Wednesday, October 22, 2014

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు
      ఈ దీపావళి  అందరికీ వెలుగుల్ని పంచాలని, ఆనందాన్ని ఇవ్వాలని  భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

Monday, October 20, 2014

మష్రూంఫ్రై:---

మష్రూం ఫ్రై:--
     మష్రూం----------- -----250 గ్ర
     కొబ్బరి--------------------1/4 కప్పు
     అల్లం,వెల్లుల్లి పేష్ట్------1 ట్బ్ల్ స్పూన్
     పచ్చి మిరప----------2
     ఉప్పు,కారం--------------సరిపోను
     నూనె----------------------2ట్బ్ల్ స్పూన్లు
     కొత్తిమీర, కరివేపాకు కొంచెము
     జీర, మినపపప్పు, ఆవాలు  తిరగమోతకు.
                    ముందుగా మష్రూం శుభ్రం గా కడుగుకొని  కట్ చేసుకోవాలి.వాటిని  మునిగేటట్టు నీళ్ళు పోసి  ఉడకబెట్టాలి.తరువాత ష్టౌ మీద బాణిలి పెట్టి  నూనె వేసి కాగినాక తిరగమోత్ దినుసులు కరివేపాకు వేసి కాలినాక ఉడకబెట్టిన మష్రూం వేసి కొంచెము సేపు సన్న సెగ మీద వేయించి  అల్లం,వెల్లుల్లి పేష్ట్,ఉప్పు వేసి వేయించి నాక కారము ,కొబ్బరి  వేసి రెండు నిముషాలు  తిప్పి దించేయాలి.కొత్తిమీర సన్న గా కట్ చేసి పైన జల్లుకోవాలి.

Saturday, October 18, 2014

యుధ్ధభూమికివ్యూహములు:-


            మహా భారత యుధ్ధం పద్దెనిమిది రోజులు జరిగింది.దీనినే కురుక్షేత్ర సంగ్రామం అంటారు.కురు పాండవులు ఇరువురు అనేక వ్యూహాలు పన్నారు.ఆ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బ కొట్టటానికి,మరికొన్ని సమ్రక్షణ వ్యూహాలుగా ఉన్నాయి. వాటి పేర్లను చూద్దాము.
         మానుష వ్యూహము దీనినే అచల వ్యూహమని కూడా అంటారు.
         క్రౌంచ,గరుడ,అర్ధ చంద్ర,మకర,శ్వేన,మండల,వజ్ర,కూర్మ,శృంగాటక,సర్వతోభద్ర,శకట,మండలార్ధ,పద్మచక్ర,దుర్జయ వ్యూహములు.
            మన అందరికీ బాగా తెలిసిన వ్యూహము పద్మవ్యూహము.సేనను నిలబెట్టే విధానాన్ని బట్టి  వ్యూహాలు మారతాయి.పద్మ వ్యూహ చిత్రాన్ని కింద చూడండి.


Thursday, October 16, 2014

భారతపద్యము


    శా. సింగంబాకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
            తంగ స్ఫూర్జిత యూధదర్సనసముద్యత్క్రోధమై వచ్చునో
            జం గాంతార నివాస ఖిన్నమతి న్స్మత్సేనపై వీడె వ
            చ్చెం గుంతీసుత మధ్యముండు సమర సేమాభి రామాకృతిన్.

                       పాండవుల ఉనికిని తెలుసుకోటానికి దుర్యోధనుడు కౌరవ సేనతో కలసి విరాట నగరంపైకి దండయాత్రకు వస్తాడు.అప్పటికే విరాటరాజు దక్షిణ గోగ్రహణ యుధం లో సుశర్మతో పోరాటానికి వెళతాడు.బృహన్నల రూపం లో నిన్న అర్జునుడు ఉత్తరునితో కలసి యుధ్ధభూమికి వస్తాడు.అది చూచి ద్రోణుడు సమయ బంగ మైనదేమొనని  సందేహాన్ని వెలిబుచ్చగా భీష్ముడు కాలేదని చెబుతాడు.అలా వస్తున్న అర్జునుని చూచి ద్రోణుడు భావిస్తాడు.
                  సిమ్హము ఆకలితో గుహలో ఉండి ఒక్కసారిగా మాతంగ సమూహాన్ని చూడగానే పెల్లుబికిన కోపం తో ఉరుకుతుందో అలాగే అరణ్య అఘ్నాత వాసాల్ని పూర్తిగా చేసిన అర్జునుడు కౌరవ సేనపైకి సమరము పై ఉత్సాహం తోవచ్చు చున్నాడు. వీరుడైన అర్జునుడు ఇంతకాలం చేతులు కట్టుకొని  ఆకలితో ఉన్న సిమ్హం వలె ఉన్నాడు అని తిక్కనపోల్చాడు."వీడే"అనడం లో కూడా ఔచిత్యం కనిపిస్తుంది.ఇది తిక్కన రచనా చమత్కృతి.

