Sunday, June 28, 2015

జానపదజానపద గేయం

జానపద గేయం

     ఎంతో సౌఖ్యము గల ఈ రాజయోగము ఏమని వర్ణింతునే  రామయ్య
     పంతముతో గుణవంతుల విని యానంత సుఖం బైతినే        "
     కన్నూల లోపల ఘనమైన చిత్కాళ లున్న జాడ గంటినే  "
     వెన్నెల మీదట వేదళకంజము వెలుగు దీప్తిని గంటినే         "


     పారావారము లేక పరిపూర్ణమై వెలుగు బ్రహ్మానందంబైతినే  "
    ఆరీటి మీరి ఆరీటి మీదట ఆత్మ నేనై యుంటినే.                                      "

    అంగము మీదట గంగ యమునల సందు లింగ మర్మము గంటినే.    "
   సదమలమై వెలుగు సచ్చిదానందము సాజయోగంబైతినే.          "
 
   కరుణతో గురుడు  నా శిరమందు కరమిడి ఎరుక ఏర్పడ జేసెనే.    "
   వేదాంతార్ధములోనె బోధ తెలిపెడి దండి సాధు సంగతి గంటినే "

   హరెరామ నేను మీ స్మరణ జేసుట వలన పరమభక్తుడనైతినే. "
   వర వైరాగ్యము చాత స్థిరబుధ్ధి సాక్షినై పరమ ధన్యుడ నైతినే "

   దరిజేరితే నేను ధన్యుడనైతిని నిరతము నను గావుమీ.                                "
    ంఅదికి నూర్ధ్వంబైన మంథెన్న నిలయా మీ మహిమ లేమన నందునే.   "
              
          ఈఇ గేయం కరీమ్నగర్ జిల్లాలోని  తాళ పత్రాలలో లభ్య మైనట్లుగా శ్రీ బిరుదురాజు రామరాజు గారు తెలిపారు.
     


     
      
      

Saturday, June 27, 2015

కవిచౌడప్ప



                తెలుగు సాహిత్యం లో శతక వాఙ్మయానికి  ప్రత్యేక స్థానం ఉంది.వేమన,సుమతీ శతకాల సరసన చేర్చదగిన మరో శతకం'కవి చౌడప్ప శతకం".
              ఈ శతక కర్త కుందవరపు చౌడప్ప.ఇతడు రఘునాధ రాయల సమకాలికుడు."అన్నిట మంచి వారు,విమలాత్ములు,హాస్య కళా ధురంధరుల్........." అన్న చాటు పద్యాన్ని బట్టి మట్ల అనంత భూపాలుని  ఆస్థానములో ఉన్నట్లు తెలుస్తోంది."హాస్య కవి జాణ",గాన విద్యా ప్రవీణుడు"అన్న బిరుదులను పొందాడు.తిట్టు కవి గా,బూతు కవిగా ప్రసిధ్ధి చెందాడు.కాని ఆనాటి  పరిస్థితుల పట్ల తన అసంతృప్తిని పరుష భాషలో నిర్భయంగా చెప్పిన ధీమంతుడు.కందం చెప్పడంలో తిక్కన అంతటి వాడనని చెప్పుకున్నాడు.
     "ముందుగ  చను దినములలో -కందమునకు సోమయాజి ఘనుడందురు నే
      డందరు నను ఘనుడందురు-కందమునకు కుందవరపు కవి చౌడప్పా!"
      వేమన వలెనే సంఘ దురాచారాలను తూర్పారబట్టాడు.ఏది చెప్పినా బలంగా,సూటిగా గుండెలకు తగిలేట్టు చెప్పగలడు.
   "తినజాలకయే ధర్మము-గనజాలక పరమలోభి కష్టుడు గూర్చెన్
    ధనమెల్ల నేలపాలని,గనుమప్పా కుందవరపు ......"
          మచ్చుకి ఇది ఒకటి.తిట్టు పద్యాలలో 'గాడిదాపద్యం ప్రసిధ్ధమైనది.
   "ఆడిన మాటలు తప్పిన-'గాడిద కొడూకంచు తిట్టగా విని ,మదిలో
    'వీడా నా కొడూకని ఏడ్చును-గాడిదయును కుందవరపు........"
 ఆధ్యాత్మక మైన పద్యాలు కూడా శతకం లో కనిపిస్తాయి.
   "అలసటవేసట నయినం...........గరుడధ్వజునిన్ దలచిన వారి చేరవు"
   "అతిధుల బంధు జనంబుల..........పూజించిన నరుడు సద్గతి నొదున్"
 ఇవి ఉదాహరణలుగా చెప్పవచ్చు.'పసాపద్యాల గురించి తెలుసుకోకపోతే ఇది అసమగ్రమే అవుతుంది.
   "పప్పే పస బాపలకును,-ఉప్పే పస రుచుల కెల్ల,ఉవిదల కెల్లన్
    కొప్పే పస ,దంతములకు-కప్పే పస..........."
   "మీసము పస్త మొగ మూతికి..........."
  కవి 'పసా అంతా ఈ పద్యాల వలన తెలుస్తుంది.అలాగే దేనికి ఏది పదిలమో చెప్పే చక్కటి  చాటువు ఒకటి
    "ఇంటికి పదిలము బీగము -వింటికి పదిలంబు నారి,వివరింపంగా
     చంటికి పదిలము రవికెయు -కంటికి పదిలంబు రెప్ప..........."
           భారవి,నాచన సోముడు,మాఘుడు,శ్రీ నాధుడు,పెధ్ధన,తిక్కన వంటి  పూర్వ కవుల పట్ల అభిమానాన్ని ప్రకటించుకున్నాడు.ఏవో కొన్ని పద్Yఆలు శృంగార పద్యాలు ఉన్నంత మాత్రాన బూతు కవి గా ప్రచారం చేయడం సమంజసమేనా? దేనిలోనైనా మంచిని తీసుకొని చెడుని వదిలేయడం వివేకవంతుల లక్షణం.

