రామా రావు ,సావిత్రమ్మలు భార్యాభర్తలు.వారి కుమార్తె యామినీ పూర్ణ తిలక.వారిధ్ధరూ మార్పు కోసమని రామా రావుని అమ్మ అని,సావిత్రిని నాన్నా అని కూతురితో పిలిపించుకుంటారు.ఒకరోజు రామా రావు స్నేహితుడు సూర్యా రావు వాళ్ళింటికి వచ్చి అరుగు మీద ఆడుకుంటున్న యామినిని మీ నాన్న ఏమి చేస్తున్నాడు అని అడుగుతాడు.పెరట్లో అంటు గిన్నెలు తోముతున్నాడు.మీ అమ్మ అంటే ఆఫీసుకి వెళ్ళింది అని చెబుతుంది. అతడు ఆశ్చర్య పోతాడు.తరువాత రామా రావు ని కలిసినప్పుడు మీ అమ్మాయి ఇలా చెప్పిందేమిటని అడిగితే మే మే సరదాగా అలా పిలిపించుకుంటున్నాము అంటాడు.లోక విరుధ్ధం గా అలా పిలిపించుకుంటే అనేక అనర్ధాలొస్తాయని మందలిస్తాడు.
ఇది నేను చిన్నప్పుడు "మిఠాయి పొట్లం"అనే కధల పుస్ తకఒ లో చదివాను.మరొక కధా కాకి కర్రల ఇల్లు,పిచ్చుక పిడకల ఇల్లు కట్టుకున్నాయి.గాలికి కాకి ఇల్లు,వరదలకి పుచ్చు క ఇల్లు కూలిపోతే ఒక దానికి ఒకటి సహాయం చేసుకున్నాయీ.
ఇలాంటి కధలు ఆ పుస్తకం లో చాలా ఉన్నాయి.ఇవి నేను చిన్నప్పుడు ఎప్పుడొ చదువుకున్న కధలు.ఇప్పటికీ గుర్తున్నాయి.ఇవేకాక సెలవులలో వేమన, సుమతి,దాశరధీ శతక పద్యాలు కంఠతా పట్టించేవారు మా నాన్నగారు.తెలుగు భాష పట్ల అభిరుచి,ఆసక్తి కలిగాయంటే ఆయన పుణ్యమే.
ఇప్పటి పిల్లలకి అలాంటి అవకాశ మెక్కడిది?చోటా బీం,పోగో,కార్టూన్ చానల్స్ లేదంటే కంప్యూటర్ గేంస్ వీటితో కాలక్షేపం చేసే పిల్లలికి పుస్తకాలు చదివే తీరికా,ఓపికా ఎక్కడిది?కాని నైతిక విలవల్ని బోధించే పుస్తకాలు చిన్నప్పటి నుంచీ చదివి నట్లైతే చక్కటి వ్యక్తిత్వముతో పెరుగుతారు.తెల్ల కాగితం లాంటి పసి మనసులలో చెరగని ముద్ర వేస్తాయి.ఇది నేడు అత్యంత అవశ్యము.
No comments:
Post a Comment