కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
ఈ రోజు ఆదికవి వాల్మీకి జన్మదినం.శ్రీమద్రామాయణ రూప కర్త.ఇతడి పూర్వ నామం రత్నాకరుడు.వ్యాధుడు వేటాడుతూ జీవనం సాగించేవాడు. ఋషుల సూచనతో "మరా,మరా" అనే నామ ఝపం చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోయాడు.చుట్టూ పుట్టలు(వల్మీకం) పెరిగి పోయాయి.బాహ్య ప్రపంచాన్ని వదిలేసాడు.ఈ సమయం లోనే నారదుడు రామకధను వినిపించాడు.ఒకరోజు శిష్యులతో వెళుతుండగా ఒక బోయవాడు క్రౌంచ పక్షుల జంట లోని మగపక్షిని చంపగా ఆ దూఃఖం తో ఆడ పక్షి కూడా చనిపోతుంది.ఆ దృశ్యం చూసి చలించి శోకం నుంచే శ్లోకం పుట్టింది.అదే--
మానిషాద ప్రతిష్ఠాం త్వగమః శాశ్వతీస్సమా అః
Yఅత్ క్రౌంచ మిధునాదేక మవధీఅః కామమోహితం||
శోకం తో ఉన్న వాల్మీకి తో బ్రహ్మ నీవు చెప్పినది చంధో బధ్ధమైన శ్లోకము.రామాయణ కావ్యాన్ని రచించమని సూచించాడు.
అలా ఆదికావ్యం రామాయణం ఆవిర్భవించింది.ప్రభు ధర్మాన్ని,ఆదర్స గార్హస్థ్య జీవితాన్ని వాల్మీకి భవ్యం గా చిత్రించ దలుచుకున్నాడు.సమాజాన్ని నీతి,ధర్మం,శీలం,సదాచరణ మొదలైన వాటిని బోధించాలనే తపనే ఈ కావ్యం. ఇది మానవాళికి లభించిన అపూర్వ కావ్యము.ధర్మ సంశయములను దూరమొనర్చి,పవిత్రధర్మములను సూచించును.వేదముల,ఉపనిషత్తుల సారమును సామాన్యులకు అందజేయు అద్భుత కర్తింగ్.
"భక్త్యా,శక్త్యా చ యుక్త్యా చ బ్రూయాద్రామాయణం నరః"
భక్తితో,పాండిత్యపు శక్తితో,వాద ప్రతివాద యుక్తి తో రామాయణాన్ని చదవాలి.ఈ కావ్యాన్ని చదవడం వలన మోక్ష ప్రాప్తి లభిస్తుందని చెప్పబడింది.సీతా వివాహ గట్ట పారాయణం,సుందర కాండ పారాయణం వంటి వాటి వలన ఇహలోక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడింది.అలాగే రామలక్ష్మణులు,భరత శత్రుఘ్నులు,రావణ విభీషుణులు ద్వారా--భ్రాతృ ధర్మం,కౌసల్య,సుమిత్ర,కైకల ద్వారా---భార్య,మాతృ ధర్మాలను;దశరధుని ద్వారా--భర్త,పితృ ధర్మాలను;జటాయువు,సంపాతుల ద్వారా---స్నేహ ధర్మాన్ని;ఆంజనేయుడు ద్వారా--నిస్వార్ధ సేవా ధర్మాన్ని ప్రభోధిస్తారు.సీత లోకమున స్త్రీఇలు అనుసరించదగు అనేక ధర్మములను ఆచరించి చూపినది.
ఈంతటి మహోత్కృష్ట వారసత్వ సంపదను మనకు అందించిన వాల్మీకికి సదా మనం కృతఙులమై ఉండాలి.
No comments:
Post a Comment