మనిషికి ముందు చూపు చాలా అవసరం.లేకపోతే ఇబ్బందులు పడతాడు.ఈ శ్లోకం చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది.
"వర్షార్ధ మష్టౌ ప్రయతేత మాసాన్
నిశార్ధ మర్ధం దివసే యతేత |
వార్ధక్య హేతో ర్వయసా నవేన
పరత్ర హేతో రిహజన్మనాచ||"
వర్షం లో బయటకు వెళ్ళలేము కనుక అప్పటికి కావలసినవి మిగిలిన ఎనిమిది మాసాల లోనే సమకూర్చు కోవాలి.రాత్రి వేళ చీకటి కనుక పగటి పూట పొందుపరచుకోవాలి.వార్ధక్యం లో శక్తి సన్నగిల్లుతుంది కనుక ముసలితనం లో ప్రశాంతం గా జీవించ డానికి వయసులో ఉండగానే సంపాదించు కోవాలి.పరలోకానికి కావలిసిన పుణ్యాన్ని ఇహలోకంలోనే సంపాదించుకోవాలి.
ఈ శ్లోకం జీవితం గురించి తెలిపితే "మూడు చేపల కధ" ముందు చూపు,సమయస్ఫూర్తి లేకపోతే దీర్ఘ సూత్రుడు లా ప్రాణాలు కోల్పోతారు.సమయస్ఫూర్తితో ప్రాప్తకాలజ్ఞుడులా తప్పించు కోవచ్చు.దీర్ఘ దర్సి కి ముందు చూపు ఉండటం వలన తనను తాను కాపాడుకో గలిగింది.
No comments:
Post a Comment