Friday, June 26, 2015

శునకోపాఖ్యానము


           రాత్రి పది అయ్యింది.టి.వి చూస్తూ కూర్చున్నాను.ఎదురింటివారి కుక్క గోలగోలగా అరుస్తోంది.రోడ్డుమీద ఎవరన్నా వెళుతున్నా అది అలాగే అరుస్తుంది.విశ్వాసం గల జంతువు కదా!
          రాము మా ఇంట్లో పనివాడు.'కుక్కలా విశ్వాసం గా'ఉంటాడు.అంతకు ముందు పనిచేసిన రాములమ్మకు ఎంతో ఆర్ధిక సహాయం చేసినా పని మానేసింది.ఒక ముద్ద అన్నం పెడితే మన చుట్టూ తిరుగుతుంది కుక్క.అందుకే 'కుక్కకు విశ్వాసం ఉంటుంది కాని మనిషికి ఉండదు.'పక్కింటి వారు వాచ్ మాన్ ను పెట్టుకున్నారు. వాడు 'కుక్కలా కాపలా కాస్తాడూ.
       మా ఆఫీసులో రామారావు వాళ్ళ అబ్బాయి కాలేజీ సీటుకి సహాయం చేయమని అడిగాడు.అంతకు ముందు నాకు చేయల్ లేదు 'కుక్క కాటుకి చెంప దెబ్బలా' నో అని చెప్పేశాను.సుమతీ శతక కారుడు కూడా 'కనకపు సిమ్హాసనమున శునకము కూర్చుండ బెట్టిన  వెనుకటి గుణం మారదాని చెప్పాడు.
        పక్కింటి పంకజం  గోడ మీదగా మా దొడ్లోని మందార పూలు  కోస్తూ కొమ్మలన్నీ విరిచేస్తోంది.తిరిగొచ్చి కోసుకోమని ఎన్నిసార్లు చెప్పిన 'కుక్క తోక వంకరాలా ఆమె గుణం మారదు.'కుక్క తోక పట్టుకొని గోదావరి ఈది నట్లు 'స్నేహితుడిని నమ్మి వ్యాపారం లో వాటా పెట్టినందుకు నట్టేట్లో ముంచేశాడు.
        మా బావమరిది కొడుకు ఉన్నత చదువులు చదివాడు కానీదాలి గుంట్లో కుక్క చందమునావివేకము శూన్యము.మా వీధిలో సుబ్బారావు ఎప్పుడూ ఎవరో ఒకరిని తిడుతూ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు.ఎవరన్నా గట్టిగా సమాధానం చెబితే 'మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదాన్నట్లు ఇంట్లో కెళ్ళి బయటకు రాడు.రాజా రావు  రాజా(కుక్క)కు పుట్టినరోజు వేడుకలు ఘనం గా చేస్తున్నాడు.అది చూసి చద్ది అన్నం తప్ప ఎరుగని పనివాడు 'పేదవాడింట్లో పుట్టడం కన్నా ఉన్న వాడింట్లో కుక్కగా పుట్టాలానుకున్నాడు.
        దొంగ బీరువాలు వెతికినట్లు 'కుక్క ఇల్లు జొచ్చి కుండలూ వెతుకుతుంది.సుబ్బారావింట్లో రాము జామ కాయలు దొంగతనం చేసాడనీకుక్కను కొట్టినట్లు 'కొట్టాడు.అల్ప బుధ్ధి కలవారికి అధికారమిస్తే 'చెప్పు తినెడి కుక్కకు చెఱ్కు తీపి తెలియనట్లు ' విలువ తెలియదు కదా!అనసూయమ్మ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందీకుక్క వంటి ఆశ 'కూర్చోనీయదు మరి.'కక్కిన కుక్క దగ్గరకు ,కన్న కుక్క దగ్గరకు పగవారిని కూడా పంప వద్దని నీతి.'కుక్క యేమెరుగు గురు లింగ జంగంబూ.అంటారు.
          నేరస్థులను పట్టుకోవడం లో పోలీసులకి మార్గదర్శి.మాయలఫకీరు బలా నాగమ్మ ను కుక్క గా మార్చే కిడ్నాప్ చేశాడు.దేవదాసుకి తోడు కూడా శునకమే!
          "గ్రామ సిమ్హం "గా ప్రసిధ్ధి చెందినా,కాలభైరవుడిగా పూజ లందుకున్నా శునకం మనుషుల కన్నా విశ్వాసము కలది.విదేశాలలో ఒకొక్కరూ 3,4 కుక్కల్ని కూడా పెంచుతుంది కుంటారు.తమ ఆస్తులు మొత్తం కుక్కలకు వ్రాసిన ఘనులు కూడా ఉన్నారు.కుక్క మన జీవితాలలో ఏదో ఒక సంధర్బం గా గుర్తు చేసు కుంటూనే ఉంటాము.
          "కుక్క  ఉన్నది  జాగ్రత్త!"
       *************్********్*********్**********్***********్********్************్********

