విత్తనం తాను
చనిపోతూ
పంట నిచ్చింది.
పువ్వు తాను
రాలిపోతూ
పండు నిచ్చింది.
సూర్యుడు తాను
అస్తమిస్తూ
వెన్నెల నిచ్చాడు.
భూమి తాను
తిరుగుతూ
అనంత కాలాన్నిచ్చింది.
ప్రకృతి తాను
తరిగిపోతూ
సమస్త సంపదల నిచ్చింది.
అమ్మ తాను
కరిగిపోతూ
జీవితాన్ని ఇచ్చింది.
ఇన్ని త్యాగాలతో
జీవిస్తున్న మనం
సమాజానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?
No comments:
Post a Comment