Tuesday, September 7, 2010

పబ్లిక్ న్యుసెన్సులు

అంటె ఏమిటి అనుకుంటున్నారా?మనం పబ్లిక్ లోకివెళ్ళినప్పుడు మనకే కాక అందరినియిబ్బంది పెట్టెవి.
ఉదాహరణకితుమ్ములు దగ్గులు అందరికి వస్తాయను కోండి కాని వారి మౌత్ ఫౌంటైన్ తో మనల్ని తడిపారనుకోండి అదన్నమాటన్యుసెన్స్.జర్దనొ ,కిళ్ళినో నోట్లో ఉన్నదనుకోండి అప్పుడు చూడాలి మన పాట్లు.బిక్కమొహమెసుకొని ఏడవలేక నవ్వాలి.విందు భోజనానికి వెళ్తామా మనపక్కనే కూర్చొని భోజనం చేస్తుంటారు .మీరెప్పుడైనా ఆవులు నెమరువేయడం చూసారా? అందుకుభిన్నంగా వుండదు ఈ సీను .తమ ముందున్న పదర్థా లను కసపిసా పచగడ్డిలాగా నమిలే స్తుంటారు. ఆశబ్దం గ్రైండరు శబ్దా నికి ఏమాత్రం తీసిపోదు.అదిభరించలేక ఏదో ఒకటి తిన్నామనిపించి లేచిపోవల్సిందే . ఆంతేనా మరికొందరుంటారుఎంత జనకూడళ్ళైనాసరేరోడ్డుపక్క తమ నేచురల్ కాల్స్ తీర్చుకోవల్సిందే.అది వారి జన్మ హక్కుగా ,ఆరోడ్డు వారి బాబు గారి సొత్తుగా భావిస్తారు.
చచ్చీ చెడీ కార్పోరేషన్ వాళ్ళు చెట్లు పెంచుతారా మన సేవే వారిధ్యేయమన్నట్లు పత్రాలు పుష్పాలు మన ఇళ్ళకు చేరి పొతాయి. పట్టణ సౌందర్యం గృహ సౌందర్యంగా మారిపోతుందన్నమాట. వానొస్తుందా రోడ్డేదో గుంటఏదో అని మనం జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ నడుస్తుంటామా ఏ నాలుగు చక్రాల వారో డబుక్కున గుంటలో బండిని జర్రునపోనిస్తారు మనం బురద స్నానం చేయాల్సిందే.ఎంత గొప్ప పని మీద వెళ్ళే వారమైనా వెనక్కు రావాల్సిందే .ఇంతేనా ఇంకా చాలా వున్నాయి ఇల్లాంటి
పబ్లిక్ న్యుసెన్సులు .మరల ఎప్పుడైనా చెప్పుకుందాము.

1 comment:

  1. LAKSHMI గారూ...,గణేష్ భక్తి గీతాల పారాయణం చేద్దాం

    హారం

    ReplyDelete