తెలుగు భాష
"ఖ"కి కాలం చెల్లిందని
"క" తో సర్దుకు పోదామా!
ఖాళీని క తో పూరించ గలమా!
"ఘ" గడప దాటిందని
"గ "తో గడుపుకుందామా?
"ఘడియ"తో "గడియ"వేయలేము కదా!
"ఛ"ని వదిలి చదివేధ్ధామా?
"ఛత్రము" లేని చాయ గా ఇగిలి పోదామా!
"ఝ" ని చూసి జడుసుకొని
జరిగిపోదామా?
తుమ్మెదల "ఝ"ంకారాన్ని,
"ఝ"రుల గగలల్ని
వినడం మానివేద్దామా?
"ఠీ"వి గా ఉన్న "ఠ"ని
మరచిపోయి
ఖన్"ఠా"న్ని కంటకముగా మార్చేద్దామా?
"ఢ"మురక నాదాన్ని
"ఢ"ంకా భజాయించి చెప్పలేక
డబ్బాలో పెట్టే ద్దామా?
"థ"తరలిపోయిందని
త నే తలచుకుందామా!
క"థ" మారిపోయి కతే మిగులుతుంది.
"భ" ని చూసి భయపడి
"భ"రతుడి ని బరతుని గాచేసి
"భ"ంగ పడదామా?
అ"ణా",కా"ణీ"లు అలుసై పోయాయని
గ"ణ"పతి తో బూ"ణీ" చేయని
పూజ ఉండదు కదా?
శాంతం గా జీవించా లని
సాంతం గా భాష నే మార్చి
మనని మనం ఏమార్చుకొని
తెలుగు కే తెగులు పట్టిద్దామా?
No comments:
Post a Comment