Monday, October 13, 2014

మూలిగేనక్క------


            అసలే రాష్ట్రానికి నిధుల కొరత.రాజధాని నిర్మాణం కోసం భారీ అంచనాలు .ఇంకో వైపు ఎడా పెడా ప్రకటించేస్తున్న చంద్రబాబు  సంక్షేమ పధకాలు.ఇప్పటికీ తేలని ఉద్యోగుల విభజన.ఇంకా ఎన్నో సమస్యలు.వీటన్నిటితో సతమౌతుంటే  మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు  హుద్ హుద్  తుఫను  తీవ్ర కష్టాన్ని,నష్టాన్ని కలుగజేసింది.ఎవరెన్ని నిధులు ఇచ్చినా ఉడుత సాయమే అవుతుంది కాని పూర్తిగా న్యాయం జరగదు.జనజీవనం సాధారణ స్థాయికి  రావడానికి ఎన్ని రోజులు పడుతుందో?త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిద్దాము.


Sunday, October 12, 2014

రాగిపిండికారప్పూస:--


      రాగి పిండి------------------------1కప్పు
      వరి పిండి-------------------------1/2కప్పు
      శనగ పిండి--------------------2స్పూన్లు
      వాము ---------------------------2స్పూన్లు
      వెన్న----------------------------2స్పూన్లు
      నూనె---------------------------2కప్పులు
      ఉప్పు----------------------------రుచికి సరిపోను
                  వాము కచ్చా పచ్చాగా నూరుకొని  నూనె తప్ప మిగిలిన పదార్ధాలన్నీ ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి.ష్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగినాక కలిపి పెట్టుకున్న పిండిని కారప్పూస గొట్టం లో పెట్టుకొని వత్తుకోవాలి.ఎర్రగా కాగినాక తీసుకోవాలి.రుచికి బాగుంటాయి.ఆరోగ్యానికి మంచిది.
     

Saturday, October 11, 2014

మేథీపూరీలు:---


         గోధుమ పిండి---------------------2 కప్పులు
         సేమియా------------------------------1/2కప్పు
         ఉప్పు ----------------------------------1స్పూన్
         వాము---------------------------------1స్పూన్
         నూనె----------------------------------5స్పూనులు
         మెంతి (ఎండిన)-----------------------3స్పూనులు,
        (పచ్చిదైనా. సన్నగా తరుగుకొని కలుపుకోవాలి)
        నూనె---------------------------------వేయించడానికి సరిపోను
                  
                       వేయించటానికి తీసుకున్న నూనె కాక మిగిలిన వాటిని గోరువెచ్చని  నీటితో ముద్దగా కలుపుకోవాలి.దానిని తడి బట్ట కప్పి ఒక గంట పక్కన ఉంచాలి.
                     చిన్న ముద్దలుగా చేసుకొని పూరీలు గా  వత్తుకోవాలి. వాటిని నూనెలో  బ్రౌన్ రంగు వచ్చే వరకు ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి.అలా వేయించుకున్న వాటిని తిష్యూ పేపర్ మీద తీసుకుంటే ఎక్కువ ఉన్న నీటిని పీల్చు కుంటాయి.మేథీ పూరీలు తినడానికి రెడీ.
                               

