Sunday, May 25, 2014

FOSWAL

  ఫాశ్వాల్
              ఈ రోజు ఫాశ్వాల్ ప్రథమ వార్షికోత్సవ సభ విజయవాడలోని వాసవ్య మహిళామండలి సిల్వర్ జుబ్లిహాల్ లో జరిగింది.ఫాశ్వాల్ అంటే ఫ్రెండ్స్ ఆన్ సేం వేవ్ లెంగ్త్. ఇది మొదట కాలిఫోర్నియాలో స్తాపించబడినది. ప్రపంచంలో అనేకదేశాలకు విస్తరించి తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. టాగూర్  " ఎక్కడ మనుషులు భయం లేకుండా ఉంటారో--" అన్న గేయం ప్రార్ధనా గీతం గా పాడతారు.ముఖ్య అతిధులుగా వచ్చినవారు వివిధ అంశాలపై ప్రసంగిస్తారు. ఈ రోజు ముఖ్య అతిధి డాక్టర్ .పి. వి. కృష్ణా రావు.
                   కృష్ణా రావు గారు "పర్యావరణ పరిరక్షణ" పై ప్రసంగించారు. కేవలం మొక్కని నాటటం కాదు గార్డెన్ పెంచమని సూచించారు.అది అనేక సమస్యలకు పరిష్కారమని చెప్పారు.  గార్డెనింగ్ మంచి వ్యాయామమే  కాదు టానిక్ లాగా పనిచేస్తుంది.మానసిక, శారీరక ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ ఆర్కన్సాస్ వారి రీసెర్చ్ లో 3,310 మంది  గార్డెనింగ్ చేసిన వృద్ద మహిళలను  పరిశీలించగా వారు జాగింగ్,స్విమ్మింగ్,ఏరోబిక్స్ చేసిన మహిళల కంటే తక్కువ ఆస్టియోపొరాసిస్ తో ఉన్నారని తేలింది.కొలస్ట్రాల్  బి.పి  లు తగ్గుతాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు చెప్పారు.
            ఒక మనిషి కి  సగటున మూడు సిలెండర్ ల ఆక్సిజెన్ అవసరమవుతుంది.గాలి ఉచితం కాబట్టి మనం ఎప్పుడూ దాని గురించి ఆలోచించము.కృష్ణారావు గారు దాని విలువను తెలియజేసారు
   50 సంవత్సరాలు బ్రతికే ఒక చెట్టు 
      రూ.5.3 లక్షల విలువజేసే ఆక్సిజెన్ విడుదల చేస్తుంది.
      రూ.6.4 లక్షల విలువచేసే భూసారాన్ని పరిరక్షిస్తుంది.
     రూ.6.4 లక్షల  విలువచేసే భూమికోతను నివారిస్తుంది.
     రూ.5.3 లక్షల విలువచేసే  ఇతర జీవజాలానికి ఆశ్రయమిస్తుంది..
     రూ.10.5 లక్షల విలువ చేసే వాయు కాలుష్యాన్ని నిరోధిస్తుంది.
   మొత్తం విలువ 33.9 లక్షలు !
      చెట్లు ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తగ్గించటమే గాక  శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు  మొక్కలను పెంచాడానికి ప్రాధాన్య మివ్వాలి.ప్రత్యేక సందర్భాలలో మొక్కల్ని బహుమతిగా ఇవ్వమని సూచించారు.విలువైన సూచనను ఆచరించటం లో అందరం బాగస్వాములం అవుదామా!