Wednesday, June 24, 2015

ఫ్రాణాంతకసరదాలు



     నిన్న వార్తలలో ఒక బి టెక్ విద్యార్ధి సెల్ఫీ తీసుకోటానికి  రైలు ఇంజను ఎక్కి హైటెన్షన్ వైర్లు తగిలి ప్రాణాపాయస్థితిలో హాస్పటల్ లో ఉన్నాడని చూసాను.అతని తల్లిదండ్రులు ఎంత బాధ పడుతూ ఉండి ఉంటారో కదా అనిపించింది.పిల్లల ఇలాంటి సరదాలు గర్భశోకాన్ని కలిగిస్తున్నాయి.ఈ మధ్య తరుచు ఇలాంటి వార్తలు వింటున్నాము.
      కాలవలలోకి ఈతకు వెళ్ళడం లోటు తెలియకుండా అందులో దిగటం ,స్నేహితులు దిగుతున్నారు కదా అని ఈత రాకపోయినా దిగి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం.బైక్ రేస్ లు అయితే సరేసరి .ఉన్న ఒక్క పిల్లాడి సరదా కోసం విలాసవంతమైన బైక్ లు కొనడం వాటిపై విన్యాసాలు చేస్తూనో రేసులలో పాల్గొంటూనో అదుపు తప్పి ప్రాణాలు కోల్పోతున్నారు.కోట స్రీనివాస రావు కొడుకు అలాగేగా ప్రాణాలు కోల్పోయింది.దాదాపుగా వీరంతా విద్యార్ధులే.ఉజ్జ్వల భవిష్యత్తు ఉండి ఎన్నో శిఖరాలు  ఎక్కాల్సిన వీరంతా అర్ధాంతరం గా అసివులు బాస్తున్నారు.ఆశలన్నీ వీరిపై పెట్టుకు బ్రతుకుతన్న కన్నవారి హృదయాలలో కార్చిచ్చు రగిలిస్తున్నారు.పాఠశాలకు వెల్తున్న5,6సంవత్సరాల వారి నుండి 25 వరకు ఉంటున్నారు.
           పిల్లలు ఎక్కడకు వెళుతున్నారో ,ఏమిచేస్తున్నారో తల్లితండ్రులు గమనించాలి.   సరదాలు ప్రాణాలు తీసేవి కాకుండా ఉండాలని చెప్పాలి.ఈ వయసులో సరదాలు సహజమే కాని ప్రాణాలు అంత ఖన్నా ముఖ్యమైనవి కదా!నిత్యం ప్రమాదాల వార్తలు వింటూ కూడా సరదాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకొని ఆశలన్నీ మీ మీద పెట్టుకొని బ్రతుకుతున్న కన్న వారికి  జీవితాంతం దూఃఖాన్ని మిగల్చడం న్యాయం కాదు కదా!
    పిల్లలూ ఒక్కసారి  ఆలోచించండి!

