Sunday, July 13, 2014
Saturday, July 12, 2014
Chaatuvu
టెలుగు లో పద్య సాహిత్యానికి ఎంత ప్రాశస్త్యం ఉన్నదో అలాగే చాటు పద్యానికి కూడా అంత ప్రాధాన్యత ఉన్నది.అలాంటి ఒక చాటు పద్యానికి చూధాము .దీనికి అభినయం జోడిస్తే కాని అసలు భావం తెలియదు.
రాజిత కీర్తి శాలి అగు రాయని భాస్కరు వేడబోయినన్
ఆజికి ఇట్లనున్, పరుని ఆలికి ఇట్లను,అర్థికిట్లనున్,
తేజము పెంపు లేని కడు దీనుని హీనుని వేడబోయినన్
ఆజికి ఇట్లనున్, పరుని ఆలికి ఇట్లను,అర్థికిట్లనున్.
ఇందులో రెండు, నాలుగు పాదములు ఒకలాగానే ఉన్నాయి .ఇందులో గొప్పతనమేమున్నది అనుకోవచ్చు. దీనికి అభినయం జోడిస్తే వ్చ్చే అర్ధం వేరు.రెండొ పాదం చదివే టప్పుడు ఆజి అన్నప్పుడు విల్లు ర్క్ కు పెట్టినట్లుగా,పరుని ఆలి అన్నప్పుడు నమస్కారంతోను,అర్ధికి అన్నప్పుడు దానం చేస్తాడని అభినయించి, నాలుగవ పాదం చెప్పేటప్పుడు యుధ్ధం లో పలాయనం చిత్తగిస్తాడని,పరుని ఆలికి కన్ను కొడతాదని ,అర్ధికి మొండిచెయ్యి చూపిస్తాడని చదివితే ఇందులోని వ్యగ్యం అవగత మౌతుంది.

Friday, July 11, 2014
గురు పూర్ణిమ
గురుః బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్ధేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
ఆషాడ శుధ్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు.ఈరోజున గురు పూజా మహోత్సవాలు జరుగుతాయి.వ్యాసుని జన్మించిన రోజు కావున వ్యాస మహర్షిని పూజించే ఆచారం అనాదిగా వస్తోంది.
పుర్వం వేదనిధి దంపతులు వ్యాసుని అనుగ్రహం తో పుత్ర సంతానాన్ని పొంది
శుఖ సంతోషాలతో జీవించి, చివరకు విష్ణు సాయుజ్యాన్ని పొందారని కధనము .ఈరోజు వ్యాసుని పూజించే వారు అష్టైశ్వర్యాలు పొందుతారు అని భావిస్తారు.
అఙానాంధకారాన్ని పారద్రోలి విఙానపు వెలుగుల్ని అందజేశే వారు గురువు. ఘురు స్థానము ఎంతో పవిత్రమైనది.
త్వం పితాత్వం చ మాతా త్వం బంధుస్త్వం చ దేవతా
సంసార భీతి భంగాయ తస్మై శ్రీ గురవేనమః
ఆది దేవుడు ,సమస్త దేవతల చేత పూజింప బడినవాడు అయిన పరమ శివుడు లోకమాత అయిన పార్వతీ దేవికి గురువు యొక్క ఆవశ్యకతను,ప్రాముఖ్యాన్ని "గురు గీత"గా ఉపదేశించాడు.లొకంలో ఏడు రకాలైన గురువులు కలరు.
వారు---
1.సూచక గురువులు---విద్యాలయాల్లో పాఠాలు చేప్పేవరు.
2.వాచక గురువులు---ఆశ్రమ నియమాలు బోధించువారు.
3.బొధక గురువులు---మంత్రోపదేశం చేయువారు.
4.నిషిధ గురువులు--- ఉపాసన చేయరాని తంత్రవిద్య చెప్పువారు.
5.దేశిక గురువులు---వైరాగ్యమును భొధించు వారు.
6.కారణాఖ్య గురువులు---సన్యాస దీక్ష ఇచ్చు వారు.
