పద్య వైచిత్రి
రామరాజ భూషణుడు రచించిన "వసు చరిత్ర" కల్పనా చాతుర్యానికి ప్రసిధ్ధి చెందిన కావ్యము.ఆ కొవలోనే "పిల్ల వసుచరిత్ర" గా పిలువబదిన "విజయ విలాసము" చేమకూర వేంకటకవి విరల్ హితము.కల్పనా చాతుర్యము,వర్ణనలు,అనేక ఒడుపులను ప్రయోగించినాడు.తెలుగు పదములను కూర్చియు,విరిచియు సలలితముగా రచన గావించినాడు. విజయ విలాసములోని ఒక పద్య విశేషాన్ని చూధ్ధాము.
"తనకున్ కౌగిలి ఈ ఒకప్పుడును నాధా!నీ కరస్పర్సనం
బున గిల్గింతలె"యంచు పద్మిని కరాంభోజమ్మునన్ మందమం
ద నటద్వాయుచల ధ్ధళాంగుళులు కంపట్టంగ న వ్వెల్గురా
యని రా!రా! యని పిల్చె నా దగె ద్విరేఫాద్యంత దీర్ఘ ధ్వనుల్.
తామర తీగ,తన ప్రియుడైన సూర్యుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదని కేవలం కిరణాలతో తాకి గిలిగింతలు పెడుతున్నాడని చెప్పి , పిల్లగాలి వీస్తున్నప్పుడు కదులుతున్న తామర రేకులనే వేళ్ళతో కూడిన,పద్యం వంటి చేతిని కదిలిస్తూ తుమ్మెదల పొడవైన ధ్వనులతో సూర్యుణ్ణి రా,రా అని పిలుస్తున్నదా అన్నట్లు ఉంది.--అని భావము
ద్విరేఫమనగా తుమ్మెద.రెండూరా కారములు ఆద్యంత దీర్ఘ ధ్వనులు - అనగారెండు రకారములకు దీర్ఘములు--అనగా రా,రా.తామర పువ్వులలో సూర్యోదయము కాగానేతుమ్మెదలు ధ్వని చేయును.ఆ తుమ్మెదల ధ్వని టమర పూవన్న స్త్రీ సూర్యుని రా,రా యని పిలిచినట్లున్నది.ఇది ఇందులోని విశేషము.
తెలుగు సాహిత్య నిక్షేపాలలో ఇలాంటి అనర్ఘ రత్నాలెన్నో! వాటిని తవ్వి తీసి సొంతం చేసుకొనే సత్తా మనకుండాలి గాని!
No comments:
Post a Comment