.ఒకే వస్తువు ఒకే వ్యక్తీకి అన్ని వేళలా ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు.ఆనందకరమైనది మేలు కలగచేసేదికాకపోవచ్చు.మేలు జేసేది ఆనందకరమైనది కాకపోవచ్చు.చదవకుండా ఉండటం పిల్లలకు ప్రియం గా ఉంటుంది కానీ అది వారికి మేలు చేయదు కదా.
         దూఃఖం  జీవితంలో అన్నిటినీ మించిన బాధ.కొన్నిసార్లు మరణం కంటే కూడా దూఃఖం భయంకరం గాఉంటుంది.అది ఆత్మ హత్యలకు దారితీస్తుంది.
ఆత్మ విశ్లేషణ అనేది మన జీవన లక్ష్యాలను అందుకోవడంలో ఉపకరించే గొప్ప సాధనం.మనని మనం ఎప్పుడైతే విశ్లేషించుకుంటామో అప్పుడు విచక్షణ అలవడుతుంది. మంచి, చెడుని గ్రహించ గలము.సాదాగా జీవిస్తూ ఉండటం గా ఆలోచించడం ఒక ఉత్తమ జీవన విధానం.జీవితం జీవించడం కోసమే అని తెలుసుకొని సుఖ దూఃఖాలను సమానం గా అనుభవించగల ధైర్యాన్ని పొందినప్పుడే ఆనందమయ జీవితం గడపగలము.

Monday, August 25, 2014

మంచిమాట



     కలలు కనటం మానినప్పుడు,జీవితంలో ఉత్సాహం కోల్పోయినప్పుడు ముసలి వారం ఔతాము.కోపం, కర్కశత్వం,చపలత్వం ,కలహప్రియత్వం కలిగి ఉంటే వృధ్ధా ప్యం  త్వరగా వస్తుంది.మనసుని భగవంతుని పై నిలిపి  ప్రశాంత చిత్తం తో ప్రేమను పంచినట్లైతే ---యవ్వనం దాల్చినట్లే.

ఛాటువు


      పెద కోమటి వేమారెడ్డి కీర్తి కాంతకు ఆట వస్తువులైన వాటిని వర్ణించే ఈ చాటువు కల్పనా చాతుర్యముతో రసాస్వద యోగ్యమైనది.
     "ధరణియె బొమ్మరిల్లు,వసుధావర పంక్తులు బొమ్మ, లంబుధుల్
       గురుగులు,చక్రవాళ గిరి కోట,నభంబది సేనకోర,ని
       ర్జర గిరి గద్దె పీట,ఇన చంద్రులు మేటి నివాళి పళ్ళెముల్
       గురు తర పుణ్యుడైన పెద కోమటి వేమన కీర్తి కాంతకున్!

Sunday, August 24, 2014

Band ham


Bandhanaalu

   విశ్వ కళ్యాణ గీతిక ఆలపించిన బుధ్ధదేవుడు,విశ్వమానవ సౌభ్రాత్రుత్వాన్ని చాటిన  వివేకానందుడు జన్మించిన పుణ్య భూమి మన భరత భూమి.వసుధైక కుటుంబం,సర్వేజనాసుఖినో భవంతు...అనే భారతీయ భావనలు  మన  ఔన్నత్యాన్ని చాటుతాయి.
          కానీ      ఆధునిక జీవితాలలో బిజీ బిజీగా గడుపుతూ  ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నది.ఉన్న కొద్దిపాటి సమయాన్ని తి.వి లతో ,అంతర్జాలాలతో గడుపుతూ తీరికలేకుండా ఉన్నరు.ఒకరినొకరు పట్టిచ్చుకోవడం, మంచి చెడుల గురించి ఆలోచించడమే లేదు.కుటుంబ సభ్యులే పరస్పరం పలకరించు కోలేని దుస్థితిలో ఇరుగు పొరుగులతో సత్సంబంధాలను పెంచుకొనే  తావెక్కడ?
             ఇరుగుపొరుగులతో కలివిడిగా ఉన్న గుండెపోటు ముప్పును తగ్గించే శారీరక ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రఙుల పరిశోధనా ఫలితం.ఇప్పుడన్నా అందరితో సంబంధాలను పెంచుకొనే దిశగా అడుగులు వేధ్ధాము.అందుకు మనం కొన్ని మంచి లక్షణాలు అలవరుచుకోవాలి. చక్కటి సంభాషణలు మనకు ఇతరులతో బంధాలను పెంచుతాయి.అనువుగాని చోట అధికులమన రాదు.అధికులమనే అహంకారం మనుష్యులను దూరం చేస్తుంది. ఎదుటి వారి తప్పులను ఎంచ రాదు.అది వారికి ఆగ్రహం కలగజేస్తుంది.వినదగు ఎవ్వరు చెప్పిన ఎవరు ఏం చెప్పినా శ్రధ్ధగా వినాలి.అది వారికి మనపై విశ్వసాన్ని పెంచుతుంది.విన్న దానికి ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి , నొప్పింపక తానొవ్వక మాటలాడాలి.వాదుకి వచ్చునదే కీడు. ఎందుకంటే  మనసు విరిగినేని స్నేహమనే అతుకు కూడా అతికించలేదు.ఎదుటి వారికి హితము,ప్రియము,మదికి ఇంపును కలుగు పలుకులు ఎంతసేపైనా వినుటకు విసుగు రాదు.మితిమీరిన పొగడ్తలు తెగడ్తలు మంచిది కాదు.కొద్దిమంది దగ్గరైనా ఎక్కువ మంది దూరమవుతారు.ఎదుటివారికి ఆసక్తి లేని విషయాలు గంటలు గంటలు మాట్లాడటం విసుగును కలగజేస్తుంది.సంభాషణలో అక్కడ వున్నవారందరు పాలుపంచు కొనే టట్లు గావుండాలి.తనువున విరిగిన బాణములు తొలగించ వచ్చుగాని, మనమున నాటిన నిష్ఠురోక్తులు తొలగించుట సాధ్యమేనా?ఇతరుల ఏ పలుకుల వల్ల మన మనసు కు అప్రియము కలుగునో ఆ పలుకులను మనం పలకకపోవడం మంచిది.అట్టి ప్రియ భాషణమే మనకు ఇతరులతో అనుబంధాలను పెంచుతుంది."వాగ్భూషణం భూషణం."
           ఆ వాగ్భూషణాలతో ఇరుగు పొరుగులతో బంధాలను పెనవేసుకొని అనుబంధాల కలిమితో చెలిమి చేసి గుండె పోతు ముప్పు నుండి విముక్తిని పొందే శారీరక ఆరోగ్య స్థాయిని మన శొంతగ్ చేసుకుందాము.