మష్రూం ఫ్రై:--
మష్రూం----------- -----250 గ్ర
కొబ్బరి--------------------1/4 కప్పు
అల్లం,వెల్లుల్లి పేష్ట్------1 ట్బ్ల్ స్పూన్
పచ్చి మిరప----------2
ఉప్పు,కారం--------------సరిపోను
నూనె----------------------2ట్బ్ల్ స్పూన్లు
కొత్తిమీర, కరివేపాకు కొంచెము
జీర, మినపపప్పు, ఆవాలు తిరగమోతకు.
ముందుగా మష్రూం శుభ్రం గా కడుగుకొని కట్ చేసుకోవాలి.వాటిని మునిగేటట్టు నీళ్ళు పోసి ఉడకబెట్టాలి.తరువాత ష్టౌ మీద బాణిలి పెట్టి నూనె వేసి కాగినాక తిరగమోత్ దినుసులు కరివేపాకు వేసి కాలినాక ఉడకబెట్టిన మష్రూం వేసి కొంచెము సేపు సన్న సెగ మీద వేయించి అల్లం,వెల్లుల్లి పేష్ట్,ఉప్పు వేసి వేయించి నాక కారము ,కొబ్బరి వేసి రెండు నిముషాలు తిప్పి దించేయాలి.కొత్తిమీర సన్న గా కట్ చేసి పైన జల్లుకోవాలి.
No comments:
Post a Comment