మరు జనక మమ్మేలు మత్స్యావతార
గురుతుగా కృపజూడు కూర్మావతార
వరుదుడవు కావయ్య వరహావతార
సిరులు కరుణించు నరసిమ్హావతార
వక్షమున సిరి గల్గు వామనావతార
రక్షించు మము పరశురామావతార
రాక్ష సాంతక రఘురామావతార
పక్షి వాహన బలభద్రావతార
బ్రోవనేర్చిన యట్టి బుధావతార
కావవే మము వేడ్క కలికావతాఋఅ
భాషాపతి స్తోత్ర భాను ప్రకాశా
శేషాచలా ధీశ శ్రీ వెంకటేశా!
No comments:
Post a Comment