Friday, December 19, 2014

పొట్లకాయపొడికూర


    పొట్ల కాయ.    --1
    కంది పప్పు   ---1/4 కప్పు
    నూనె.           ----2 స్పూన్లు
    ఉప్పు.       ------రుచికి సరిపోను
   కారం. --------11/2 స్పూన్లు

    మినపపప్పు,జీర,ఆవాలు-తిరగమోతకు
    వెల్లుల్లి-------4రెబ్బలు
    కరివేపాకు--2రెబ్బలు

             ముందుగా కందిపప్పు మరీ మెత్తగా కాకుండా పలుకులకు ఉడకబెట్టు కొని పక్కన పెట్టు కోవాలి.పొట్ల కాయ సన్నగా ముక్కలు తరుగుకొని  ఒక పొంగు రానిచ్చు కోవాలి.

ష్టొవ్ మీద బాణిలి పెట్టి  నూనె వేసి కాగినాక తిరగమోత దినుసులు వేసి చిట పట లాడాక కొంచెము చితగ కొట్టి వెల్లుల్లి రెబ్బలు  తరువాత కరివేపాకు వేసి  కాలినాక  పొట్లకాయ ముక్కలు మీరు పిండి వేయాలి.కొంచెం వేగాక ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి,సరిపోను ఉప్పు,కారం వేసుకొని రెండు నిముషాలు వేయించుకొని దించుకోవాలి.అంతే  పొట్లకాయ కందిపప్పు పొడికూర తినతానికి సిధ్ధం.

1 comment:

  1. ఈ కూర నేనూ చేస్తానండి.కొంచెం మార్పేమిటంటే కూరలో మామూలు కారం బదులు అప్పటికప్పుడు ఎండుమిర్చి,జీరా వెల్లుల్లి బరకగా పవుడర్ చేసి వేస్తా. చాలా బాగుంటుంది. ఈసారి అలా ప్రయత్నించి చూడండి.నాకు చాలా ఇష్టమైన కూర కూడా.

    ReplyDelete