నిన్న వార్తలలో ఒక బి టెక్ విద్యార్ధి సెల్ఫీ తీసుకోటానికి రైలు ఇంజను ఎక్కి హైటెన్షన్ వైర్లు తగిలి ప్రాణాపాయస్థితిలో హాస్పటల్ లో ఉన్నాడని చూసాను.అతని తల్లిదండ్రులు ఎంత బాధ పడుతూ ఉండి ఉంటారో కదా అనిపించింది.పిల్లల ఇలాంటి సరదాలు గర్భశోకాన్ని కలిగిస్తున్నాయి.ఈ మధ్య తరుచు ఇలాంటి వార్తలు వింటున్నాము.
కాలవలలోకి ఈతకు వెళ్ళడం లోటు తెలియకుండా అందులో దిగటం ,స్నేహితులు దిగుతున్నారు కదా అని ఈత రాకపోయినా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం.బైక్ రేస్ లు అయితే సరేసరి .ఉన్న ఒక్క పిల్లాడి సరదా కోసం విలాసవంతమైన బైక్ లు కొనడం వాటిపై విన్యాసాలు చేస్తూనో రేసులలో పాల్గొంటూనో అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు.కోట స్రీనివాస రావు కొడుకు అలాగేగా ప్రాణాలు కోల్పోయింది.దాదాపుగా వీరంతా విద్యార్ధులే.ఉజ్జ్వల భవిష్యత్తు ఉండి ఎన్నో శిఖరాలు ఎక్కాల్సిన వీరంతా అర్ధాంతరం గా అసివులు బాస్తున్నారు.ఆశలన్నీ వీరిపై పెట్టుకు బ్రతుకుతన్న కన్నవారి హృదయాలలో కార్చిచ్చు రగిలిస్తున్నారు.పాఠశాలకు వెల్తున్న5,6సంవత్సరాల వారి నుండి 25 వరకు ఉంటున్నారు.
పిల్లలు ఎక్కడకు వెళుతున్నారో ,ఏమిచేస్తున్నారో తల్లితండ్రులు గమనించాలి. సరదాలు ప్రాణాలు తీసేవి కాకుండా ఉండాలని చెప్పాలి.ఈ వయసులో సరదాలు సహజమే కాని ప్రాణాలు అంత ఖన్నా ముఖ్యమైనవి కదా!నిత్యం ప్రమాదాల వార్తలు వింటూ కూడా సరదాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకొని ఆశలన్నీ మీ మీద పెట్టుకొని బ్రతుకుతున్న కన్న వారికి జీవితాంతం దూఃఖాన్ని మిగల్చడం న్యాయం కాదు కదా!
పిల్లలూ ఒక్కసారి ఆలోచించండి!
No comments:
Post a Comment