Friday, October 10, 2014

Baapu kadha

మబ్బూ వానా మల్లె వాసనా
              బాపూ గారి గీతలే కాక రాతలు కూడా మనసుని గిలిగింతలు పెట్టేవే.అలాంటి కధే ఇది.28.8.1957 లో ఆంధ్ర వార పత్రిక లో ప్రచురితమైన బాపు కధని   బ్లాగ్మిత్రులతో కలసి మరొకసారి గుర్తు చేసుకుందామని ఇక్కడ రాస్తున్నను.
           తెర మీద మధుబాల సిగపూల సొగసు చూడగానే మాధవ రావు లో ఒక మధురానుభూతి కలిగి ,యతిప్రాసయుతమైన వాక్యంలారమణీయ రూపం ధరించి ,తీరని కోరిక అంత పెద్ద కెరటం లా లేచి ,అందం గా విరిగిపడి మనసుని కలవరపరచింది.సీత,వెన్నెల,మల్లెపూలు,అందమైన ఊహలు,మబ్బూ,వానా ఇలాటివాన్నీ గబగబా ఙాపకానికి వచ్చేశాయి.ఇంటికి బయలుదేరాడు.
          మాధవ రావు కి మల్లెపూలంటే ఇష్టం.
      "సీతా!నువ్వు జడలో మల్లెపూలు ముడుచుకుంటే  ఎంత బావుంటావనుకుంటున్నవ్!పిల్లతెమ్మెరలు ఆ మల్లెల చల్లటి పరిమళాన్ని మెల్లిగా,నా నాసాపుటాలకు విందుగా అందజేస్తుంటే ఎంత బాగుంటుందో--ఈ లోకమే మరిచిపోతా!-అదొక మధురానుభూతి." అని మాత్రమే ఎప్పుడూ అనలేదు.అతనికి అలాంటి మాటలాట్టే సహించక పోవడం ఒక కారణం.
         రెండోది -తన అర్ధాంగి సవరం వాడుతుంది.అందుకని "నీ సవరం లోని పువ్వులు"అని వాక్యం సవరించాలి.దాంతో పొయిట్రీ కాస్తా పోనేపోయే.
         'టంటింటంటింటంటం'అన్నాడు మాధవ రావు.హీరో దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరాన్ని గుండెలకు హత్తుకుంటూ'అట్ట తోటాలో హింధీ హీరోయన్ పాడిన పాటను యధాశక్తి అనుకరిస్తూ.
          ఇంకో నిముషాలు తరువాత తెలుపు తాళం తీసి ,లోపల బల్ల మీద పడేస్తూ "టంటరటింటం టరటరటం" అని కూడా పడాడు.ప్రస్తుతం సీత ఇంట్లో లేదు కాబట్టి ఇంకో నాలుగు టరటాలు కలిపి పాడినా పరవాలేదు.
           ఆఫీసు నుంచి తిన్నగా సినిమాకి వెళ్ళి హోటలు వాడు"ఇది అన్నమే"అని హరం ఈ ఇచ్చిన పదార్ధాలను  వాడు నొచ్చుకు పోతాడేమో అని తను కూడా అది అన్నమే  అని నమ్మేసి తన ఇంటికి వచ్చాడు.
          సీత ఉదయం బయలుదేరి  పక్క ఊళ్ళో  చుట్టాలింటికి పెళ్ళికి వెళ్ళింది.రేపో ఎల్లుండో వస్తుంది.
            రాత్రి  పదిన్నరవుతోంది.
          "వెదర్  యమగా ఉంది"అనుకున్నాడు.అందువల్ల తెగించి గోల్డ్Fలెకు  పెట్టి కొనేశాడు.రూపాయి నోటు తీసుకొని మళ్ళీ లిక్కి లిక్కి మని అణా చిల్లరివ్వట మేమిటని ,అడక్కుండానే కొట్టువాడు డీలక్సు ఆగ్ని పెట్టి  చేతిలో పెట్టాడు.పిల్లలు కలవాడు -పోనీలే అని మాధవ రావు  అడ్డు చెప్పలేదు.
           సిగిరెట్టు  వెలిగించి ,లైటార్పి పక్క మీద పడ్డాడు.బయట గాలి జోరుగా వీశ్తోంది.కొద్ది నిముషాలకి చినుకులు ప్రారంభించాయి.పొడినేల మీద తొఇల్ చినుకులు పడగానే వచ్చిన వాసనకి మాధవ రావు ముగ్ధుడై పోయాడు.
