Wednesday, December 31, 2014

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు
     "  నూతన  సంవత్సరములో  అందరికీ శుభాలు  జరగాలని ఆకాంక్షిస్తున్నాను."

Monday, December 29, 2014

సజ్జలడ్డు:-

సజ్జ లడ్డు:-
     సజ్జలు---------------------1/4కెజి
     బెల్లం--------------------1/4కెజి
     ఎండు కొబ్బరి----------1/2చిప్ప
    నెయ్యి----------------------150గ్రాములు
    గస గసాలు------------1/2కప్పు

               సజ్జలు మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.గసగసాలు కూడా పొడిచేసుకోవాలి.కొబ్బరి కోరుకోవాలి.సజ్జ పిండిని  బాణిలిలో నెయ్యి వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. తరువాత ఒక గిన్నెలో  బెల్లం 3/4 కప్పు నీళ్ళు పోసి తీగ పాకం వచ్చే దాకా ఉడికించుకొని  అందులో వేయించి పెట్టుకొన్న సజ్జ పిండి,గసగసాల పొడి,కొబ్బరి  కోరు వేసుకొని ఉండలు కట్ట కుండా బాగా కలియ తిప్పుకొని దించుకోవాలి.చల్లారాక లడ్డూలు చుట్టుకోవాలి.జీడి పప్పు పలుకులను కూడా చేర్చు కుంటే మరింత రుచిగా ఉంటాయి.

Tuesday, December 23, 2014

జొన్న రవ్వ ఉప్మ:--



    జొన్న రవ్వ-----------------1కప్పు
    పెసర పప్పు---------------1/2కప్పు
    నూనె-------------------------4స్పూన్లు
    నీళ్ళు--------------------------3కప్పులు
    పచ్చి మిరప--------------4
    అల్లం---------------------------చిన్న ముక్క
    కరివేపాకు-----------------2రెమ్మలు
    పోపుకి:--ఆవాలు,మినపపప్పు ,శనగపప్పు,వేరుశనగ గుళ్ళు
     ఉప్పు--రుచికి సరిపడ
               ముందుగా ష్టౌ మీద పెట్టి  నూనె వేసి కాగాక పోపు దినుసులు వేసి  చిట పట లాడాక ,అల్లం పచ్చి మిర్చి ముక్కలు వేగాక కరివేపాకు వేసి  పెసర పప్పు కూడా వేసి కొంచెం వేయించి మూడు  కప్పులు నీళ్ళు పోయ్యాలి.అవి  కాగాక  జొన్న రవ్వ పోస్తూ తిప్పాలి.రుచికి సరిపోను ఉప్పు వేసి సన్న సెగ  లో పది నిముషాలు  నిదానంగా మగ్గనివ్వాలి.బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ కంటే ఎక్కువ సమయం పడుతుంది. కాని వాటి కంటే రుచిగా ఉంటుంది.
     పెసర పప్పు బదులు  తోట కూర,పాల కూర ఏదైనా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.

Sunday, December 21, 2014

 17.  మహోగ్రః పూర్వతః పాతు మహా వీరాగ్ర జోగ్నితః|
        మహా విష్ణు ర్ధక్షిణేతు మహాజ్వాలస్తునైర్నతౌ||

 18. పస్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతో ముఖః|
       నృసిమ్హః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణ విఘ్రః||

 19. ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళ దాయకః|
       సంసార భయదః పాతు మృత్యోర్మృత్యుర్నృ కేశరీ||

 20. ఇదం నృసిమ్హ కవచం ప్రహ్లాద ముఖ మండితం|
       భక్తి మాన్యః పఠేన్నిత్యం సర్వ పాపైఅః ప్రముచ్యతే||

 21.పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే|
      యం యం కామయత్ కామం తం తం ప్రాప్నోత్య సంశయం||

 22. సరవత్ర జయమాప్నోతి సరవత్ర విజయీ భవేత్|
      భూమ్యంతరిక్ష దివ్యానాం గ్రహాణా వినినావరణం||

 23.వృశ్చికోరగ సంభూత విషాపహరణం పరం|
      బ్రహ్మ రాక్షస యక్షాణాం దూరోత్సారణ కారణం||

  24.భూర్జేవా తాళ పత్రేవాకవచం లిఖితం శుభం|
       కర మూలే ధృతం యేన సిధ్యేయూః కర్మ సిధ్ధయః||

