భారతీయు సంప్రదాయం లో చతుర్వేధాశ్రమాలు ఉండేవి.బ్రహ్మచర్య,గార్హస్థ్య,వానప్రస్థ,సన్యాసములు.చతుర్విధ పురుషార్ధాలను పొందడానికి మెరుగైనది గృహస్థాశ్రమమే.దీనికి ములమై వివాహం.దీని యొక్క ఫలితం దాంపత్యం.చ్తుర్విధాశ్రమాలను దేశ,కాల,పాత్ర పరిస్థుతులకు అనుగుణం గా పాటించాలి.కాని దాంపత్యం ఏ కాలమందైనా ఒకటే.
స్వర్గం కాని,నరకం గాని సంసారం లోనే ఉంటాయి.గార్హస్థ్య ధర్మాన్ని చక్కగా పాటిస్తూ మోక్ష సోపానంగా మార్చుకోవాలి.దానికి కొంత వివేకం కావాలి.విశ్వ నిర్మాణానికి ములమై దాంపత్య భావం."దమతి ఈత్ దంపతి".ఆలుమగలు కలసిమెలసి సాగించే జీవనమే దాంపత్యం.మదమాత్సర్యాలకు రావు లేక దైవ భావనతో దాంపత్య జీవనం గడపాలి.నిజమైన దంపతుల దాంపత్యం గురించి కాళిదాసు మేఘ సందేశం లో
"స్నేహానాహూః కిమపి విరహేధ్వంసినః తేత్వ భోగా
దిష్టే వస్తు న్యుపచి చరసాః ప్రేమరాశీ భవంతి"
స్నేహితులు దూరమైతే ఆ స్నేహం నశిస్తుంది.కాని దంపతులు విషయం లో ఆ స్నేహం ఆ ప్రేమ రోజు రోజుకీ పెరిగి ప్రేమరాశిగా మారుతుంది.
వివాహం ఎనిమిది రకాలుగా ఉన్నాయి
1.బ్రహ్మం: ఆచార వంతుడైన బ్రహ్మచారిని రప్పించి కన్యను ఇవ్వడం.
2.దైవం: ఋత్విజునికి కన్య నివ్వడం.
3.ఆర్షం:ధేనుద్వయాన్ని కాని,బలీవర్ధద్వయాన్ని కానీ వరుని దగ్గరి నుండి తీసుకొని కన్యనివ్వడం.
4.ప్రాజాపత్యం:తల్లిదండ్రులు వరుని పూజించాలి,కన్యనివ్వడం.
5.అసురం:కోరిన ధనాన్నిచ్చి ,వారి ఇష్టం తో పెళ్ళి చేసుకోవడం.
6.గాంధర్వం:స్త్రీ పురుషులు పరస్పరాకర్షితులై కలవడం.
7.రాక్షసం:కన్యక బంధువులను చంపి కన్యను బలవంతంగా తెచ్చుకొవడం.
8.పైశాచం:ఏమరుపాటున ఉన్న స్త్రీని బలాత్కరించడం.
స్వయం వరం కూడా ఉండేది.గాంధర్వ రాక్షసాలు శాస్త్ర సమ్మతాలే కాని క్షేమదాయకం కాదని వ్యాసుని ఉపదేశం.ప్రస్తుతం నాలుగో వివాహం విధానం అమలులో ఉన్నది.పవిత్రమైన ,అన్యోన్యమైన దాంపత్యమే వివాహానికి ప్రయోజనం.భార్యా భర్త లిరువురూ ఎవరి ధర్మాన్ని వారు సక్రమముగా నిర్వర్తించాలి.ఒకరియందు ఒకరికి ప్రేమ,విశ్వాసం ఉండాలి.భార్యా భర్తల అన్యోన్యతను గురించి వాల్మీకం లో శ్రీరాముడు "సూర్యునికి వెలుగులా భార్య- భర్తకు అనన్య(వేరు కానిది) అన్నాడు.
"కాలేనా వరణాత్య యాత్ పరిణతేయత్ స్నేహ సారేస్థితం
భధ్రంత స్వ సుమానుషస్య కధమప్యేకం హితత్ ప్రార్ధ్యతే"
పెండ్లి మొదలు మరణం వరకు చెరిగిపోనిది ,మోహరహితమైనది,సుఖదుఃఖాలలో,సమానంగా ఉండేది,ఒకరినొకరికి హృదయ శాంతి నివ్వగలిగేది,వయసుమళ్ళినా తరగని అభిమానం కలది,శుభకరమైనది,బాహ్యం కన్న అంతర్గత ప్రాధాన్యతను కలిగి ఉన్నది ఉత్తమ దాంపత్యం.దంపతులైన స్త్రీ పురుషులు ఎలాంటి అరమరికలూ లేకుండా ఒకరినొకరు పట్ల ఒకరు ఆత్మీయంగా,అన్యోన్యం గా జీవించి నప్పుడే కలకాలం నిలబడుతుంది.
సహనం,అసహనం,సౌమ్యాం,క్రౌర్యం,అనిష్టత,అననుకూలత,వ్యామోహం,సామాన్యం,అసమాన్యం,ఆదర్సం--అన్ని రకాల దాంపత్యాలు పూర్వ కాలమూ ఉండేవి.కాని వారు సంఘ కట్టుబాటుకి వెరచో ,ఆర్ధిక స్వాతంత్ర్యం లేకో కుటుంబానికి కట్టుబడి ఉండేవారు.
మధ్యకాలం లో ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ సర్దుకు పోదామనో,ఒంటరి పోరాటం చేయలేకనో వివాహ ధర్మానికి కట్టుబడేవారు.
ఆధునిక కాలం లో చిన్న కారణాలకే వివాహబంధాన్ని విచ్చిన్నం చేసుకొని విడాకులకు వెళ్ళిపోతున్నారు.మితిమీరిన స్వేచ్చ,ఆర్ధిక స్వాతంత్ర్యం,విలువల పట్ల నిర్లక్ష్యం ఈ పరిస్థితికి కారణం కావచ్చు.ఈ పరిణామం ఎక్కడకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.