చిరు దరహాసాలతో,కొటి కలలతో
బడిలో అడుగుపెట్టిన వారికి తెలియదు
తమ హాసాన్ని,కలల్ని కాలరాసే
ముష్కరులు పొంచి ఉన్నారని
హటాథుగా చొరబడిన ఆగంతుకులను
ఆస్చ్ర్యంగా చూస్తుండగానే
క్షణాల్లో అసువులు అనంత వాయువులో
కలిసిపోతుంటే
ఏమి జరుగుతోందో,ఏం చెయ్యాలో తెలియని
పాపం,పుణ్యం ఎరుగని అమాయుకులు
తోటి వారు కనులముందు నేలకొరుగుతుంటే
ఎంతగా అలమటించారో
పసరు మొగ్గలను పాశవికం గా
నలిపేసి
తల్లి తండ్రుల ప్రాణాలు
ఉండీ లేనట్లుగా చేసి
పిల్లలపై వారి ఆశలను అడియాశలు చేసి
గుండెలలో చిచ్చును రగిల్చి
ఎప్పటికీ తీరని దూఃఖాన్ని మిగిల్చి
ప్రభుత్వ చర్యకు ప్రతిచర్యగా
తమ ప్రాణాల్నే ఫణం గా
పెట్టాలన్న సత్యం తెలియని
సత్తెకాలం పిల్లలు
పాఠశాల ప్రాంగణమే
వారికి మరణశాసనమౌతుందని
మరుభూమిగా మారుతుందని
ఆ తల్లి కి తెలియదు
తెలిస్తే
ఏ తల్లీ తమ బిడ్డను బడికి పంపదు.
చదివి ఏ వూళ్ళూ ఏలక్కర లేదు
తమ కళ్ళ ముందర తిరగాడితే చాలని
గుండెల్లో దాచుకుంటుంది
బిడ్డల్ని కోల్పోయిన
ఆ తల్లుల గర్భ శోకం తీర్చగల
మంత్రదండ మేదైనా ఉంటే బాగుండు
కాలాన్ని మించిన మంత్రదండ మేముంటుంది?
అది మీ గాయాన్ని మాంపి
మిమ్ము మిమ్ము గా నిలబెట్టే రోజు
త్వరగా రవాలని ప్రార్ధించడం కంటే
మేము ఏం చేయగలం?
(ఉగ్రవాదుల దాడులలో అశువులు బాసిన పిల్లలకు నివాళులు)
No comments:
Post a Comment