విశ్వ కళ్యాణ గీతిక ఆలపించిన బుధ్ధదేవుడు,విశ్వమానవ సౌభ్రాత్రుత్వాన్ని చాటిన వివేకానందుడు జన్మించిన పుణ్య భూమి మన భరత భూమి.వసుధైక కుటుంబం,సర్వేజనాసుఖినో భవంతు...అనే భారతీయ భావనలు మన ఔన్నత్యాన్ని చాటుతాయి.
కానీ ఆధునిక జీవితాలలో బిజీ బిజీగా గడుపుతూ ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఉన్నది.ఉన్న కొద్దిపాటి సమయాన్ని తి.వి లతో ,అంతర్జాలాలతో గడుపుతూ తీరికలేకుండా ఉన్నరు.ఒకరినొకరు పట్టిచ్చుకోవడం, మంచి చెడుల గురించి ఆలోచించడమే లేదు.కుటుంబ సభ్యులే పరస్పరం పలకరించు కోలేని దుస్థితిలో ఇరుగు పొరుగులతో సత్సంబంధాలను పెంచుకొనే తావెక్కడ?
ఇరుగుపొరుగులతో కలివిడిగా ఉన్న గుండెపోటు ముప్పును తగ్గించే శారీరక ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రఙుల పరిశోధనా ఫలితం.ఇప్పుడన్నా అందరితో సంబంధాలను పెంచుకొనే దిశగా అడుగులు వేధ్ధాము.అందుకు మనం కొన్ని మంచి లక్షణాలు అలవరుచుకోవాలి. చక్కటి సంభాషణలు మనకు ఇతరులతో బంధాలను పెంచుతాయి.అనువుగాని చోట అధికులమన రాదు.అధికులమనే అహంకారం మనుష్యులను దూరం చేస్తుంది. ఎదుటి వారి తప్పులను ఎంచ రాదు.అది వారికి ఆగ్రహం కలగజేస్తుంది.వినదగు ఎవ్వరు చెప్పిన ఎవరు ఏం చెప్పినా శ్రధ్ధగా వినాలి.అది వారికి మనపై విశ్వసాన్ని పెంచుతుంది.విన్న దానికి ఎప్పటికెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి , నొప్పింపక తానొవ్వక మాటలాడాలి.వాదుకి వచ్చునదే కీడు. ఎందుకంటే మనసు విరిగినేని స్నేహమనే అతుకు కూడా అతికించలేదు.ఎదుటి వారికి హితము,ప్రియము,మదికి ఇంపును కలుగు పలుకులు ఎంతసేపైనా వినుటకు విసుగు రాదు.మితిమీరిన పొగడ్తలు తెగడ్తలు మంచిది కాదు.కొద్దిమంది దగ్గరైనా ఎక్కువ మంది దూరమవుతారు.ఎదుటివారికి ఆసక్తి లేని విషయాలు గంటలు గంటలు మాట్లాడటం విసుగును కలగజేస్తుంది.సంభాషణలో అక్కడ వున్నవారందరు పాలుపంచు కొనే టట్లు గావుండాలి.తనువున విరిగిన బాణములు తొలగించ వచ్చుగాని, మనమున నాటిన నిష్ఠురోక్తులు తొలగించుట సాధ్యమేనా?ఇతరుల ఏ పలుకుల వల్ల మన మనసు కు అప్రియము కలుగునో ఆ పలుకులను మనం పలకకపోవడం మంచిది.అట్టి ప్రియ భాషణమే మనకు ఇతరులతో అనుబంధాలను పెంచుతుంది."వాగ్భూషణం భూషణం."
ఆ వాగ్భూషణాలతో ఇరుగు పొరుగులతో బంధాలను పెనవేసుకొని అనుబంధాల కలిమితో చెలిమి చేసి గుండె పోతు ముప్పు నుండి విముక్తిని పొందే శారీరక ఆరోగ్య స్థాయిని మన శొంతగ్ చేసుకుందాము.
No comments:
Post a Comment