7.పరమ గురువులు---ఎవరి దర్శనము చేత అఙానము తొలగి సమస్యలు పోయి ప్రశాంత చిత్తము లభిస్తుందో వారే పరమ గురువులు.
శిష్యులను సమదృష్టితో చూడగలవాడే పరమ గురువు.ఈరోజు గురుపూఝ చేసిన వారిని మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రీ గురు దథుని,శ్రీ సాయిని పూజించాలి. కలియుగ ప్రభావంతో ధర్మాన్ని వదిలి నడిచే వారిని ఉధ్ధరించుటకు దత్తత్రేయుడు వివిధ

Wednesday, July 9, 2014
Monday, July 7, 2014
Mahaabhaarata praaSastyamu.
మహభరత ప్రాశస్త్యము.
ధర్మతత్వఙులు ధర్మశాస్త్రమని ,ఆధ్యాత్మవిదులు వేదాంతమని,నీతివిచక్షిణులు నీతిశాస్త్రమని,కవులు మహాకావ్యమని,లాక్షణికులు లక్షణ గ్రంధమని ,పౌరాణికులు బహు పురాణ గ్రంధమని ఇలా అనేక విధాలుగా భారతం గొప్పదనాన్ని చెబుతారు.
నిత్యం భారతీయుల జీవితాలలో మమేకమైనది.తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అంటాము.విందు భోజనాలలో గారెలకు ఎంత ప్రాధాన్య మున్నదో మన జీవితాలలో భారతానికి అంత ప్రాధాన్యమున్నది.ఏ మాలిన్యము లేని వారిని శౌచ గాంగేయుడు తో పోలుస్తాము.విరివిగా దానాలు చేసేవారిని దానకర్ణుడు అంటాము.కర్ణుడు లేకుండా భారతం లేదని వ్యక్తి ప్రాధాన్యతను చెబుతాము.వూరికే గొప్పలు చెప్పేవారిని ఉత్తరకుమార ప్రగల్భాలు అని,పనికి ఆటంకం కలిగించేవారిని సైంధవుడిలా అడ్డుపడ్డాడని,ప్రశ్న మిది ప్రశ్న వేసే వారిని యక్షప్రశ్నలని,కుటిల సలహాలు ఇచ్చే వారిని శకునిమామ అని అంటాము.వివాదరహితులను వాడికేంటి ధర్మరాజు అని,బాగా లావుగా వున్నవారిని భీముడు అని,పిల్లల తప్పుల్ని ఒప్పులుగా చూసే అంధ తండ్రిని దృతరాష్ట్రుడి ఫుత్ర ప్రేమతో పోలుస్తాము.అనేక పనులు ఒకసారే చేసే వారిని సవ్యసాచి అంటాము.సమస్యల వలయం లో వుంటే పద్మ వ్యూహం తో ,విషయం లేకుండా పేజీలు నింపు తుంటే చాట భారతం. రాసాడంటాము.ఇలా. భారత పాత్రలన్ని. నిరంతరం మన చుట్టూ నే కనిపిస్తుంటాయి .అందుకే భారతానికి అంతటి ప్రాముఖ్యత.

Sunday, July 6, 2014
Manchi amma
ఫెప్సికొ సి.ఇ.ఒ గా పదోన్నతి. ఫొందిన ఇంద్రనూయి ఇంటికి రాగానే ఆమె తల్లి స్పందించిన తీరు. ణువ్వు అత్యున్నత అధికారివి అవ్వవచ్చు. ఖానీ నీ ఇంటి బాధ్యతలు మారిపోవు.ఒకసారి ఇంట్లోకి వచ్చావంటే నీ భర్తకు భార్యవు,నీ పిల్లలకు తల్లివి,తల్లికి కుమార్తెవు అయిపోతావుమరెవ్వరూ ఆబాధ్యతను పంచుకోలేరు. ఖనుక నీ కిరీటాన్ని బయటేపెట్టు. ఓక గృహిణి బాధ్యతను ఎంత చ్చక్కగా చెప్పింది.నిజమే ప్రధాన మంత్రి అయినా ఒక తల్లికి కూతురే అన్నది అక్షర సత్ యం.