Tuesday, June 23, 2015

దశావతారాలపాట


  
   మరు జనక  మమ్మేలు మత్స్యావతార
   గురుతుగా కృపజూడు  కూర్మావతార
   వరుదుడవు కావయ్య  వరహావతార
   సిరులు కరుణించు నరసిమ్హావతార
   వక్షమున సిరి గల్గు వామనావతార
   రక్షించు మము  పరశురామావతార
   రాక్ష సాంతక రఘురామావతార
   పక్షి వాహన బలభద్రావతార
   బ్రోవనేర్చిన యట్టి  బుధావతార
   కావవే మము వేడ్క కలికావతాఋఅ
   భాషాపతి స్తోత్ర భాను ప్రకాశా
   శేషాచలా ధీశ శ్రీ వెంకటేశా!

Monday, June 22, 2015

taaru maaru


 
      రామా రావు ,సావిత్రమ్మలు భార్యాభర్తలు.వారి కుమార్తె యామినీ పూర్ణ తిలక.వారిధ్ధరూ మార్పు కోసమని రామా రావుని అమ్మ అని,సావిత్రిని నాన్నా అని  కూతురితో పిలిపించుకుంటారు.ఒకరోజు రామా రావు స్నేహితుడు సూర్యా రావు వాళ్ళింటికి వచ్చి అరుగు మీద ఆడుకుంటున్న యామినిని మీ నాన్న ఏమి చేస్తున్నాడు అని అడుగుతాడు.పెరట్లో అంటు గిన్నెలు తోముతున్నాడు.మీ అమ్మ అంటే ఆఫీసుకి  వెళ్ళింది అని చెబుతుంది. అతడు ఆశ్చర్య పోతాడు.తరువాత రామా రావు ని కలిసినప్పుడు మీ అమ్మాయి ఇలా చెప్పిందేమిటని అడిగితే మే మే సరదాగా అలా పిలిపించుకుంటున్నాము అంటాడు.లోక విరుధ్ధం గా అలా పిలిపించుకుంటే అనేక అనర్ధాలొస్తాయని మందలిస్తాడు.
           ఇది నేను చిన్నప్పుడు "మిఠాయి పొట్లం"అనే కధల పుస్ తకఒ లో చదివాను.మరొక కధా కాకి కర్రల ఇల్లు,పిచ్చుక పిడకల ఇల్లు కట్టుకున్నాయి.గాలికి కాకి ఇల్లు,వరదలకి పుచ్చు క ఇల్లు కూలిపోతే ఒక దానికి  ఒకటి సహాయం చేసుకున్నాయీ.
        ఇలాంటి కధలు ఆ పుస్తకం లో చాలా ఉన్నాయి.ఇవి నేను చిన్నప్పుడు ఎప్పుడొ చదువుకున్న కధలు.ఇప్పటికీ గుర్తున్నాయి.ఇవేకాక సెలవులలో వేమన, సుమతి,దాశరధీ శతక పద్యాలు కంఠతా పట్టించేవారు మా నాన్నగారు.తెలుగు భాష పట్ల అభిరుచి,ఆసక్తి కలిగాయంటే ఆయన పుణ్యమే.
       ఇప్పటి పిల్లలకి అలాంటి అవకాశ మెక్కడిది?చోటా బీం,పోగో,కార్టూన్ చానల్స్ లేదంటే కంప్యూటర్ గేంస్ వీటితో కాలక్షేపం చేసే పిల్లలికి పుస్తకాలు చదివే తీరికా,ఓపికా ఎక్కడిది?కాని నైతిక విలవల్ని బోధించే పుస్తకాలు చిన్నప్పటి నుంచీ చదివి నట్లైతే చక్కటి వ్యక్తిత్వముతో పెరుగుతారు.తెల్ల కాగితం లాంటి పసి మనసులలో చెరగని ముద్ర వేస్తాయి.ఇది నేడు అత్యంత అవశ్యము.

