చిత్త శతక కర్త శ్రీపతి భాస్కర కవి వ్రాసిన ఈ చాటువు మానవతా వాదాన్ని ఎంత గొప్పగా చెప్పిందో చూడండి.
బీదల కన్న వస్త్రములు పేర్మి నొసంగుము,తుచ్చ సౌఖ్య సం
పాదనకై అబధ్ధముల పల్కకు,వాదము లాడబోకు,మ
ర్యాద నతిక్రమింపకు,పరస్పర మైత్రి మెలంగు,మిట్టివే
వేదము లం చెరుంగుము,వివేక ధనంబిది నమ్ము చిత్తమా!
No comments:
Post a Comment