Wednesday, August 27, 2014

జీవితం
    జీవితం అంటే జీవించడం.జీవించడం ఒక కళ.జీవించడం అంటే ప్రేమించడమే. ప్రేమ గల జీవితం అన్నిటికంటే గొప్పది.తాను జీవించడమే కాక ఇతరులను జీవించేలా చేసినప్పుడే జీవితం సార్ధకమౌతుంది.
       జీవితం బుధ్ధి వలన మాత్రమే కాక కాయకష్టం తోడైతేనే సజీవంగా ఉండ గలము.మనిషి తన జీవితం ఎప్పుడూ ఆనందం గా ఉండాలని కోరుకుంటాడు.ఆనందం అనేది వారి వారి మానసికస్థితులనుబట్టి  భిన్నంగా ఉంటుంది.సామాన్య విషయాలు కూడా కొందరికి అధ్బుతం గా అనిపించవచ్చు,మరికొందరికి అతి సామాన్యం గానిపించవచ్చు.ఒకే వస్తువు ఒకే వ్యక్తీకి అన్ని వేళలా ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు.ఆనందకరమైనది మేలు కలగచేసేదికాకపోవచ్చు.మేలు జేసేది ఆనందకరమైనది కాకపోవచ్చు.చదవకుండా ఉండటం పిల్లలకు ప్రియం గా ఉంటుంది కానీ అది వారికి మేలు చేయదు కదా.
         దూఃఖం  జీవితంలో అన్నిటినీ మించిన బాధ.కొన్నిసార్లు మరణం కంటే కూడా దూఃఖం భయంకరం గాఉంటుంది.అది ఆత్మ హత్యలకు దారితీస్తుంది.
ఆత్మ విశ్లేషణ అనేది మన జీవన లక్ష్యాలను అందుకోవడంలో ఉపకరించే గొప్ప సాధనం.మనని మనం ఎప్పుడైతే విశ్లేషించుకుంటామో అప్పుడు విచక్షణ అలవడుతుంది. మంచి, చెడుని గ్రహించ గలము.సాదాగా జీవిస్తూ ఉండటం గా ఆలోచించడం ఒక ఉత్తమ జీవన విధానం.జీవితం జీవించడం కోసమే అని తెలుసుకొని సుఖ దూఃఖాలను సమానం గా అనుభవించగల ధైర్యాన్ని పొందినప్పుడే ఆనందమయ జీవితం గడపగలము.

No comments:

Post a Comment