Sunday, February 2, 2014

అసహజం


    పురాణకాలంలో మహాభారతంలో గాంధారి కృత్రిమ పధ్ధతి ద్వారా101 మంది సంతానానికి జన్మనిచినది అని తెలుసు. ఆధునిక కాలంలో పరిశోధనలు గాజుసీసాల ద్వారా పునరుత్పత్తి సాధ్యమే  అనితెలియజేస్తున్నాయి.
       మొదటి టెష్ట్ట్యూబ్ బేబీ 35 సంవత్సరాల క్రితమే ఆవిర్భవించింది.తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు పునరుత్పత్తికి అనేక మార్గాలు సూచిస్తున్నాయి.
        హృషీకేష్ పై (ప్రెసిడెంట్ ఎలక్ట్ ఇండియన్ సొసైటీ ఫర్ అసిష్టెడ్ రిప్రొడక్షన్) "భార్యాభర్తలలో ఒకరు వైఫల్యం చెందినప్పుడు స్పెర్మ్ లేక అండ దానాన్ని పొందడం అనుసరణీయమే.కానీథర్డ్ పార్టీని సంతానోత్పత్తికి అంగీకరింప జేయడం సవాలుగా మారుతుంది "అంటారు.ఈ సంవత్సరం కత్సుహికోహయషీ(జపనీస్ శాస్త్రఙుడు)  తన పరిశోధనాఫలితాలను వెల్లడించాడు. ఎలుక చర్మం నుండి బీజ కణాలను సేకరించి వాటిని స్పెర్మ్ ,ఎగ్స్ గా అభివృధ్ధిపరచినట్లు  తెలిపాడు.వీటినుండి ఎలుకల పునరుత్పత్తిని చేసాడు.ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు ఇటువంటి పరిశోధనలే ఫిమేల్ సెల్స్ నుండి స్పెర్మ్ డెవలప్ చేసే దిసెగా సాగుతునాయి.ఒక పది సంవత్సరాలలో స్టెం సెల్స్ నుండి హ్యుమన్ స్పెరంస్ తయారు చేయవచ్చు అంటారు పై.
            పరిశోధనాఫలితం ఏమిటంటే మానవ సంబంధం లేకుండానే బేబీని ఉత్పత్తి చేయవచ్చు. జపనీస్ శాస్త్రవేత్తలు గ్లాస్ చాంబెర్స్లో రెండు వారాలలో మేక పిండాలను అభివృధ్ధిపరచినట్లుగా పై తెలిపారు. కృత్రిమ పిండోత్పత్తిని చూడ టానికి ఇంక ఎంతోకాలం ఆగక్కరలేదు.
              పునరుత్పత్తి టెక్నిక్స్ ద్వారా  2025 నాటికి ప్రతిసంవత్సరం 80000 మంది పుడతారని అంచనా వేయబడుతోంది. ముంబై లాంటి పట్టణాలలో సంప్రదాయేతర కుటుంబాలు అంటే సింగిల్ మదర్ ,ఓల్డర్ మదర్ లేక సింగిల్ ఫాదర్ ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయని చెబుతారు ముంబైలో సంతాన సాఫల్య కేంద్రాన్ని నడుపుతున్న అనిరుధ్ మాల్పని.
               ఈ అభివృధ్ధి న్యాయపరమైన, మానవసంబంధ,నైతికమైన సమస్యలకువిధ్యార్ధులు బయలాజికల్ సైన్స్ పాఠాలు నేర్చుకోవడానికి అవరోధాలు అవుతాయి.పక్షులు ,ఈగలే కాకఏ జంతువుల చర్మ కణాలైనా పునరుత్పత్తికారకాలవుతాయని చెప్పవలసి వస్తుందేమో.
                 సర్గోసీ నియమావళిని సవరించే చట్టం కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. మార్పును తొందరగా అంగీకరిచలేము.మన ఆలోచనా విధానాన్ని మార్చు కోవల్సి ఉంటుంది.సంప్రదాయకుతుంబాల కంటే ,సంప్రదాయేతర కుటుంబాల వారు పిల్లలు కావాలనే కోరికతో పొందుతారు కాబట్టి మిక్కిలి ప్రేమతో పెంచుతారు.వారు ఉత్పాదక పౌరులుగా ఎదుగుతారు అంటారు"-మాల్పని.
       కొన్నివిషయాలను మార్చకుండా ఉంటేనే బాగుంటుంది. సహజపధ్ధతిలో పిల్లలను కనడంఏ సన్మార్గము.మాతృత్వ సహజ భావనను పొందలేము కదా.పరిశొధనలు మానవ సంబంధాలను మెరుగు పరిచేవిగా ఉంటే బాగుంటుంది.
      "ది వీక్ లో పడిన ఆర్టికల్ ఆధారంగా రాసింది.

No comments:

Post a Comment