ంఒన్న జయసుధ కూడా తను బిజీ గా ఉండటం వలన పిల్లల చదువులు పట్టించుకోకపోవడం వలన అనుకు న్నవిధం గా చదివించ లేకపోయాననిబాధపడింది.కుటుంబంలో తల్లి పాత్ర ఎంత కీలకమో తెలుస్తుంది.పిల్లల పెంపకంలో తల్లి బాధ్యత గురుతర మైనది.
Sunday, May 25, 2014
FOSWAL
ఫాశ్వాల్
ఈ రోజు ఫాశ్వాల్ ప్రథమ వార్షికోత్సవ సభ విజయవాడలోని వాసవ్య మహిళామండలి సిల్వర్ జుబ్లిహాల్ లో జరిగింది.ఫాశ్వాల్ అంటే ఫ్రెండ్స్ ఆన్ సేం వేవ్ లెంగ్త్. ఇది మొదట కాలిఫోర్నియాలో స్తాపించబడినది. ప్రపంచంలో అనేకదేశాలకు విస్తరించి తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. టాగూర్ " ఎక్కడ మనుషులు భయం లేకుండా ఉంటారో--" అన్న గేయం ప్రార్ధనా గీతం గా పాడతారు.ముఖ్య అతిధులుగా వచ్చినవారు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ఈ రోజు ముఖ్య అతిధి డాక్టర్ .పి. వి. కృష్ణా రావు.
కృష్ణా రావు గారు "పర్యావరణ పరిరక్షణ" పై ప్రసంగించారు. కేవలం మొక్కని నాటటం కాదు గార్డెన్ పెంచమని సూచించారు.అది అనేక సమస్యలకు పరిష్కారమని చెప్పారు. గార్డెనింగ్ మంచి వ్యాయామమే కాదు టానిక్ లాగా పనిచేస్తుంది.మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్ వారి రీసెర్చ్ లో 3,310 మంది గార్డెనింగ్ చేసిన వృద్ద మహిళలను పరిశీలించగా వారు జాగింగ్,స్విమ్మింగ్,ఏరోబిక్స్ చేసిన మహిళల కంటే తక్కువ ఆస్టియోపొరాసిస్ తో ఉన్నారని తేలింది.కొలస్ట్రాల్ బి.పి లు తగ్గుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు చెప్పారు.
ఒక మనిషి కి సగటున మూడు సిలెండర్ ల ఆక్సిజెన్ అవసరమవుతుంది.గాలి ఉచితం కాబట్టి మనం ఎప్పుడూ దాని గురించి ఆలోచించము.కృష్ణారావు గారు దాని విలువను తెలియజేసారు
50 సంవత్సరాలు బ్రతికే ఒక చెట్టు
రూ.5.3 లక్షల విలువజేసే ఆక్సిజెన్ విడుదల చేస్తుంది.
రూ.6.4 లక్షల విలువచేసే భూసారాన్ని పరిరక్షిస్తుంది.
రూ.6.4 లక్షల విలువచేసే భూమికోతను నివారిస్తుంది.
రూ.5.3 లక్షల విలువచేసే ఇతర జీవజాలానికి ఆశ్రయమిస్తుంది..
రూ.10.5 లక్షల విలువ చేసే వాయు కాలుష్యాన్ని నిరోధిస్తుంది.
మొత్తం విలువ 33.9 లక్షలు !
చెట్లు ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గించటమే గాక శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలను పెంచాడానికి ప్రాధాన్య మివ్వాలి.ప్రత్యేక సందర్భాలలో మొక్కల్ని బహుమతిగా ఇవ్వమని సూచించారు.విలువైన సూచనను ఆచరించటం లో అందరం బాగస్వాములం అవుదామా!

Subscribe to:
Posts (Atom)