Friday, September 26, 2014

మంచిమాట

అర్ధము అనర్ధ కారణ మని శౌనకుడు ధర్మరాజుకి చెప్పిన ఈ పద్యము నేటి కాలానికి కూడా వర్తించును. 
క. అర్ధమ యనర్ధ మూలమ్ ,
    బర్ధమ మాయా విమోహ నా వహము నరుం 
    డర్ధార్జన  దుఃఖ మున ,
    న, పార్ధి కృత జన్ముడగు ట  పర మార్ద మిలన్ !


వన్ కాయ కూర.
     వంకాయలు------------------1/4 కెజి
    పచ్చి మిర్చి--------------4
    అల్లం ------------------------చిన్న ముక్క
    వెల్లుల్లి రెబ్బలు-------------5
    జీరా-------------------------1/2స్పూన్
    ఉప్పు------------------------సరిపడా
    కరివేపాకు---------------రెండు రెబ్బలు
    నూనె-----------------------రెండు స్పూనులు
    పోపు దినుసులు--------ఆ వాల్లు,మినపపప్పు, శనగ పప్పు
                        ముందుగా  జీర,పచ్చి మిర్చి,అల్లం,వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి.తరువాత వంకాయలు సన్నగా తరుగుకొని నీళ్ళలో వేసుకోవాలి.స్టౌ మీద బాణిలి పెట్టి  నూనె వేయాలి.కాగినాక పోపు దినుసులు అవి ఎర్రబడినాక కరివేపాకు అందులోనే నూరిపెట్టుకున్న పచ్చి మిర్చి ముధ్ధ ఉప్పు వేసి కమ్మటి వాసన వచే వరకు వేయించి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్క లని  వేసి సన్న సెగని వేయించాలి.ఇది చాలా రుచిగా ఉంటుంది.

Thursday, September 25, 2014

saratrutuvu



సప్త ఋషి మండలం బు తో
గగనం దేదీప్యమానమై నొప్పె
సుదాం శు ని కిరణములు  సోకి
దఌతకమలములు దర హాసము తో వెలిగె
వికసిత  నవ కమల సౌరభము తో
జగతి సుగంధ వికీర్ణ మానమయ్యె
భూ వనిత నవ తృణ శిలీన్ధ్రములతో
చిత్ర విచిత్రాం బరములు ధరించి
హరివిల్లు భువికి హారమైన దన్న భ్రాంతి  నొసగె
ఆకాశం తారాహార పంక్తుల తో
దీపతోరణ ములవో లే వెలుగొందే
శ రాతాగామము అఖిల జనులకు
మోదమును గూర్చె.


Wednesday, September 24, 2014

పొట్లకాయపచ్చడి


పొట్లకాయ ----------------------1చిన్నది
పచ్చి మిరపకాయలు ----------4
ఉల్లిపాయ ----------------------1
పెరుగు-----------------------
నూనె---------------------------రెండు స్పూన్లు
చింతపండు -------------------ఒకరెబ్బ
కరివేపాకు --------------------రెండు రెబ్బలు
పోపుదినుసులు --------------ఆవాలు,జీరా,మినపపప్పు,శనగపప్పు,కలిపిరెండు స్పూన్లు
ఇష్టమైన వారు ఇంగువ చిటికెడు. ఉప్పు సరిపడా
    ముందు పొట్ల కాయ ముక్కలు కోసుకొని నీళ్ళలో వేసి ముక్క కొంచెం మెత్తపడే వరకు ఉడకనివ్వాలి. అది పక్కన పెట్టుకొని ఆరనివ్వాలి. బాణిలిలో ఒక స్పూను నూనె వేసి పచ్చి మిరపకాయలు వేయించాలి. ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరుగుకోవాలి. వేయించిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు,చింతపండు జీలకర్ర మిక్సీలొ వేసి ఒకతిప్పు తిప్పిన తరువాత ఉడికిన పొట్లకాయ ముక్కలు నీరు పిండి ఆమిశ్రమమ్ లోవేసి మరీ మెత్తగా కాకుండాఆతిప్పి తీసివేయాలి. ఇప్పుడు మరల స్టౌ మీద బాణిలి పెట్టి ఒకస్పూను నూనె వేసి కాగినాక పోపు దినుసులు కాలాక ఇంగువ ,కరివేపాకు తరిగిపెట్టుకొన్న ఉల్లి ముక్కలు వేసి రెండు సార్లు తిప్పి  మిక్సీ వేసిన మిశ్రమాన్ని అన్దులోవెయ్యలి.ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించ కూడదు. మొత్తం బాగా కలిపి స్టౌ కట్టేసి పెరుగు వేసి బాగా కలుపుకొని  గిన్నెలోకి తీసుకోవాలి. పొట్లకాయ పచ్చడి రెడీ. 

