రొయ్యలు-------------------1/2కెజి
ఉల్లిపాయలు---------------2
వెల్లుల్లి---------------------3రెబ్బలు
అల్లం----------------------చిన్న ముక్క
పచ్చిమిరప----------3
కారం------------------11/2స్పూను
పసుపు-----------------1/4స్పూను
ధనియాలు------------1స్పూను
సోంపు పొడి---------1/2స్పూను
కొబ్బరి కోరు---------2స్పూన్లు
గరం మసాలా---1స్పూను
నిమ్మరసం లేదా పెరుగు---------1స్పూను
నూనె-----------------11/2స్పూను
కరివేపాకు----------2రెమ్మ్మలు
ఊప్పు------రుచికి సరిపోను
శుభ్రం గా కడిగిన రొయ్యలకు అల్లం పచ్చి మిర్చి పేష్టు,కారం,ఉప్పు,పసుపు,నిమ్మరసం కలిపి 15 నిముషాలు నానబెట్టాలి.తరువాత 1/4 కప్పు నీళ్ళు పోసి 10 నిముషాలు ఉడికించాలి.తరువాత ష్టౌ మీద బాణిలి పెట్టి నూనె వేసి కాగినాక ముందు సన్నగా తరిగిన వెల్లుల్లి,ఉల్లి పాయ ముక్కలు కరివేపాకు,ఎర్రగా మారేవరకు వేయించాలి.కసూరి మేథి కూడా వేయవచ్చు.అందులో ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ధనియాల పొడి, గరం మసాలా,ఉప్పు,కొబ్బరి కోరు వేసి 5నిముషాలు ఉంచి ష్టౌ కట్టేయాలి.ఘుమ ఘుమ లాడే రొయ్యల వేపుడు రెడీ!
No comments:
Post a Comment