               వారం రోజుల సంగతి  గుర్తొచ్చింది.
                     ********.         *****.            ****
           తెల్లారి అయిదింటికి  వాన మొదలైంది.వానంటే కూడా మాధవ రావు కి ఎంతో ఇష్టం.పెళ్ళవని రోజుల్లో ,వానొచ్చి నప్పుడల్లా, పక్కన తన కిష్టమైన చక్కటి  అమ్మాయి చెక్కిలికి చెక్కిలి ఆనించి మరీ వాసన చూడాలని ఉండేది.
          పెళ్ళైన తరువాత ఒక రోజు వాన రాగానే ఆ సంగతి గుర్తుకొచ్చింది.అపుడు సీతని లేపి చెంపకి చెంప ఆనించి వానని చూధ్ధామని అడిగితే నిద్దుర మత్తులో ఆ అమాయి కంగారు పడొచ్చు .అయినా లేపాడు.
      "ఊ" అంది సీత కళ్ళు తెరవకుండానే.
       "వాన"అన్నాడు తను
        "కిటికీ తలుపులు మూసేయండీ   జల్లుకొడుతుంది"అంది సీత.
     మాధవరావుకి  చిరాకేసింది.
      "అబ్బే అది కాదు.కిట్కీ దగ్గర  కూచొని వాన చూద్దాం రా లే"అన్నాడు కోపంగా.
        సీత ఆవులించింది "బావుల్దండీ--హాయ్-అదే బావుల్ది.అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలన్నట్లు చాల్చాఉ.పడుకోళ్ది"అంది-అటు వేపు తిరిగి".
            "   టెక్నికల్ అబ్జెక్షన్ అర్ధ రాత్రి కాదు--ఇపుడు అయిదు యయ్ ఇంద్రి--తెల్లరి--"అన్నాడు ఇంకా కోపంగా.
       సీతకు ఇవేమీ వినిపించినట్లు లేదు.
     మండిపోయాడు మాధవ రావు.
  దడ దడా లేచి పళ్ళు తోమేసి ముఖం కడిగేసుకొని అంతకన్నా కసిగా పదహారు అగ్గి పుల్లల సాయంతో కుంపటి అంటించి పారేశాడు. మాళ్ళీ తెచ్చి వంటింట్లో పెట్టి వసారా లోకి వచేప్పటికి గూట్లో పాలగిన్నె ఖాళీగా కనిపించింది.ఇంకా పాలవాడు రాలేదు.వానపడ్డం మూలాన్ని వాడూ బహుశా వాడి తాలూకు అర్ధాంగి చెంపకి చెంపాంచి వానని చూస్తున్నాడేమో!వాది బొంద వాడికి రొమాన్సేమిటి,కల్చరుండదు-బహుశా ,బియ్యే,గియ్యే చదివాడా ఏడిశాడా.... మాధవరావు నిశ్శబ్దంగా చిన్న కధాకళీ నృత్యం చేసి పడక్కుర్చీలో కూచొని నిద్దరోయాడు.
      *****.    *******.         *****
          ఇపుడా సంగతి ఆలోచించుకుంటూంటే ఆరోజు ఎప్రోచ్ బాగులేదనిపించింది.
     "అసలలా కాదు. మృదువుగా మాట్లాడి ఉండాల్సింది."అనుకున్నాడు.
    బయట వాన జోరు కొంచెము తగ్గింది.కిటికీ లోంచి వచ్చే గాలి కి  దుప్పటి మడత పడింది. సిగరెట్టు బయటికి విసిరి,దుప్పటి సరిజేసి తలగడా మీద తల ఆంచాడు.
      మల్లెపూల వాసన గుప్పుమంది.
  నిన్న రాత్రి ,సీత పక్కింటి వారి అమ్మాయి తెచ్చిపెట్టినవీ,తను ముందే కొన్నవీ కలిపి జడలో రోజూ కంటే మరిన్ని పూలు తురుముకొంది.వాటి తాలూకు పరిమళం తలగడాని అంతటా అలముకొని ,జవరాలి కంచుకంలా గాఢాశ్లేషం చేసుకుందనిపించింది.మర్నాటికీ ఆ పరిమళం అలాగే ఉండటం గమనించిన మాధవ రావులో తక్షణం మనోహరమైన ప్రణయ భావాలు, మధురస్మృతులు మెదిలాయి.
