తెలుగు సాహిత్యం లో శతక వాఙ్మయానికి ప్రత్యేక స్థానం ఉంది.వేమన,సుమతీ శతకాల సరసన చేర్చదగిన మరో శతకం'కవి చౌడప్ప శతకం".
ఈ శతక కర్త కుందవరపు చౌడప్ప.ఇతడు రఘునాధ రాయల సమకాలికుడు."అన్నిట మంచి వారు,విమలాత్ములు,హాస్య కళా ధురంధరుల్........." అన్న చాటు పద్యాన్ని బట్టి మట్ల అనంత భూపాలుని ఆస్థానములో ఉన్నట్లు తెలుస్తోంది."హాస్య కవి జాణ",గాన విద్యా ప్రవీణుడు"అన్న బిరుదులను పొందాడు.తిట్టు కవి గా,బూతు కవిగా ప్రసిధ్ధి చెందాడు.కాని ఆనాటి పరిస్థితుల పట్ల తన అసంతృప్తిని పరుష భాషలో నిర్భయంగా చెప్పిన ధీమంతుడు.కందం చెప్పడంలో తిక్కన అంతటి వాడనని చెప్పుకున్నాడు.
"ముందుగ చను దినములలో -కందమునకు సోమయాజి ఘనుడందురు నే
డందరు నను ఘనుడందురు-కందమునకు కుందవరపు కవి చౌడప్పా!"
వేమన వలెనే సంఘ దురాచారాలను తూర్పారబట్టాడు.ఏది చెప్పినా బలంగా,సూటిగా గుండెలకు తగిలేట్టు చెప్పగలడు.
"తినజాలకయే ధర్మము-గనజాలక పరమలోభి కష్టుడు గూర్చెన్
ధనమెల్ల నేలపాలని,గనుమప్పా కుందవరపు ......"
మచ్చుకి ఇది ఒకటి.తిట్టు పద్యాలలో 'గాడిదాపద్యం ప్రసిధ్ధమైనది.
"ఆడిన మాటలు తప్పిన-'గాడిద కొడూకంచు తిట్టగా విని ,మదిలో
'వీడా నా కొడూకని ఏడ్చును-గాడిదయును కుందవరపు........"
ఆధ్యాత్మక మైన పద్యాలు కూడా శతకం లో కనిపిస్తాయి.
"అలసటవేసట నయినం...........గరుడధ్వజునిన్ దలచిన వారి చేరవు"
"అతిధుల బంధు జనంబుల..........పూజించిన నరుడు సద్గతి నొదున్"
ఇవి ఉదాహరణలుగా చెప్పవచ్చు.'పసాపద్యాల గురించి తెలుసుకోకపోతే ఇది అసమగ్రమే అవుతుంది.
"పప్పే పస బాపలకును,-ఉప్పే పస రుచుల కెల్ల,ఉవిదల కెల్లన్
కొప్పే పస ,దంతములకు-కప్పే పస..........."
"మీసము పస్త మొగ మూతికి..........."
కవి 'పసా అంతా ఈ పద్యాల వలన తెలుస్తుంది.అలాగే దేనికి ఏది పదిలమో చెప్పే చక్కటి చాటువు ఒకటి
"ఇంటికి పదిలము బీగము -వింటికి పదిలంబు నారి,వివరింపంగా
చంటికి పదిలము రవికెయు -కంటికి పదిలంబు రెప్ప..........."
భారవి,నాచన సోముడు,మాఘుడు,శ్రీ నాధుడు,పెధ్ధన,తిక్కన వంటి పూర్వ కవుల పట్ల అభిమానాన్ని ప్రకటించుకున్నాడు.ఏవో కొన్ని పద్Yఆలు శృంగార పద్యాలు ఉన్నంత మాత్రాన బూతు కవి గా ప్రచారం చేయడం సమంజసమేనా? దేనిలోనైనా మంచిని తీసుకొని చెడుని వదిలేయడం వివేకవంతుల లక్షణం.
No comments:
Post a Comment