సప్త ఋషి మండలం బు తో
గగనం దేదీప్యమానమై నొప్పె
సుదాం శు ని కిరణములు సోకి
దఌతకమలములు దర హాసము తో వెలిగె
వికసిత నవ కమల సౌరభము తో
జగతి సుగంధ వికీర్ణ మానమయ్యె
భూ వనిత నవ తృణ శిలీన్ధ్రములతో
చిత్ర విచిత్రాం బరములు ధరించి
హరివిల్లు భువికి హారమైన దన్న భ్రాంతి నొసగె
ఆకాశం తారాహార పంక్తుల తో
దీపతోరణ ములవో లే వెలుగొందే
శ రాతాగామము అఖిల జనులకు
మోదమును గూర్చె.
No comments:
Post a Comment