    ఆమాంతం  సీత అంటె ప్రేమ పెల్లుబికింది.
    తను మొదటిమాటగా పెద్ద పండక్కి అత్తారింటికి  వెళ్ళినప్పుడు ,గుమ్మం దగ్గర మల్లెపూలు బేరం చేస్తున్న సీత అప్పుడే రిక్షా దిగిన తన్ను చూడగానే బోలెడు సిగ్గుపడిపోయి గబుక్కున లేచి ,గడప తగిలి బోర్లా పడినంత పనిచేసి వసారా తుడుస్తున్న పనిమనిషిని ఢీ కొట్టి పడిపోకుండా నిలదొక్కుకొని లోపలికి పరిగెత్తుకెళ్ళిపోయిన సంద్బర్భం తలచుకొని తక్షణం తనూ బోలెడు సిగ్గుపడిపోయాడు. ఆ మైకం లో దమ్మిడీ కూడా ఎక్కువివ్వనని పరాగ్గా అర్ధ రూపాయి చేతులో పెట్టేశాను.
         రాత్రి డాబాలో వెన్నెల కింద పక్క వేశారు.మామగారి సంభాషణని తప్పించుకొని డాబా మీదకు వెళ్ళిన తనకు తెల్లటి వెన్నెల కింద పక్క,పాక్క మీద పాల కెరటం లాంటి మెత్తటి తెల్లటి దుప్పటి దుప్పటి మీద ఆ కెరటపు నురగలా తెల్లటి మల్లెపూలు "ఓహ్!ఏమి టేష్టురా"అని గుండెలు బాదుకున్నాడు."Yఅమ టేష్టు"అని జవాబు చెప్పుకున్నాడు.
         ఈ మధుర స్మృతులన్నీ సీతకు గుర్తు చేయాలని నిర్ణయించుకున్నాడు.మర్నాడు ఆఫీసు నుంచి వచ్చే టప్ప్తికి సీత వచ్చేసింది. కాఫీ తాగుతూ విషయం చెబుదామనుకున్నాడు. చాకలి వాడికి బట్టలు వేస్తోంది ఇది మంచి సమయం కాదు భోజనాలయ్యాక వెన్నెలలో భేషుగ్గా ఉంటుంది అనుకున్నాడు.
        సీత వంటిల్లు తాళం వేసి వచ్చి  తమలపాకులు చిలకలు చుట్టి నోట్లో వేసుకుంటోంది.చెప్పాలని నోరు తెరిచే టప్పటికి ఆటేపెళ్లింది.
  కాసేపు తెల్లబోయి తమాయించుకొని"సీతా ఇటురా"అన్నడు
    చెప్పాలనుకున్నది వాయిదావేసి "పెళ్ళి బాగా జరిగిందా"అన్నాడు.
       "ఆ పెళ్ళికేం బాగా జరిగింది.మీరు రాలేదని ఇదయ్యారు."అన్నది.
     అర్ధం చేసుకో లేదమని విసుక్కుంటూ ఫ్లష్ బాక్తో ప్రారంభించాలని"నేను పెద్ద పండక్కి మీ ఇంటికొచ్చినప్పుడు గుర్తుందా?"అన్నాడు.
          "లేకేం. అప్పుడు మా అమ్మ నాకు పెట్టిన చీర గుర్తుందా? ఎర్రంచు  బార్డరు తెల్ల చుక్కలు.అలాంటిదే మగపెళ్ళివారు పెట్టారండీ నిన్న ఎళ్ళిలో................."
    "మంచి నీళ్ళు!మంచినీళ్ళు!"అన్నాడు మాధవ రావు.
    తెచ్చిచి పక్క మీద వాలింది సీత "నిన్నంతా నిద్ర లేదంటూ"
    ఆఖరి ప్రయత్నంగా "సీతా!నిన్న రాత్రి తలగడ మీద మీద వాలగానే వాసన.."
 "అబ్బే మాసిపోయాయండీ  ఇవాళే చాకలాడికి వేసేశా కొత్తవి తొడిగాలెల్ది. -హాయ్--పడుకోండి. బాబూ నిదరొస్తోల్ది "అంది సీత ఆవులిస్తూ.
"లైటార్పేయండి బాబూ కాస్త "అని కూడా అనింది.
 ఎర్రంచు బార్డరు....హు!అని సణుక్కుంటూ స్విచ్చి దగ్గర కెళ్ళాడు మాధవ రావు.
                                      బాపు.


