కొర్ర బియ్యం---------------2 కప్పులు
మినపపప్పు--------------1 కప్పు
శనగపప్పు--------------2 టీ స్పూనులు
మెంతులు----------------------1/2 స్పూను
ఉప్పు--తగినంత
నూనె----దోసె కాల్చటానికి తగినంత
పైన చెప్పిన దినుసులు అన్నీ విడివిడి గా 4,5గంటలు నానబెట్టాలి.నానిన తరువాత శుభ్రం గా కడిగి ముందుగా కొర్రలు ,మెంతులు మెత్తగా రుబ్బుకోవాలి.మినపపప్పు,శనగపప్పు కలిపి మెత్తగా రుబ్బాలి.ఈ రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి రత్రంతా ఉంచితే పులుస్తుంది.ఉదయం రుచికి సరిపోను ఉప్పు కలిపి నీరు చేర్చి దోసెల పిండిలా జారుగా చేసుకొని పెనం మీద ఒక గరిటె పోసుకొని ఒక స్పూను నూనె వేసుకొని రెండు పక్కలా కాల్చు కోవాలి.
మాంస కృత్తులు,ఇనుము,పీచు పదార్ధం ఉండటం వలన ఎదుగుదలకు,జీర్ణ క్రియకు దోహద పడటమేగాక శక్తిని, చురుకుదనాన్ని పెంపొందిస్తుంది.
No comments:
Post a Comment