Saturday, June 20, 2015

దాంపత్యం


          భారతీయు సంప్రదాయం లో చతుర్వేధాశ్రమాలు ఉండేవి.బ్రహ్మచర్య,గార్హస్థ్య,వానప్రస్థ,సన్యాసములు.చతుర్విధ పురుషార్ధాలను పొందడానికి మెరుగైనది గృహస్థాశ్రమమే.దీనికి ములమై వివాహం.దీని యొక్క ఫలితం దాంపత్యం.చ్తుర్విధాశ్రమాలను దేశ,కాల,పాత్ర పరిస్థుతులకు అనుగుణం గా పాటించాలి.కాని దాంపత్యం ఏ కాలమందైనా ఒకటే.
        స్వర్గం కాని,నరకం గాని సంసారం లోనే ఉంటాయి.గార్హస్థ్య ధర్మాన్ని చక్కగా పాటిస్తూ మోక్ష సోపానంగా మార్చుకోవాలి.దానికి కొంత వివేకం కావాలి.విశ్వ నిర్మాణానికి ములమై దాంపత్య భావం."దమతి ఈత్ దంపతి".ఆలుమగలు కలసిమెలసి సాగించే జీవనమే దాంపత్యం.మదమాత్సర్యాలకు రావు లేక దైవ భావనతో దాంపత్య జీవనం గడపాలి.నిజమైన దంపతుల దాంపత్యం గురించి కాళిదాసు మేఘ సందేశం లో
  "స్నేహానాహూః కిమపి విరహేధ్వంసినః తేత్వ భోగా
    దిష్టే వస్తు న్యుపచి చరసాః ప్రేమరాశీ భవంతి"
  స్నేహితులు దూరమైతే ఆ స్నేహం నశిస్తుంది.కాని దంపతులు విషయం లో ఆ స్నేహం ఆ ప్రేమ రోజు రోజుకీ పెరిగి ప్రేమరాశిగా మారుతుంది.
 వివాహం ఎనిమిది రకాలుగా ఉన్నాయి
1.బ్రహ్మం: ఆచార వంతుడైన బ్రహ్మచారిని రప్పించి కన్యను ఇవ్వడం.
2.దైవం: ఋత్విజునికి కన్య నివ్వడం.
 3.ఆర్షం:ధేనుద్వయాన్ని కాని,బలీవర్ధద్వయాన్ని కానీ వరుని దగ్గరి నుండి తీసుకొని కన్యనివ్వడం.
 4.ప్రాజాపత్యం:తల్లిదండ్రులు వరుని పూజించాలి,కన్యనివ్వడం.
 5.అసురం:కోరిన ధనాన్నిచ్చి ,వారి ఇష్టం తో పెళ్ళి చేసుకోవడం.
 6.గాంధర్వం:స్త్రీ పురుషులు పరస్పరాకర్షితులై కలవడం.
 7.రాక్షసం:కన్యక బంధువులను చంపి కన్యను బలవంతంగా తెచ్చుకొవడం.
 8.పైశాచం:ఏమరుపాటున ఉన్న స్త్రీని బలాత్కరించడం.
          స్వయం వరం కూడా ఉండేది.గాంధర్వ రాక్షసాలు శాస్త్ర సమ్మతాలే కాని క్షేమదాయకం కాదని వ్యాసుని ఉపదేశం.ప్రస్తుతం నాలుగో వివాహం విధానం అమలులో ఉన్నది.పవిత్రమైన ,అన్యోన్యమైన దాంపత్యమే వివాహానికి ప్రయోజనం.భార్యా భర్త లిరువురూ ఎవరి ధర్మాన్ని వారు సక్రమముగా నిర్వర్తించాలి.ఒకరియందు ఒకరికి ప్రేమ,విశ్వాసం ఉండాలి.భార్యా భర్తల అన్యోన్యతను గురించి వాల్మీకం లో శ్రీరాముడు "సూర్యునికి వెలుగులా భార్య- భర్తకు అనన్య(వేరు కానిది) అన్నాడు.
  "కాలేనా వరణాత్య యాత్ పరిణతేయత్ స్నేహ సారేస్థితం
     భధ్రంత స్వ సుమానుషస్య కధమప్యేకం హితత్ ప్రార్ధ్యతే"
              పెండ్లి మొదలు మరణం వరకు చెరిగిపోనిది ,మోహరహితమైనది,సుఖదుఃఖాలలో,సమానంగా ఉండేది,ఒకరినొకరికి హృదయ శాంతి నివ్వగలిగేది,వయసుమళ్ళినా తరగని అభిమానం కలది,శుభకరమైనది,బాహ్యం కన్న అంతర్గత ప్రాధాన్యతను కలిగి ఉన్నది ఉత్తమ దాంపత్యం.దంపతులైన స్త్రీ పురుషులు ఎలాంటి అరమరికలూ లేకుండా ఒకరినొకరు పట్ల ఒకరు ఆత్మీయంగా,అన్యోన్యం గా జీవించి నప్పుడే కలకాలం నిలబడుతుంది.
            సహనం,అసహనం,సౌమ్యాం,క్రౌర్యం,అనిష్టత,అననుకూలత,వ్యామోహం,సామాన్యం,అసమాన్యం,ఆదర్సం--అన్ని రకాల దాంపత్యాలు పూర్వ కాలమూ ఉండేవి.కాని వారు సంఘ కట్టుబాటుకి వెరచో ,ఆర్ధిక స్వాతంత్ర్యం లేకో కుటుంబానికి కట్టుబడి ఉండేవారు.
     మధ్యకాలం లో ఆర్ధిక స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ సర్దుకు పోదామనో,ఒంటరి పోరాటం చేయలేకనో వివాహ ధర్మానికి కట్టుబడేవారు.
       ఆధునిక కాలం లో చిన్న కారణాలకే వివాహబంధాన్ని విచ్చిన్నం చేసుకొని విడాకులకు వెళ్ళిపోతున్నారు.మితిమీరిన స్వేచ్చ,ఆర్ధిక స్వాతంత్ర్యం,విలువల పట్ల నిర్లక్ష్యం ఈ పరిస్థితికి కారణం కావచ్చు.ఈ పరిణామం ఎక్కడకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే.

