రాత్రి పది అయ్యింది.టి.వి చూస్తూ కూర్చున్నాను.ఎదురింటివారి కుక్క గోలగోలగా అరుస్తోంది.రోడ్డుమీద ఎవరన్నా వెళుతున్నా అది అలాగే అరుస్తుంది.విశ్వాసం గల జంతువు కదా!
రాము మా ఇంట్లో పనివాడు.'కుక్కలా విశ్వాసం గా'ఉంటాడు.అంతకు ముందు పనిచేసిన రాములమ్మకు ఎంతో ఆర్ధిక సహాయం చేసినా పని మానేసింది.ఒక ముద్ద అన్నం పెడితే మన చుట్టూ తిరుగుతుంది కుక్క.అందుకే 'కుక్కకు విశ్వాసం ఉంటుంది కాని మనిషికి ఉండదు.'పక్కింటి వారు వాచ్ మాన్ ను పెట్టుకున్నారు. వాడు 'కుక్కలా కాపలా కాస్తాడూ.
మా ఆఫీసులో రామారావు వాళ్ళ అబ్బాయి కాలేజీ సీటుకి సహాయం చేయమని అడిగాడు.అంతకు ముందు నాకు చేయల్ లేదు 'కుక్క కాటుకి చెంప దెబ్బలా' నో అని చెప్పేశాను.సుమతీ శతక కారుడు కూడా 'కనకపు సిమ్హాసనమున శునకము కూర్చుండ బెట్టిన వెనుకటి గుణం మారదాని చెప్పాడు.
పక్కింటి పంకజం గోడ మీదగా మా దొడ్లోని మందార పూలు కోస్తూ కొమ్మలన్నీ విరిచేస్తోంది.తిరిగొచ్చి కోసుకోమని ఎన్నిసార్లు చెప్పిన 'కుక్క తోక వంకరాలా ఆమె గుణం మారదు.'కుక్క తోక పట్టుకొని గోదావరి ఈది నట్లు 'స్నేహితుడిని నమ్మి వ్యాపారం లో వాటా పెట్టినందుకు నట్టేట్లో ముంచేశాడు.
మా బావమరిది కొడుకు ఉన్నత చదువులు చదివాడు కానీదాలి గుంట్లో కుక్క చందమునావివేకము శూన్యము.మా వీధిలో సుబ్బారావు ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు.ఎవరన్నా గట్టిగా సమాధానం చెబితే 'మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదాన్నట్లు ఇంట్లో కెళ్ళి బయటకు రాడు.రాజా రావు రాజా(కుక్క)కు పుట్టినరోజు వేడుకలు ఘనం గా చేస్తున్నాడు.అది చూసి చద్ది అన్నం తప్ప ఎరుగని పనివాడు 'పేదవాడింట్లో పుట్టడం కన్నా ఉన్న వాడింట్లో కుక్కగా పుట్టాలానుకున్నాడు.
దొంగ బీరువాలు వెతికినట్లు 'కుక్క ఇల్లు జొచ్చి కుండలూ వెతుకుతుంది.సుబ్బారావింట్లో రాము జామ కాయలు దొంగతనం చేసాడనీకుక్కను కొట్టినట్లు 'కొట్టాడు.అల్ప బుధ్ధి కలవారికి అధికారమిస్తే 'చెప్పు తినెడి కుక్కకు చెఱ్కు తీపి తెలియనట్లు ' విలువ తెలియదు కదా!అనసూయమ్మ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందీకుక్క వంటి ఆశ 'కూర్చోనీయదు మరి.'కక్కిన కుక్క దగ్గరకు ,కన్న కుక్క దగ్గరకు పగవారిని కూడా పంప వద్దని నీతి.'కుక్క యేమెరుగు గురు లింగ జంగంబూ.అంటారు.
నేరస్థులను పట్టుకోవడం లో పోలీసులకి మార్గదర్శి.మాయలఫకీరు బలా నాగమ్మ ను కుక్క గా మార్చే కిడ్నాప్ చేశాడు.దేవదాసుకి తోడు కూడా శునకమే!
"గ్రామ సిమ్హం "గా ప్రసిధ్ధి చెందినా,కాలభైరవుడిగా పూజ లందుకున్నా శునకం మనుషుల కన్నా విశ్వాసము కలది.విదేశాలలో ఒకొక్కరూ 3,4 కుక్కల్ని కూడా పెంచుతుంది కుంటారు.తమ ఆస్తులు మొత్తం కుక్కలకు వ్రాసిన ఘనులు కూడా ఉన్నారు.కుక్క మన జీవితాలలో ఏదో ఒక సంధర్బం గా గుర్తు చేసు కుంటూనే ఉంటాము.
"కుక్క ఉన్నది జాగ్రత్త!"
*************్********్*********్**********్***********్********్************్********
No comments:
Post a Comment