  25.దేవాసుర మనుష్యేషు స్వంస్వమేవజయం లభేత్|
       ఏక సంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః||

   26.సర్వ మంగళ మాంగల్యం భుక్తిం ముక్థిం చ విందతి|
       ద్వా త్రింశతి సహస్రాణి పఠేచ్చుధ్ధాత్మనాం నృణాం||

   27.కవచస్యాస మంత్రస్ య మంత్ర సిధ్ధీః ప్రజాయతే|
       అనేన మంత్ర రాజేన కృత్వా భస్మాభి మస్త్రణం||

   28. తిలకం విన్య సేద్యస్తు టన్య గ్రహ భవ్యం హరేత్|
        త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమంత్ర్యచ||

   29.ప్రాశ యోద్యో నరోమంత్ర నృసిమ్హ ధ్యన మాచరేత్|
        తస్య రోగాః ప్రణశ్యంతి యే చన్యూఃకుక్షి సంభాః||

   30.కిమత్ర బహునోక్తేన నృసిమ్హస దృశో భవేత్|
       మనసా చితితం యత్తు సతచ్చాప్నోత్య సంశయం||

   31. గర్జంతం గర్జయంతం  నింజ భుజ పటలం స్ఫోటయంతం హటంతం|
         రూప్యంతం తాపయంతం దివి భువిదితిజం క్షేపయంతం క్షిపంతం||

   32. క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సమ్హర్తనం భర్తనం|
        వీక్షంతం ఘార్ణయంతం శరనికరశతై ర్ధివ్య సిమ్హం నమామి||

  

Saturday, December 20, 2014

శ్రీశ్రీ నరసిమ్హం కవచం:-

శ్రీ నరసిమ్హం కవచం:-
      1.నృసిమ్హ కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా |
         సర్వ రక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం||

      2.సర్వ సంపత్కరం చైవ స్వర్గమోక్ష ప్రదాయకం|
         ధ్వాత్వా నృసిమ్హం దేవేశం హేమసిమ్హాసనస్థితం||

      3. వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభం|
          లక్ష్మ్యా లింగితవామాంగం విభూతిభిరుపాశ్రితం||

      4.చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శొభితం|
         ఉరోజ శోభితో రస్కం రత్నకేయూర ముద్రితం||
     
      5.తప్త కాంచన సంకాశం పీట నిర్మలవాససం|
         ఇంద్రాది సురమౌళిస్థ స్ఫురన్మాణిక్య దీప్తిభీః||
   
     6.విరాజిత పద ద్వంద్వం శంఖచక్రాది హేతిభీః|
        గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితం||

     7.స్వహృత్కమల సంవాసం కృత్వాతు కవచం పఠేత్|
        నృసిమ్హో మే శిరః పాతు లోకరక్షాత్మ సంభవః||

     8.సర్వ గోపిస్తంభ వాసః పాల  మే రక్షతు ధ్వనిం|
        నృసిమ్హో మే దృశౌ పాతు సోసూర్యాగ్ని లోచనః||

      9.స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతి ప్రియః|
         నాసాం మే సిమ్హనాసస్తు ముఖం లక్ష్మీ ముఖప్రియః||

     10.సర్వ విధ్యాధిపః పాతు నృసిమ్హో రసనాం మమ||
          వక్త్రం పాత్విందు వదన స్సదా ప్రహ్లాదవందితః||

     11.నృసిమ్హః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్|
          దివ్యాస్త్ర శోభిత భుజో నృసిమ్హః పాతుమే భుజౌ||

    12.కరౌ మే దేవవరదో నృసిమ్హః పాతు సర్వతః|
         హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరీః||

    13.మద్యం పాతు హిరణ్యాక్ష వక్షః ఖుషిరొ విదారణః|
         నాభిం మే పాతు నృహరి స్స్వనాభిబ్ర్హ్మ సంస్తుతః||

    14.బ్ర్హ్మాండ కోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిం|
         గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్య రూపధృత్||

    15.ఊరు మనోభవః పాతు జానునీ నరరూప ధృక్|
         జంఘే పాతు ధరా భార హర్తాయో సౌనృ కేసరీ||

    16.సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః|
         సహస్ర శీర్షా పురుషః పాతు మే సర్వశస్తమం||
        