Wednesday, June 17, 2015

చిట్టితల్లి


     చిట్టి తల్లి పుట్టింది
     చిరునవ్వు పంచి ది
     అమ్మ,నాన్నలను
     ఆనంద హేల ముంచింది
     పాల బుగ్గల పాలవెల్లి
    పసిడి వన్నె చాయ
    అమ్మ ఒడిలో 
    ఉయ్యాల లూగింది
    నాన్న చేతిలో 
    సయ్యాట లాడింది
    మురిపాల ముధ్ధుగుమ్మ
    మరకత మాణిక్యాల  మిన్న
    చిరు పాదాల సిరి మువ్వలు
    ఎదలో ఆనందపు జల్లులు
    చిన్ని యా బొజ్జకు
    పాల బువ్వయే పాయసాన్నము
    పాపాయి నవ్వులే నవరత్నాలు
     ఆ ఊ పలుకులే పంచభక్ష్యాలు
    మాయింటి 
    మహారాణి నీవే నమ్మా!
 

Tuesday, June 16, 2015

పద్యవైచిత్రి

పద్య వైచిత్రి
       రామరాజ భూషణుడు రచించిన "వసు చరిత్ర" కల్పనా చాతుర్యానికి ప్రసిధ్ధి చెందిన కావ్యము.ఆ కొవలోనే "పిల్ల వసుచరిత్ర" గా పిలువబదిన "విజయ విలాసము" చేమకూర వేంకటకవి విరల్ హితము.కల్పనా చాతుర్యము,వర్ణనలు,అనేక ఒడుపులను ప్రయోగించినాడు.తెలుగు పదములను కూర్చియు,విరిచియు సలలితముగా రచన గావించినాడు. విజయ విలాసములోని ఒక పద్య విశేషాన్ని చూధ్ధాము.
  