Monday, September 22, 2014

మంచిమాట

 
    ఆత్మ విశ్వాసం ,ఆత్మజ్ఞా నము,ఆత్మ నిగ్రహం -ఈ మూడూ గుణాలు మనిషి జీవితాన్ని ఏంతో శక్తివంతం గా తయారు చేస్తాయి. 

పంజాబీరోటీ


       మొక్క జొన్న పిండి-------2 కప్పు లు
      గోధుమ పిండి-----------1/2 కప్పు
     సాల్ట్     ---------------------1 tsp స్పూన్
      బంగాళా దుంపలు-----4
      కొత్తిమీర---------------------కొంచెము
      కారం-----------------------1tsp స్పూన్
     నూనె---------------------------వేయించడానికి సరిపడా
          ముందుగా బంగాళా దుంపల్ని  ఉడికించుకొని  మెత్తగా చేసుకోవాలి.అందులో నూన్ తప్ప మిగిలిన సరుకులు అన్నీ వేసుకొని గోరు వెచ్చని నీటితో కలుపుకోవాలి.ఆ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని రోటీ కర్రతో గుండ్రం గా అతుక్కోకుండా పిండి జల్లుకుంటూ వత్తుకొవాలి.అన్నీ చేసిన తరువాత స్టౌ మీద బాణిలి పెట్టి సరిపడా నూనె పోసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి.అంతే పంజాబీ రోటీ తింటానికి రెడీ.

Saturday, September 20, 2014

శ్రమయేవ జయతే


             శ్రమ అంటే కష్ట పడటం,పనిచేయడం. ఎవరి కి చేతనైన పని వారు చేయాలి.తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు ఎంతున్నా కూర్చుని తింటూంటే కొండలైనా కరిగిపోతాయి.కొంతమంది  కొన్ని పనులు బాగా చేయగలుగుతారు.ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటుందో  అందులో ప్రావీణ్యత సంపాదించ వచ్చు. ఒకవేళ ఇష్టం లేని పని చేయవలసి వచ్చినా  మొక్కుబడిగా కాకుండా  ఇష్టం చేసుకోవాలి అప్పుడు కష్టమనిపించదు.
" తన కిష్టమైన కార్యాన్ని పరమ మూర్ఖుడు సైతం సాధిస్తాడు.కానీప్రతి కార్యాన్ని తన అభీష్టానికి అనుగుణంగా మలచుకో గలవాడే బుధిశాలి,ధీశాలి"---అంటారు స్వమి వివేకానంద.
        కొంతమంది కొంచెం పని చేయగానే ఎంతో కష్ట పడిపోయినట్లుగా ,తాను మాత్రమే చేసినట్లుగా భావిస్తారు.అలాంటి వారికి కనీస అవసరాలకు లోటు లేకపోవచ్చు కానీ ఉన్నత శిఖరాలు ఎక్కలేరు.శ్రమ లోనే విశ్రాంతి వెతుక్కునే వారు ఆర్ధికం గానే కాక సమాజం లో కూడా ఒక గుర్తింపుని పొందగలరు.తక్కువ శ్రమ ఎక్కువ విశ్రాంతి కోరేవారు ఏమీ పొందలేరు.పైగ కబుర్లతో కాలక్షేపం చేస్తూ అనవసర వ్యాసంగాలతో అశాంతిగా ఉంటారు. బధ్ధకం,అలసత్వం,అలక్ష్యము మనిషి కి  బధ్ధకం శత్రువులు.కృషి ,పట్టుదల మనిషి కి కనిపించని రెండు రెక్కలు.ఇవి రెండూ ఉంటే దేన్నైనా సాధించ వచ్చు.
          నేటి  తరం  కలలు కంతున్నారు కాని అందుకు తగిన శ్రమ చేయక పోవడం,ఒక్కసారిగా ఎవరెష్టు శిఖరాలు ఎక్కాలనుకోవడం,అది సాధ్యం కాక మధ్యలోనే వదిలేయడం.నిరాశా,నిస్పృహలకు లోనవడం.ఏ పనైనా మొదలు పెట్టినప్ప్డు పూర్తిగా అవగాహన చేసుకోవాలి టుదొర్ వరకు నిబధ్ధతో చేయాలి.
   భర్తృహరి అంటారు:--
"నీచులు  విఘ్నాలు కలుగుతాయని ముందే పని మొదలుపెట్టరు,మధ్యములు మొదలుపెట్టి  విఘ్నాలు కలగగానే మధ్యలో వదిలేస్తారు, ధీరులు ఎన్ని ఆటంకాలు వచ్చినా తొలగించుకుంటూ అనుకొన్నది సాధిస్తారు."

