Tuesday, November 9, 2010

మాతృభాష

ఇది అమ్మ భాష
అనాదిగా వస్తున్న భాష
అఙ్ఞాన అంధకారాన్ని పారద్రోలి
శరత్ జ్యోత్స్న లనునింపి
దేశ భాషలందు అగ్రపీఠాన్ని అలంకరించినది
సాహితీ ప్రపంచములో నడిపించి
నను సాహితీ పిపాసిగా చేసినది
అభావమూర్తినైన నన్ను
భావనాలోకంలో విహరింప జేసింది
అమ్మ అరటి నుండి
ఆముక్తమాల్యదల వరకు
అక్షర జగత్తులో ఓలలాడించినది
తెలుగు వారందరినీ ఒక త్రాట నడపి
భాషా సమైఖ్యతకు దారి చూపిన
తేనెలొలుకు తెలుగు
నా మాతృభాష.

1 comment:

  1. లక్ష్మి గారూ !
    మీ బ్లాగులో టెక్స్ట్ రంగు మార్చండి. అక్షరాలు కనపడడం లేదు. చదవడం చాలా కష్టంగా వుంది. అన్యధా భావించవద్దు.

    శిరాకదంబం

    ReplyDelete