Friday, January 23, 2015

అవిసెగింజలపొడి:----


       అవిసె గింజలు-----------------100గ్రాములు
       ఎండు మిరపకాయలు--------6
       జీర-----------------------------1స్పూను
      వుల్లుల్లి----------------------5రెబ్బలు
      ఉప్పు-----------------------రుచికి సరిపోను
               అవిసె గింజలు చిరు ధాన్యాలు అమ్మే షాపులలో దొరుకుతాయి.వాటిని కొంచెం వేయించుకోవాలి.ఎండు మిరపకాయలు కూడా వేయించాలి.రెండూ నూనె లేకుండానే వేయించాలి.ఇప్పుడు ఉప్పు సరిపోను వేసి మిక్సీ పట్టుకోవాలి.
           అన్నం లో మొదటి ముధ్ధలో ఒక స్పూను వేసుకుని తినాలి.తినగలిగితే వట్టి అవిసెగింజలైనా మిక్సీ పట్టి రోజూ ఒక స్పూను తినవచ్చు.
           ఇది చాలా మంచిది.రక్త శుధ్ధి జరుగుతుంది.బాడ్ కొలష్ట్రాల్ తగ్గుతుంది.ఫ్రీ మోషన్ అవుతుంది.

1 comment:

  1. ఒక ముఖ్యవిషయం గుర్తుంచుకోవాలి తప్పకుండా!
    అవిసేగింజలు గింజలుగానే నిలువ ఉంటాయి. ఇబ్బంది లేదు.
    కాని అవిసెగింజలను పొడిగా చేసుకుంటే, అది ఎక్కువరోజులు నిలువ ఉంచుకోరాదు. దానిలో రుచిమార్పు వస్తుందో లేదో కాని toxins తయారవుతాయి ఆ పొడిలో గాలిలోని ఆక్షిజన్‌తో చర్య కారణంగా. తెలుసుగా ఈ toxins అనేవి విషపూరితమైనవని. అందుకని పొడిచేసుకున్నాకు గాలిచొరని డబ్బాలో ఉంచాలి, కొద్దిరోజుల్లో కర్చుపెట్టేయాలి. ఇక్కడ అన్నంలో కలుపుకొని తినే విధంగా చెప్పిన విధానం బాగుంది. అవిసెగింజలపొడి రక్తంలో tri triglycerides బాగా తగ్గేందుకు దివ్యమైన ఔషధం.

    ReplyDelete