    ఇంక"కార్యసాధకుడు దూఃఖాన్ని,సుఖాన్ని లెక్కించడు."--అలా చేయగలిగి నప్పుడే జీవితం లో స్థిరత్వాన్ని పొందగలుగుతాము."కృషి తో నాస్తి దుర్భిక్షం"-
సమయాన్ని వృధా చేయకుండా దేన్నైనా "శోధించి సాధించడమే ధీర గుణం".అప్పుడే విజయం నీ సొంతమౌతుంది.


Thursday, September 18, 2014


అమ్మ


          కడుపులో 
          బీజం పడగానే
          స్త్రీత్వానికి  ప్రతీకననే
          ఆనందానుభూతిలో  నేను

         సుతిమెత్తని
         కదలికలతో కలియతిరుగుతుంటే
         కలల ఊహలలో
         ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తూ నేను

         తప్పటడుగుల్తో
         తడబడుతుంటే
         ఎక్కడ గాయపడతావోనన్న
         భయాందొళనలో నేను

        ఆ తడబాటు 
       ఆలవాటు గా మారితే
       విచలిత మనస్కనై
       విషణ్ణ వదనంతో నేను.

       నేరస్థుడిగా
       లోకం నిన్ను దోషిగా చూపితే
       ముక్కలైన హృదయం తో
       బ్రతుకంతా జీవచ్చవం లా నేను.


Tuesday, September 9, 2014

మంచిమాట


          "ప్రతిభ"అంటే  బుధ్ధి లో కొత్త  విత్తనం మొలకెత్తటమే! 
        1.నవ్య కల్పన. 2.నవ్యోత్సాహము.3. నవీన అన్వేష్ణ 4.జీవనమునకు నవీన దిశ
            -----వినోబా.

ChaaTuvu.

చాటువు
         వేముల వాడ భీమకవి మహిమానిత్వాన్ని గూర్చి చెప్పబడిన ఈ చాటువు ఎవరి కృత మైనప్పటికీ విశిష్టమైనది గా చెప్పవచ్చు.
   చం. మతి,ప్రభ,నీగి,పేర్మి,శిరి,మానము పెంపున భీమునిన్ బృహ
              స్పతి,రవి,కర్ణు,అర్జును,కపర్ధి,సుయోధను బోల్ప బూన;నా
              మతకరి,తైష్ణు,దుష్కులు,నమానుషు,భిక్షు,ఖలాత్ము నెంచ;వా
             క్సతిపు,శశిన్,శిబిన్,కొమరు సామిని,మేరువు,నబ్ది బోల్చెదన్.
                              బుధ్ధి విషయం లో భీమకవి బృహస్పతితో కాక వాక్సతి భర్త బ్రహ్మ తో పోల్చ దగినవాడట.బృహస్పతి మతకరి కనుక.తేజస్సు లో రవి తీక్షణుడు కనుక చంద్రుని తో పోల్చదగిన వాడు.దాత్రుత్వం లో కర్ణుడు దుష్కలుడు కనుక శిబి తోను,పౌరషం లో అర్జునుడు పేడి వాడు కనుక కుమారస్వామి తోను,ఐశ్వర్యం లో శివుడు భిక్షువు కనుక  మేరువు తోను,అభిమానం లో సుయోధనుడు ఖలాత్ముడు కనుక  సముద్రం తోను పోల్చాడు. క్రమాలంకారం లో ఎంతో చక్కగా చెప్పబడిన  చాటువు.

Sunday, September 7, 2014

Jత్యాగం



            విత్తనం తాను
                 చనిపోతూ
            పంట  నిచ్చింది.
           పువ్వు  తాను
                   రాలిపోతూ
          పండు నిచ్చింది.
          సూర్యుడు తాను
                   అస్తమిస్తూ
         వెన్నెల నిచ్చాడు.
        భూమి  తాను 
                  తిరుగుతూ
         అనంత కాలాన్నిచ్చింది.
         ప్రకృతి  తాను
                  తరిగిపోతూ
        సమస్త  సంపదల నిచ్చింది.
        అమ్మ తాను
                   కరిగిపోతూ
        జీవితాన్ని ఇచ్చింది.
        ఇన్ని త్యాగాలతో
        జీవిస్తున్న మనం
        సమాజానికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?

