మహభరత ప్రాశస్త్యము.
ధర్మతత్వఙులు ధర్మశాస్త్రమని ,ఆధ్యాత్మవిదులు వేదాంతమని,నీతివిచక్షిణులు నీతిశాస్త్రమని,కవులు మహాకావ్యమని,లాక్షణికులు లక్షణ గ్రంధమని ,పౌరాణికులు బహు పురాణ గ్రంధమని ఇలా అనేక విధాలుగా భారతం గొప్పదనాన్ని చెబుతారు.
నిత్యం భారతీయుల జీవితాలలో మమేకమైనది.తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అంటాము.విందు భోజనాలలో గారెలకు ఎంత ప్రాధాన్య మున్నదో మన జీవితాలలో భారతానికి అంత ప్రాధాన్యమున్నది.ఏ మాలిన్యము లేని వారిని శౌచ గాంగేయుడు తో పోలుస్తాము.విరివిగా దానాలు చేసేవారిని దానకర్ణుడు అంటాము.కర్ణుడు లేకుండా భారతం లేదని వ్యక్తి ప్రాధాన్యతను చెబుతాము.వూరికే గొప్పలు చెప్పేవారిని ఉత్తరకుమార ప్రగల్భాలు అని,పనికి ఆటంకం కలిగించేవారిని సైంధవుడిలా అడ్డుపడ్డాడని,ప్రశ్న మిది ప్రశ్న వేసే వారిని యక్షప్రశ్నలని,కుటిల సలహాలు ఇచ్చే వారిని శకునిమామ అని అంటాము.వివాదరహితులను వాడికేంటి ధర్మరాజు అని,బాగా లావుగా వున్నవారిని భీముడు అని,పిల్లల తప్పుల్ని ఒప్పులుగా చూసే అంధ తండ్రిని దృతరాష్ట్రుడి ఫుత్ర ప్రేమతో పోలుస్తాము.అనేక పనులు ఒకసారే చేసే వారిని సవ్యసాచి అంటాము.సమస్యల వలయం లో వుంటే పద్మ వ్యూహం తో ,విషయం లేకుండా పేజీలు నింపు తుంటే చాట భారతం. రాసాడంటాము.ఇలా. భారత పాత్రలన్ని. నిరంతరం మన చుట్టూ నే కనిపిస్తుంటాయి .అందుకే భారతానికి అంతటి ప్రాముఖ్యత.

No comments:
Post a Comment