  "తనకున్ కౌగిలి ఈ ఒకప్పుడును నాధా!నీ కరస్పర్సనం
   బున గిల్గింతలె"యంచు పద్మిని కరాంభోజమ్మునన్ మందమం
   ద నటద్వాయుచల ధ్ధళాంగుళులు కంపట్టంగ న వ్వెల్గురా
   యని రా!రా! యని పిల్చె నా దగె ద్విరేఫాద్యంత దీర్ఘ ధ్వనుల్.
                 తామర తీగ,తన ప్రియుడైన సూర్యుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదని కేవలం కిరణాలతో తాకి గిలిగింతలు పెడుతున్నాడని చెప్పి , పిల్లగాలి వీస్తున్నప్పుడు కదులుతున్న తామర రేకులనే వేళ్ళతో కూడిన,పద్యం వంటి చేతిని కదిలిస్తూ తుమ్మెదల పొడవైన ధ్వనులతో సూర్యుణ్ణి రా,రా అని పిలుస్తున్నదా అన్నట్లు ఉంది.--అని భావము
           ద్విరేఫమనగా తుమ్మెద.రెండూరా కారములు ఆద్యంత దీర్ఘ ధ్వనులు - అనగారెండు రకారములకు దీర్ఘములు--అనగా రా,రా.తామర పువ్వులలో సూర్యోదయము కాగానేతుమ్మెదలు ధ్వని చేయును.ఆ తుమ్మెదల ధ్వని టమర పూవన్న స్త్రీ సూర్యుని రా,రా యని పిలిచినట్లున్నది.ఇది ఇందులోని విశేషము.
         తెలుగు సాహిత్య నిక్షేపాలలో ఇలాంటి అనర్ఘ రత్నాలెన్నో! వాటిని  తవ్వి తీసి సొంతం చేసుకొనే సత్తా మనకుండాలి గాని!

Monday, June 15, 2015

చదువులు


          చదువని వాడజ్ఞుం డగు
          చదివిన సద సద్వివేక చతురత కలుగున్---అన్నారు పోతన
     చదువు వలన జ్ఞానం లభిస్తుంది.ఇది రెండు రకాలు.పుస్తక జ్ఞానము,అనుభవ జ్ఞానము.పుస్తకాల వల్ల వచ్చేది పుస్తక జ్ఞానము.దీని వలన డిగ్రీలు వస్తాయి.వాడు బాగా చదువు కున్నాడురా. చాలా తెలివి కలవాడు అంటూ ఉంటారు.కానీ చదువుకీ తెలివితేటలకు,ప్రవర్తనకు సంబంధమే లేదు.చదువుకొని ఉన్నత ఉద్యోగాలు,పదవులలో ఉండి కూడా సంస్కార హీనంగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాము.ఇలాంటి వారిని చూసే  "చదివినోడి కనా చాకలాడే మేలు "-అనే సామెత వచ్చి ఉంటుంది.
          ఎవరితో ఎలా నడుచుకోవాలో,ఎలా మాట్లాడాలో నేర్పడానికి ఏ విశ్వవిద్యాలయం లేదు.లౌకిక జ్ఞానమనేది  కుటుంబ సభ్యులు,స్నేహితులు,పరిసరాలు,సమాజం నుండి నేర్చుకుంటాము."ఎప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడటమే "-విజ్ఞత.జీవితానుభవాలను మించిన పాఠాలు లేవు.జీవితాంతము నేర్చుకుంటూనే ఉంటాము.పోతన కూడా చదువు వల్ల సత్,అసత్ వివేకము కలుగుతుంది  అని చెప్పాడు.
   "ఏమి చదివి పక్షులు పైకెగుర గల్గెను
     ఏ చదువు వల్ల చేప పిల్లలీద గల్గెనూ
     చదువులతో పనియేమి హృదయమున్న చాలు
    కాగితం పూల ఖన్న గరిక పూలు మేలు"--
        ఎంత చదువుకున్నా వివేకము,యుక్తాయుక్త విచక్షణ లేనప్పుడు అది  వాసన లేని కాగితం పూల లాగా నిరర్ధకమే కదా!రాంకుల వేట ,పతకాల పోరులో  ఒక విదుర నీతి,సుమతి,వేమన శతకాలలోని విలువలు నీతులు ఎంత మంది కి తెలుసు.వాటిని తెలియచెప్పాల్సిన తల్లిదండ్రులు,గురువు లకు ఓపిక,తీరిక ఎక్కడిది?"అన్నమయ్య అంటే నాగార్జున అని,చత్రపతి  ప్రభాస్ అనే విధంగా గానే ఉంటాయి వారి సమాధానాలు.
         బ్రతుకు తెరువుకి చదువుకొని డిగ్రీలు పొందాలి.ఉన్నత జీవన నడవడికి జీవిత పాఠాలనూ నేర్చుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలి.ఉన్నత విద్యనభ్యసించి వ్యసనాల పాలై దొగలుగా,చెయిన్ స్నాచర్స్ గా మారి కుటుంబానికి,సమాజానికి యువత రాచ పుండుగా మారకుండా విలువలతో కూడిన చదువులు చదవాలని నా అభిలాష.