(  తక్కిన 16 శ్లొకాలు రేపు పోష్టు చేస్తాను ) 
   

Friday, December 19, 2014

పొట్లకాయపొడికూర


    పొట్ల కాయ.    --1
    కంది పప్పు   ---1/4 కప్పు
    నూనె.           ----2 స్పూన్లు
    ఉప్పు.       ------రుచికి సరిపోను
   కారం. --------11/2 స్పూన్లు

    మినపపప్పు,జీర,ఆవాలు-తిరగమోతకు
    వెల్లుల్లి-------4రెబ్బలు
    కరివేపాకు--2రెబ్బలు

             ముందుగా కందిపప్పు మరీ మెత్తగా కాకుండా పలుకులకు ఉడకబెట్టు కొని పక్కన పెట్టు కోవాలి.పొట్ల కాయ సన్నగా ముక్కలు తరుగుకొని  ఒక పొంగు రానిచ్చు కోవాలి.

ష్టొవ్ మీద బాణిలి పెట్టి  నూనె వేసి కాగినాక తిరగమోత దినుసులు వేసి చిట పట లాడాక కొంచెము చితగ కొట్టి వెల్లుల్లి రెబ్బలు  తరువాత కరివేపాకు వేసి  కాలినాక  పొట్లకాయ ముక్కలు మీరు పిండి వేయాలి.కొంచెం వేగాక ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి,సరిపోను ఉప్పు,కారం వేసుకొని రెండు నిముషాలు వేయించుకొని దించుకోవాలి.అంతే  పొట్లకాయ కందిపప్పు పొడికూర తినతానికి సిధ్ధం.

Thursday, December 18, 2014

6.పుదీనా:-
   గాస్,అజీర్తి,తిమ్మిర్లు,డ్యేరియాలను తగ్గిస్తుంది.కండరాలను పటిష్ట పరుస్తుంది.జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.రోజూ ఒక కప్పు పుదీనాటీ తాగినట్లైతే కాన్సర్ ని దూరం చేయవచ్చు.

2.రోజ్ మేరి:-
    మధ్యధరా సముద్రం ప్రాంతంలో లో దొరికే వీటి ఆకులు సన్నగా పొడవుగా వుంటాయి.వీటిని సునుప్,టమోటా సాస్,బ్రెడ్,మాంసాహారాలలో హారాలలో వాడతారు.మంచి  యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.అజీర్ణానికి సంబంధించిన సమస్య లన్నిటికీ మంచి మందు.మూడు కప్పులు  రోజ్ మేరి టీ ని ప్రతి రోజూ తీసుకుంటే కాన్సర్ కు దూరం కావచ్చు.

సీమ చేమంతి :-
  నిద్ర సమస్యకు చక్కటి  పరిష్కారం.నిద్ర పోయే ముందు చిక్కటి సీమ చేమంతి టీ తాగినట్లైతే నిద్ర బాగా పడుతుంది.జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.కండరాలు ముడుచుకు పోకుండా ను కండరాల సమస్య తీవ్రతను తగ్గిస్తుంది.కీమో థెరిపీ,రేడియేషన్ తరువాత ఏర్పడే నోటి పుళ్ళకు సీమ చేమంతి మౌత్ వాష్ తో పుక్కిలిస్తే ఉపశమనం కలుగుతుంది.సీమ చేమంతి టీ తాగినట్లైతే కాన్సర్ కి దూరం కావచ్చు.

   ( వీటి  లో కొన్నిటినైనా పాటించి నట్లైతే  కాన్సర్ ముప్పు నుంచి బయట పడవచ్చు. ఓక వేళ  కాన్సర్ బారిన పడినా నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.) 

వెల్లుల్లి:-
   వెల్లుల్లి లో అర్జినిన్,అలిగొశాచరిడెస్,ఫ్లేవొనాఇడ్స్,సెలీనియం ఉంటాయి.ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే.పెధ్ధ పేగు,అన్నవాహిక,పాంక్రీస్,బ్రెష్ట్ కాన్సర్ ల  నివారణ లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ఇమ్యూనిటీ ని పెంచడం లోనూ,బ్లడ్ ప్ర్షర్  తగ్గించడం లోనూ ఉపయోగ పడుతుంది.

