Friday, July 11, 2014

గురు  పూర్ణిమ
         గురుః బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్ధేవో మహేశ్వరః
          గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
       ఆషాడ శుధ్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు.ఈరోజున గురు పూజా మహోత్సవాలు జరుగుతాయి.వ్యాసుని జన్మించిన రోజు కావున వ్యాస మహర్షిని పూజించే ఆచారం అనాదిగా వస్తోంది.
         పుర్వం వేదనిధి దంపతులు వ్యాసుని అనుగ్రహం తో పుత్ర సంతానాన్ని పొంది
శుఖ సంతోషాలతో జీవించి, చివరకు విష్ణు సాయుజ్యాన్ని పొందారని కధనము .ఈరోజు వ్యాసుని పూజించే వారు అష్టైశ్వర్యాలు పొందుతారు అని భావిస్తారు.
        అఙానాంధకారాన్ని పారద్రోలి విఙానపు వెలుగుల్ని  అందజేశే వారు గురువు. ఘురు స్థానము ఎంతో పవిత్రమైనది.
      త్వం పితాత్వం చ మాతా త్వం బంధుస్త్వం చ దేవతా
      సంసార భీతి భంగాయ తస్మై  శ్రీ గురవేనమః
     ఆది దేవుడు ,సమస్త దేవతల చేత పూజింప బడినవాడు అయిన పరమ శివుడు లోకమాత అయిన పార్వతీ దేవికి గురువు యొక్క ఆవశ్యకతను,ప్రాముఖ్యాన్ని  "గురు గీత"గా ఉపదేశించాడు.లొకంలో ఏడు రకాలైన గురువులు కలరు.
   వారు---
1.సూచక గురువులు---విద్యాలయాల్లో పాఠాలు చేప్పేవరు.
2.వాచక గురువులు---ఆశ్రమ నియమాలు బోధించువారు.
3.బొధక గురువులు---మంత్రోపదేశం చేయువారు.
4.నిషిధ గురువులు--- ఉపాసన చేయరాని తంత్రవిద్య చెప్పువారు.
5.దేశిక గురువులు---వైరాగ్యమును భొధించు వారు.
6.కారణాఖ్య గురువులు---సన్యాస దీక్ష ఇచ్చు వారు.
7.పరమ గురువులు---ఎవరి దర్శనము చేత అఙానము తొలగి సమస్యలు పోయి ప్రశాంత చిత్తము లభిస్తుందో వారే పరమ గురువులు.
   శిష్యులను సమదృష్టితో చూడగలవాడే పరమ గురువు.ఈరోజు గురుపూఝ చేసిన వారిని మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రీ గురు దథుని,శ్రీ సాయిని పూజించాలి. కలియుగ ప్రభావంతో ధర్మాన్ని వదిలి నడిచే వారిని ఉధ్ధరించుటకు దత్తత్రేయుడు  వివిధ
      

No comments:

Post a Comment