Tuesday, June 9, 2015

అనుబంధాలు:--

అనుబంధాలు:-
     "అనుబంధం,ఆత్మీయత అంతా ఒక బూటకం
      మనుషులు ఆడుకొనే వింత నాటకం"---అన్నాడు ఒక మహా కవి.
            నిజమే!
      ఆత్మీయత లేని బంధం  మరీ బూటకం.
   మొన్నీ మధ్య ఒక మిత్రురాలి భర్త చనిపోతే పలకరిధ్ధామని వెళ్ళాను.ఇధ్ధరూ  పెధ్ధ వయసు వారే.ఆమెకు 83,ఆయనకు 92 ఉంటాయి.అదే సమయం లో వారికి తెలిసినాయన వచ్చారు.ఆయన ఆమెను " మీరు ఒంటరిగా  భావిస్తున్నారా?"అని అడిగారు.దానికి ఆమె "ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన ఒంటరి తనం కాదు.ముందు నుంచీ ఉన్నదే"అని నిర్లిప్తంగా సమాధానం ఇచ్చింది.ఆయన ఆస్చర్యం గా చూశారు. ముందు నుంచీ ఆమె గురించి తెలిసిన నేను ఆస్చర్య పోలేదు.
         ఆమె పేరు జానకి.11సంవత్సరాలకే పెళ్ళైంది.కొద్ది రోజులకే ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు.అక్కడ నుంచి వచ్చి వెళ్ళె సందర్భంగా జరిగిన సంఘటన గుర్తుగా ఒక బిడ్డ కలిగాడు.ఈ సారివెళ్ళినవాడు మరల రాలేదు.కుటుంబానికి పెద్ద కొడుకు అవడం తో కొడుకు భవిష్యత్తే కాక అత్తింటి వారి బాధ్యత కూడ ఆమెపై పడింది.కాలక్షేపానికి చదువుకున్న హింధీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం తెచిపెట్టింది.పిల్లడి చదువు,కుటుంబ బాధ్యతలు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వచ్చింది.ఆ మహానుభావుడు ఉత్తరాలు వాళ్ళ నాన్న కు  వ్రాసేవాడు. అందులో ఒక ముక్క కూడా భార్యా పిల్లల గురించి ఉండేది కాదు.
       కొడుకు పెళ్ళైంది,ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు.ఉద్యోగమే తోడుగా కొన్నాళ్ళు గడిపింది.ఆమెకు రిటైర్మెంట్ వయస్సు వచ్చింది.ఈలోపు ఆయనకు వయసు వచ్చి,సోదరుల ప్రోద్బలంతోను ఆమె దగ్గర కు చేరాడు.ఆయనకు డిగ్రీలు లేవు కాని తెలుగు,సంస్కృతం,హింధీ వచ్చు.వేదాభ్యసనం కూడా చేసాడు.ఆశ్రమంలో నేర్చుకున్న ఆయుర్వేద విద్య పైన పుస్తకాలపైన వ్యాసాలు  వ్రాస్తూ కాలక్షేపం చేసేవాడు. ఆయన వచ్చినా ఆమె బాధ్యత తీరలేదు కాని పెరిగింది.అన్నీ ఆవిడే చూసుకోవలసి వచ్చేది.మంచీ చెడూ మాట్లాడుకోవడం కాని ,కబుర్లు చెప్పడం కాని ఉండేది కాదు.ఇద్దరు అపరిచితులు కర్మ వశాత్తు ఒక ఇంట్లో ఉన్నట్లు ఉండేది.అలాంటప్పుడు ఆమె మనస్సులో భర్త అన్న భావం కాని,ఆత్మీయత కాని ఎలా కలుగుతుంది. అలా కాక ఎలా మాట్లాడుతుంది.
                ఏ బంద్దమైనా మనసుకు దగ్గరగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేని లోటును అనుభవిస్తాము.భార్య అయినా ,భర్త అయినా,బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా మనకు వారు మానసికంగా ఎంత దగ్గరైనారు అనే దాన్ని బట్టి మనం బాధపడటం,లోటును భావించడం ఉంటుంది.బరువులు, బాధ్యతలు పంచుకోకపోయినా మానసికం గా తోడు అయినప్పుడు ఆళోటు పూడ్చుకోలేనిది.జీవితకాలం మానసికంగా,బాధ్యతల బరువులోను ఒంటరితనం అనుభవించిన ఆమె అలాకాక ఇంకెలా స్పందిన్స్తుంది అనిపించింది.