Wednesday, December 17, 2014

4.చిలీ పెప్పర్:-
     ఇది కాప్సిసిన్  లో ఉంటుంది.నొప్పి నుండి ఉపశమనాన్ని కలుగజేస్తుంది.కాన్సర్ నివారణకు ఉపయోగించవచ్చు. కాన్సర్  సర్జరీ తరువాత నొప్పి నుండి ఉపశమనానికి కాప్సిసిన్  క్రీం వాడాలి.

3.పసుపు:-
    కూరలలో పసుపు వాడే అలవాటు మనకి ఉన్నది.కొన్ని వంటలలో రంగు కోసం కూడా వాడతారు.యాంటీ ఆక్సిడెంట్ గా,నొప్పి నివారణకు ఉపయోగ పడుతుంది.ముఖ్యం గా పెద్ద పేగు,ప్రొష్టేట్,బ్రెష్ట్ ,చర్మ కాన్సర్ నివారణకు పనిచేస్తుందని వైద్య పరీక్షలలో తేలింది.

కాన్సర్ నివారణకు:-
        ఆధునిక కారం లో కాన్సర్ వివిధ రూపాలలో జనాల్ని భయాందొళనలకు గురి  చేస్తోంది.అది రాకుండా నివారించడానికి కొన్ని ఆహారపదార్ధాలు ఉపయోగ పడతాయి.అవి ఏమిటో చూధ్ధాము.
  
 1.అల్లం:-మనం అల్లం పేష్ట్ కొన్ని వంటలలో ఉపయోగిస్తాము.ఒక స్పూన్ తాజా అల్లం తురుము తరచుగా తీసుకుంటే కాన్సర్ నివారణగా పనిచేస్తుంది.అంతేగాక జలుబుకి,అజీర్తికి కూడా మంచి మందు.

అమానుషం:-


         చిరు దరహాసాలతో,కొటి కలలతో
         బడిలో అడుగుపెట్టిన వారికి తెలియదు
         తమ హాసాన్ని,కలల్ని కాలరాసే
         ముష్కరులు పొంచి ఉన్నారని
        
         హటాథుగా చొరబడిన ఆగంతుకులను
         ఆస్చ్ర్యంగా చూస్తుండగానే
         క్షణాల్లో అసువులు అనంత వాయువులో
         కలిసిపోతుంటే 
         ఏమి జరుగుతోందో,ఏం చెయ్యాలో తెలియని
         పాపం,పుణ్యం ఎరుగని అమాయుకులు
         తోటి వారు కనులముందు నేలకొరుగుతుంటే
         ఎంతగా అలమటించారో

         పసరు మొగ్గలను పాశవికం గా
         నలిపేసి
         తల్లి తండ్రుల ప్రాణాలు 
         ఉండీ లేనట్లుగా చేసి
         పిల్లలపై వారి ఆశలను అడియాశలు చేసి
         గుండెలలో చిచ్చును రగిల్చి
         ఎప్పటికీ తీరని దూఃఖాన్ని మిగిల్చి

         ప్రభుత్వ చర్యకు ప్రతిచర్యగా
         తమ ప్రాణాల్నే ఫణం గా
         పెట్టాలన్న సత్యం తెలియని
         సత్తెకాలం పిల్లలు
         పాఠశాల ప్రాంగణమే
         వారికి మరణశాసనమౌతుందని
         మరుభూమిగా మారుతుందని
        ఆ తల్లి కి తెలియదు
        తెలిస్తే
        ఏ తల్లీ తమ బిడ్డను బడికి పంపదు.
         చదివి ఏ వూళ్ళూ ఏలక్కర లేదు
        తమ కళ్ళ ముందర తిరగాడితే చాలని
       గుండెల్లో దాచుకుంటుంది
       బిడ్డల్ని కోల్పోయిన
      ఆ తల్లుల గర్భ శోకం తీర్చగల
      మంత్రదండ మేదైనా ఉంటే బాగుండు
      కాలాన్ని మించిన మంత్రదండ మేముంటుంది?
     అది మీ గాయాన్ని మాంపి
      మిమ్ము మిమ్ము గా నిలబెట్టే  రోజు
     త్వరగా రవాలని ప్రార్ధించడం కంటే
     మేము ఏం చేయగలం?

       (ఉగ్రవాదుల దాడులలో అశువులు బాసిన పిల్లలకు నివాళులు)