Tuesday, November 2, 2010

మౌనం

మౌనం ఎంత అర్దవంతమైన పదము. మౌనంగా ఎదగమని మొక్క చెప్పినా,మౌనం అర్దాంగీకారమైనా అది ప్రత్యేకమైన పదమే.ఎందుకంటేమౌనంగా ఉండటంవలన ఎన్నో వాగ్వివాదాలను ఆపవచ్చు.ఒకోసారి మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించవచ్చు .అందుకే కవులు తమకవిత్వంలో ఆపదానికి ప్రాముఖ్యతనిచ్చారు . మౌనమె నీ భాష ఓ మూగ మనసా అనీ ,మౌనమేలనోయీ ఈ మరపురానిరేయి ,ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు .మౌన రాగాలు,పలికినా మౌన పోరాటాలు చేసినా బంధనాలు పెంచుకోవటానికే.వ్రతాలలో మౌనవ్రతం శ్రేష్టత అందరికీ తెలిసినదే .గాంధీజీ అందుకే తన నిరసన తెలపటానికి మౌనవ్రతాన్ని ఎంచుకున్నాడు .పెద్దల మృతికి రెండు నిముషాలు మౌనం పాటించడం వారికి మనం ఇచే నివాళి .ఇక మౌనానికి విరామ ము ఇద్దామా?

No comments:

Post a Comment