శ్రమ అంటే కష్ట పడటం,పనిచేయడం. ఎవరి కి చేతనైన పని వారు చేయాలి.తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు ఎంతున్నా కూర్చుని తింటూంటే కొండలైనా కరిగిపోతాయి.కొంతమంది కొన్ని పనులు బాగా చేయగలుగుతారు.ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటుందో అందులో ప్రావీణ్యత సంపాదించ వచ్చు. ఒకవేళ ఇష్టం లేని పని చేయవలసి వచ్చినా మొక్కుబడిగా కాకుండా ఇష్టం చేసుకోవాలి అప్పుడు కష్టమనిపించదు.
" తన కిష్టమైన కార్యాన్ని పరమ మూర్ఖుడు సైతం సాధిస్తాడు.కానీప్రతి కార్యాన్ని తన అభీష్టానికి అనుగుణంగా మలచుకో గలవాడే బుధిశాలి,ధీశాలి"---అంటారు స్వమి వివేకానంద.
కొంతమంది కొంచెం పని చేయగానే ఎంతో కష్ట పడిపోయినట్లుగా ,తాను మాత్రమే చేసినట్లుగా భావిస్తారు.అలాంటి వారికి కనీస అవసరాలకు లోటు లేకపోవచ్చు కానీ ఉన్నత శిఖరాలు ఎక్కలేరు.శ్రమ లోనే విశ్రాంతి వెతుక్కునే వారు ఆర్ధికం గానే కాక సమాజం లో కూడా ఒక గుర్తింపుని పొందగలరు.తక్కువ శ్రమ ఎక్కువ విశ్రాంతి కోరేవారు ఏమీ పొందలేరు.పైగ కబుర్లతో కాలక్షేపం చేస్తూ అనవసర వ్యాసంగాలతో అశాంతిగా ఉంటారు. బధ్ధకం,అలసత్వం,అలక్ష్యము మనిషి కి బధ్ధకం శత్రువులు.కృషి ,పట్టుదల మనిషి కి కనిపించని రెండు రెక్కలు.ఇవి రెండూ ఉంటే దేన్నైనా సాధించ వచ్చు.
నేటి తరం కలలు కంతున్నారు కాని అందుకు తగిన శ్రమ చేయక పోవడం,ఒక్కసారిగా ఎవరెష్టు శిఖరాలు ఎక్కాలనుకోవడం,అది సాధ్యం కాక మధ్యలోనే వదిలేయడం.నిరాశా,నిస్పృహలకు లోనవడం.ఏ పనైనా మొదలు పెట్టినప్ప్డు పూర్తిగా అవగాహన చేసుకోవాలి టుదొర్ వరకు నిబధ్ధతో చేయాలి.
భర్తృహరి అంటారు:--
"నీచులు విఘ్నాలు కలుగుతాయని ముందే పని మొదలుపెట్టరు,మధ్యములు మొదలుపెట్టి విఘ్నాలు కలగగానే మధ్యలో వదిలేస్తారు, ధీరులు ఎన్ని ఆటంకాలు వచ్చినా తొలగించుకుంటూ అనుకొన్నది సాధిస్తారు."
ఇంక"కార్యసాధకుడు దూఃఖాన్ని,సుఖాన్ని లెక్కించడు."--అలా చేయగలిగి నప్పుడే జీవితం లో స్థిరత్వాన్ని పొందగలుగుతాము."కృషి తో నాస్తి దుర్భిక్షం"-
సమయాన్ని వృధా చేయకుండా దేన్నైనా "శోధించి సాధించడమే ధీర గుణం".అప్పుడే విజయం నీ సొంతమౌతుంది.
No comments:
Post a Comment