Saturday, September 6, 2014

Maa inti tota










Vidyaa daanam

    అన్న దానము గొప్పదనవచ్చునే కాని
                       అన్నంబు  జాములో నఋఇగిపోవు
    వస్త్రదానము గూడా భవ్య దానమె కాని
                       వస్త్ర మేడాదిలో పాతదగును
    గృహదానమొకటి  యుత్క్ర్ష్ట దానమె కాని
                       కొంప కొన్నేండ్ల లో కూలిపోవు
   భుమి దానము మహాపుణ్య దానమె కాని
                       భూమి యన్యులజేరిపోవవచ్చు
   అరిగిపోక ,ఇంచుకయేని చిరిగి పోక,
   కూలిపోవక యన్యులపాలు గాక
    నిత్యమయి, వినిర్మలమయి,నిశ్చలమయి
    యొప్పుచుండు విద్యాదానమొకటి జగతి.
                        ----చిలకమర్తి లక్ష్మీ నరసిమ్హం.

Friday, September 5, 2014

Telugu bhaasha

తెలుగు భాష
     "ఖ"కి కాలం చెల్లిందని
      "క" తో సర్దుకు పోదామా!
       ఖాళీని  క  తో పూరించ గలమా!
      "ఘ" గడప దాటిందని
       "గ "తో గడుపుకుందామా?
       "ఘడియ"తో "గడియ"వేయలేము కదా!
        "ఛ"ని వదిలి చదివేధ్ధామా?
          "ఛత్రము" లేని చాయ గా ఇగిలి పోదామా!
         "ఝ" ని చూసి  జడుసుకొని
          జరిగిపోదామా?
         తుమ్మెదల "ఝ"ంకారాన్ని,
        "ఝ"రుల గగలల్ని 
         వినడం మానివేద్దామా?
        "ఠీ"వి గా ఉన్న "ఠ"ని
        మరచిపోయి
        ఖన్"ఠా"న్ని కంటకముగా మార్చేద్దామా?
       "ఢ"మురక నాదాన్ని
        "ఢ"ంకా భజాయించి చెప్పలేక
        డబ్బాలో పెట్టే ద్దామా?
        "థ"తరలిపోయిందని
         త నే తలచుకుందామా!
         క"థ" మారిపోయి కతే మిగులుతుంది.
         "భ" ని చూసి భయపడి
         "భ"రతుడి ని బరతుని గాచేసి
          "భ"ంగ పడదామా?
         అ"ణా",కా"ణీ"లు అలుసై పోయాయని
         గ"ణ"పతి తో బూ"ణీ" చేయని
         పూజ ఉండదు కదా?
       శాంతం గా జీవించా లని
      సాంతం గా భాష నే మార్చి
      మనని మనం ఏమార్చుకొని
       తెలుగు కే తెగులు పట్టిద్దామా?

       

Monday, September 1, 2014

Smrutyanjali

Kస్మృత్యంజలి
   కొంటె బొమ్మల బాపు
   తెలుగు వారి మదిని తెలుపు
   అందాల రాముడిగా
   అలరించి,
   ముంగిట ముత్యాల ముగ్గుగా
   మురిపించి,
   ప్రతి ఇంటి బుడుగుగా
   బులిపించి,
   నవరసా లొలికించు నాయికలతో,
   ఎద సందడి చేసి,
   బాపూ బొమ్మలే తెలిగింటి ఆడపడుచులు గా
   ఎద తంత్రులు మీటి,
   పురాణ పురుషులు ఎవరినైనా గీతలో
   ఒదిగించి,
   గీతా, రాతా నాదేనంటూ
   దశ దిశలా చాటి,
   కృష్ణ లీలా విలాస భాగవతాన్ని
   తెరకెక్కించి,
   కూసింత కలాపోసన చెయ్యాలన్న సత్యాన్ని
   లోకానికి చాటి,
   గోరంత దీపంతో కొండంత వెలుగుని పంచి
   చీకటిని మిగిల్చి,
   రమణ లేని సగం ప్రాణాన్ని 
   నిలపలేనంటూ,
   బుధ్ధి మంతునిలా భగవంతుని పిలుపుకి
   అలో అలో అంతూ
   తరలి వెళ్ళి,
  తెలుగు వారి ప్రతి హృదయం
  కన్నీటి కడలి చేసిన
  బాపూ.....
   భగవంతుని సాక్షిగా
  మరో జన్మంటూ ఉంటే
  "బాపూ" గానే రమాంటూ
  ఆర్తిగా వేడుకుంటాము.
          ***<>