కడుపులో
బీజం పడగానే
స్త్రీత్వానికి ప్రతీకననే
ఆనందానుభూతిలో నేను
సుతిమెత్తని
కదలికలతో కలియతిరుగుతుంటే
కలల ఊహలలో
ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ నేను
తప్పటడుగుల్తో
తడబడుతుంటే
ఎక్కడ గాయపడతావోనన్న
భయాందొళనలో నేను
ఆ తడబాటు
ఆలవాటు గా మారితే
విచలిత మనస్కనై
విషణ్ణ వదనంతో నేను.
నేరస్థుడిగా
లోకం నిన్ను దోషిగా చూపితే
ముక్కలైన హృదయం తో
బ్రతుకంతా జీవచ్చవం లా నేను.
No comments:
Post a Comment