Thursday, October 16, 2014

భారతపద్యము


    శా. సింగంబాకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
            తంగ స్ఫూర్జిత యూధదర్సనసముద్యత్క్రోధమై వచ్చునో
            జం గాంతార నివాస ఖిన్నమతి న్స్మత్సేనపై వీడె వ
            చ్చెం గుంతీసుత మధ్యముండు సమర సేమాభి రామాకృతిన్.

                       పాండవుల ఉనికిని తెలుసుకోటానికి దుర్యోధనుడు కౌరవ సేనతో కలసి విరాట నగరంపైకి దండయాత్రకు వస్తాడు.అప్పటికే విరాటరాజు దక్షిణ గోగ్రహణ యుధం లో సుశర్మతో పోరాటానికి వెళతాడు.బృహన్నల రూపం లో నిన్న అర్జునుడు ఉత్తరునితో కలసి యుధ్ధభూమికి వస్తాడు.అది చూచి ద్రోణుడు సమయ బంగ మైనదేమొనని  సందేహాన్ని వెలిబుచ్చగా భీష్ముడు కాలేదని చెబుతాడు.అలా వస్తున్న అర్జునుని చూచి ద్రోణుడు భావిస్తాడు.
                  సిమ్హము ఆకలితో గుహలో ఉండి ఒక్కసారిగా మాతంగ సమూహాన్ని చూడగానే పెల్లుబికిన కోపం తో ఉరుకుతుందో అలాగే అరణ్య అఘ్నాత వాసాల్ని పూర్తిగా చేసిన అర్జునుడు కౌరవ సేనపైకి సమరము పై ఉత్సాహం తోవచ్చు చున్నాడు. వీరుడైన అర్జునుడు ఇంతకాలం చేతులు కట్టుకొని  ఆకలితో ఉన్న సిమ్హం వలె ఉన్నాడు అని తిక్కనపోల్చాడు."వీడే"అనడం లో కూడా ఔచిత్యం కనిపిస్తుంది.ఇది తిక్కన రచనా చమత్కృతి.

No comments:

Post a Comment