అన్న దానము గొప్పదనవచ్చునే కాని
అన్నంబు జాములో నఋఇగిపోవు
వస్త్రదానము గూడా భవ్య దానమె కాని
వస్త్ర మేడాదిలో పాతదగును
గృహదానమొకటి యుత్క్ర్ష్ట దానమె కాని
కొంప కొన్నేండ్ల లో కూలిపోవు
భుమి దానము మహాపుణ్య దానమె కాని
భూమి యన్యులజేరిపోవవచ్చు
అరిగిపోక ,ఇంచుకయేని చిరిగి పోక,
కూలిపోవక యన్యులపాలు గాక
నిత్యమయి, వినిర్మలమయి,నిశ్చలమయి
యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి.
----చిలకమర్తి లక్ష్మీ నరసిమ్హం.
No comments:
Post a Comment