           

Wednesday, October 8, 2014

వ్యాసుడు


           కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
           ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం
        ఈ రోజు  ఆదికవి వాల్మీకి జన్మదినం.శ్రీమద్రామాయణ రూప కర్త.ఇతడి పూర్వ నామం రత్నాకరుడు.వ్యాధుడు వేటాడుతూ జీవనం సాగించేవాడు. ఋషుల సూచనతో "మరా,మరా" అనే నామ ఝపం చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోయాడు.చుట్టూ పుట్టలు(వల్మీకం) పెరిగి పోయాయి.బాహ్య ప్రపంచాన్ని వదిలేసాడు.ఈ సమయం లోనే నారదుడు రామకధను వినిపించాడు.ఒకరోజు శిష్యులతో వెళుతుండగా ఒక బోయవాడు క్రౌంచ పక్షుల జంట లోని మగపక్షిని చంపగా  ఆ దూఃఖం తో ఆడ పక్షి కూడా చనిపోతుంది.ఆ దృశ్యం చూసి చలించి శోకం నుంచే  శ్లోకం పుట్టింది.అదే--
    మానిషాద ప్రతిష్ఠాం త్వగమః శాశ్వతీస్సమా అః
    Yఅత్ క్రౌంచ మిధునాదేక మవధీఅః కామమోహితం||
           శోకం తో ఉన్న వాల్మీకి తో బ్రహ్మ నీవు చెప్పినది చంధో బధ్ధమైన శ్లోకము.రామాయణ కావ్యాన్ని రచించమని సూచించాడు.
           అలా ఆదికావ్యం రామాయణం ఆవిర్భవించింది.ప్రభు ధర్మాన్ని,ఆదర్స గార్హస్థ్య జీవితాన్ని వాల్మీకి భవ్యం గా చిత్రించ దలుచుకున్నాడు.సమాజాన్ని నీతి,ధర్మం,శీలం,సదాచరణ మొదలైన వాటిని బోధించాలనే తపనే ఈ కావ్యం. ఇది మానవాళికి లభించిన అపూర్వ కావ్యము.ధర్మ సంశయములను దూరమొనర్చి,పవిత్రధర్మములను సూచించును.వేదముల,ఉపనిషత్తుల సారమును సామాన్యులకు అందజేయు అద్భుత కర్తింగ్.
     "భక్త్యా,శక్త్యా చ యుక్త్యా చ బ్రూయాద్రామాయణం నరః"
         భక్తితో,పాండిత్యపు శక్తితో,వాద ప్రతివాద యుక్తి తో రామాయణాన్ని చదవాలి.ఈ కావ్యాన్ని చదవడం వలన మోక్ష ప్రాప్తి లభిస్తుందని  చెప్పబడింది.సీతా వివాహ గట్ట పారాయణం,సుందర కాండ పారాయణం వంటి వాటి వలన ఇహలోక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడింది.అలాగే  రామలక్ష్మణులు,భరత శత్రుఘ్నులు,రావణ విభీషుణులు  ద్వారా--భ్రాతృ ధర్మం,కౌసల్య,సుమిత్ర,కైకల ద్వారా---భార్య,మాతృ ధర్మాలను;దశరధుని ద్వారా--భర్త,పితృ ధర్మాలను;జటాయువు,సంపాతుల ద్వారా---స్నేహ ధర్మాన్ని;ఆంజనేయుడు ద్వారా--నిస్వార్ధ సేవా ధర్మాన్ని ప్రభోధిస్తారు.సీత లోకమున స్త్రీఇలు అనుసరించదగు అనేక ధర్మములను ఆచరించి చూపినది.
                 ఈంతటి మహోత్కృష్ట వారసత్వ సంపదను మనకు అందించిన వాల్మీకికి సదా మనం కృతఙులమై ఉండాలి.





Monday, October 6, 2014

Vihanga viikshanam

ఆకాశ వీక్షణంలో భూమిని చూస్తే ఇలాంటి  ఆద్భుత దృశ్యాలు ఆవిష్కారమౌతాయి.











Sunday, October 5, 2014

    రామప్ప  గుడి
       అన్ని శివాలయాలలోను శివుని ఎదురుగా నంది విగ్రహం ఉండటం సర్వసాధారణం.కాని  ఇక్కడ నంది ప్రత్యేకం.తల కుడి వైపుకి తిప్పి రెండు చెవులు నిక్కపొడుచుకొని ఒక కాలు లేపి శివుని ఆజ్ఞ్ కోసం ఎప్పుడు పిలిచినా లేవటానికి రెడీగా ఉన్నట్లు ఉంటుంది.ఒకసారి మీరూచూడండి.